Hardik Pandya: ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ను ముగించింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024 సీజన్ లో ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమైంది.
Hardik Pandya : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 లో చిట్టచివరి స్థానంతో ముంబై ఇండియన్స్ పోరు ముగిసింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఈ సీజన్ లో పేలవమైన ప్రదర్శన చేసింది. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ టీమ్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో దారుణ ప్రదర్శన చేయగా, కెప్టెన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్సీ విషషయంలో పలు చెత్త నిర్ణయాలు జట్టుకు భారీ నష్టం కలిగించాయి. అలాగే, హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత ఆటతోనూ అభిమానులను ఆకట్టుకోలేకపోయాడు. దీంతో చెత్త కెప్టెన్సీ, చెత్త ఫామ్ తో ముంబైని ముంచాడు అంటూ హార్ధిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలుతున్నాయి.
ఐపీఎల్ 2024 ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్‌గా, ఆటగాడిగా మర్చిపోలేని సీజన్ అనే చెప్పాలి. ఎందుకంటే అతని కెప్టెన్సీలో జట్టు విన్నింగ్ ట్రాక్ లో ముందుకు సాగలేకపోయింది. ఇక హార్దిక్ తన ఆల్ రౌండ్ షోను చూపించలేకపోయాడు. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 సీజన్ లో మొత్తం 14 మ్యాచుల్లో 18 సగటుతో 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 11 వికెట్లు తీసుకున్నప్పటికీ, ఎకానమీ రేటు 10.75 పైగా ఉండటం గమనించాల్సిన విషయం. కెప్టెన్సీ విషయానికి వస్తే ఐపీఎల్ లో విజయవంతమైన జట్టుగా ముంబైకి గుర్తింపు ఉంది. ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ను ఐపీఎల్ 2024 సీజన్ లో 14 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలతో ముగించి చివరి స్థానంలో నిలవడంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
RCB VS CSK : అయ్యో.. ఆర్సీబీని వర్షం దెబ్బకొట్టేలా ఉందే.. !
ఈ సీజన్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది ముంబై ఫ్రాంఛైజీ. ఆ సమయంలో క్రికెట్ లవర్స్ తో పాటు ముంబై ఇండియన్స్ అభిమానులు సైతం ఫ్రాంఛైజీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా అకౌంట్ ను అన్ ఫాలో చేయడంలో పాటు తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఈ సీజన్ లో లక్నో తో చివరి మ్యాచ్ ఆడిన ముంబై ఓటమి తర్వాత హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఈ సీజన్ లో నాణ్యమైన క్రికెట్ ఆడలేదనీ, చివరికి తమకు మొత్తం సీజన్‌లో నష్టం జరిగిందని చెప్పాడు. టీమ్ గా తాము నాణ్యమైన క్రికెట్, స్మార్ట్ క్రికెట్ ఆడలేకపోయామని చెప్పాడు.
ఏందిరా మావా ఇది.. ఆర్సీబీ ఇంట్లో సీఎస్కే రచ్చ.. షేక్ చేశారుగా.. !