కోహ్లీపై సునీల్ గవాస్కర్ విమర్శలు.. ట్విట్టర్ లో మంజ్రేకర్ కౌంటర్

By telugu teamFirst Published Jul 30, 2019, 11:20 AM IST
Highlights

ప్రపంచకప్ లో సెమీ ఫైనల్స్ లోనే భారత్ వెను దిరగడానికి కారణమైన కోహ్లీని మళ్లీ కెప్టెన్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. వెస్టిండీస్ పర్యటనకు మళ్లీ కోహ్లీనే సారథిగా వ్యవహరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. కాగా.... సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ పై కామెంటేటర్ మంజ్రేకర్ స్పందించారు.
 

టీం ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ... ఇటీవల టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ లో సెమీ ఫైనల్స్ లోనే భారత్ వెను దిరగడానికి కారణమైన కోహ్లీని మళ్లీ కెప్టెన్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. వెస్టిండీస్ పర్యటనకు మళ్లీ కోహ్లీనే సారథిగా వ్యవహరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. కాగా.... సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ పై కామెంటేటర్ మంజ్రేకర్ స్పందించారు.

సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ ని తాను మర్యాదపూర్వకంగా అంగీకరించడంలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు. విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్ గా నియమించడం విషయంపై, టీం ఇండియా సెలక్టర్లపై గవాస్కర్ చేసిన కామెంట్స్ సరైనవి కావని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ లో భారత్ బాగా పోరాడిందని ప్రశంసించారు. టీం ఇండియా  7 మ్యాచ్ లు గెలిచి కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయిందన్న విషయం గుర్తు చేశారు. చివరగా... శరీర ఆకృతి కన్నా కూడా... ఒక సెలక్టర్ కి సమగ్రత చాలా ముఖ్యమని మంజ్రేకర్ పేర్కొన్నారు. 

కాగా... ''వెస్టిండిస్ పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేసే క్రమంలో సెలెక్టర్లు మరీ దారుణంగా వ్యవహరించారు. ప్రపంచ కప్ ఓటమి తర్వాత చేపడుతున్న ఈ పర్యటనకు కొద్దిరోజుల ముందువరకు కోహ్లీకి విశ్రాంతినివ్వనున్నట్లు వాళ్లే తెలిపారు. ఆ తర్వాత హటాత్తుగా ఏమయిందో ఏమోగానీ కోహ్లీని ఈ పర్యటన కోసం ఎంపికచేశారు. ఈ పరిణాలను పరిశీలిస్తే సెలెక్టర్ల కంటే కోహ్లీనే పవర్ ఫుల్ అనే విషయం అర్థమవుతోంది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని ఈ కమిటీ ఓ కుంటి బాతుసెలెక్షన్ కమిటీ.

కోహ్లీ కేవలం ప్రపంచ కప్ వరకే టీమిండియా కెప్టెన్. ఆ తర్వాత అతన్ని కెప్టెన్ గా కొనసాగించాలంటే దానికోసం ప్రత్యేకంగా సమావేశం జరగాల్సి వుంటుంది. అలా సెలెక్టర్లతో పాటు బిసిసిఐ అతడి వల్ల జట్టుకు భవిష్యత్ లో మంచి ప్రయోజనాలు చేకూతాయని భావిస్తే కొనసాగించవచ్చు. లేదంటే వేరే కెప్టెన్ ను సైతం ఎంపిక చేయవచ్చు. అలా కాకుండా ఆఘమేఘాల మీద విండీస్ పర్యటనలో అన్ని ఫార్మాట్లకు మళ్లీ కోహ్లీని కెప్టెన్ గా ఎంపిక చేయడం సెలెక్టర్ అసమర్ధతను సూచిస్తోంది.'' అంటూ గవాస్కర్ కోహ్లీ, సెలక్టర్లపై మండిపడిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ కే మంజ్రేకర్ పై విధంగా స్పందించాడు. 

click me!