టీం ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్.. కి భారీగా డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ క్రికెట్ లో కాదు.. బేబీ సిట్టర్ గా.
టీం ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్.. కి భారీగా డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ క్రికెట్ లో కాదు.. బేబీ సిట్టర్ గా. ఆస్ట్రేలియా పర్యటనలో తనదైన ఆటతో ఆకట్టుకున్నాడు ఈ యువక్రికెటర్. ఇటీవల పంత్.. ఆసీస్ టీం కెపకటెన్ పైన్ పిల్లలను ఆడించి.. అతని భార్య బొన్ని పైన్ చేత బెస్ట్ బేబీ సిట్టర్ గా బిరుదు పొందిన సంగతి తెలిసిందే.
కాగా.. తన కుమార్తెను ఆడించడానికి బేబీ సిట్టర్ కావాలంటూ.. ఇటవల తండ్రి అయిన రోహిత్ శర్మ పంత్ ని కోరడం విశేషం. గుడ్ మార్నింగ్ అనే పంత్ ట్వీట్‌కు బదులిస్తూ.. ‘శుభోధయం బడ్డీ.. నీవు మంచి బేబీ సిట్టర్‌వని విన్నా. రితికాను సంతోషంగా ఉంచాలంటే నాకు ఓ బేబీ సిట్టర్ కావాలి అంటూ సరదాగా పేర్కొన్నాడు. ఇక రోహిత్ ఒక్కడే పంత్ సాయం కోరడం లేదు.. బొన్ని పైన్ సైతం మరోసారి పంత్ సాయం కోరింది.
‘పంత్ నీవు ఫ్రీగా ఉంటే మరోసారి నాపిల్లలను ఆడించవా!’ అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
