T20 WC 2021 : ‘వార్నర్ పని అయిపోయిందని రెచ్చగొట్టారు.. ఫలితం చూపించాడు’.. కెప్టెన్ ఆరోన్ ఫించ్..

By AN TeluguFirst Published Nov 15, 2021, 8:03 AM IST
Highlights

‘తన పని అయిపోయిందంటూ చాలామంది చాలా రకాలుగా రాశారు. నిజానికి అలాంటి సమయాల్లోనే వార్నర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడు. అయితే నా దృష్టిలో మాత్రం Adam Zampa ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. మార్ష్ ఈ రోజు అద్భుతంగా ఆడాడు. 

‘చాలా గర్వంగా ఉంది. ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియా తొలి జట్టుగా మేము నిలిచాం. టైటిల్ సాధించడం అంత తేలికైన విషయం కాదు అని మాకు తెలుసు. వ్యక్తిగతంగా, సమిష్టిగా అద్భుత ప్రదర్శన కనబరిచి ఇక్కడి దాకా చేరుకున్నాం’ అని టీ 20 వరల్డ్ కప్-221 చాంపియన్ Australia కెప్టెన్ ఆరోన్ ఫించ్ హర్హం వ్యక్తం చేశాడు.

ఆసీస్ కు ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఉన్న పొట్టి ఫార్మాట్ టైటిల్ గెలవడం పట్ల తన ఆనందాన్ని పంచుకున్నాడు. నవంబర్ 14 న్యూజిలాండ్ తో ఫైనల్ లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. david warner (38 బంతుల్లో 53 పరుగులు), మిచెల్ మార్ష్ (50 బంతుల్లో 77 పరుగులు, నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు. వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలవగా.. మార్ష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 

ఈ నేపథ్యంలో గెలుపు తరువాత కెప్టెన్ Aaron Finch మాట్లాడుతూ, వార్నర్, ఆడం జంపా, మార్ష్ పై ప్రశంసలు కురిపించాడు. ‘తన పని అయిపోయిందంటూ చాలామంది చాలా రకాలుగా రాశారు. నిజానికి అలాంటి సమయాల్లోనే వార్నర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడు. అయితే నా దృష్టిలో మాత్రం Adam Zampa ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. మార్ష్ ఈ రోజు అద్భుతంగా ఆడాడు. వేడ్ గాయం కారణంగా ఇబ్బంది పడగా స్టొయినిస్ తన పనిని పూర్తి చేశాడు’ అని చెప్పుకొచ్చాడు. 

T20 Worldcup 2021 విజేత ఆస్ట్రేలియా... ఫైనల్ మ్యాచ్‌లో తేలిపోయిన కివీస్ బౌలర్లు...

ఇదిలా ఉండగా.. ఆదివారం జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన జట్టునే విజయం వరించింది. కేన్ మామ సునామీ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్ పెట్టినా, దాన్ని కాపాడుకోవడంతో న్యూజిలాండ్ బౌలింగ్ యూనిట్ విఫలమైంది. దీంతో టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ టైటిల్ విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకి ఇది మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ టైటిల్ కాగా, ఓవరాల్‌గా ఆరో ప్రపంచకప్ (వన్డేల్లో ఐదుసార్లు వరల్డ్‌కప్ గెలిచింది ఆసీస్). తొలిసారి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ చేరిన న్యూజిలాండ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

173 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్‌కి శుభారంభం దక్కలేదు. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో డార్ల్ మిచెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ కలిసి రెండో వికెట్‌కి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికే కివీస్‌కి జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. మరో ఎండ్‌లో సిక్సర్‌తో ఖాతా తెరిచిన మిచెల్ మార్షన్ బౌండరీల మోత మోగించాడు. 

click me!