RCB vs CSK : అయ్యో.. ఆర్సీబీని వ‌ర్షం దెబ్బ‌కొట్టేలా ఉందే.. !

By Mahesh Rajamoni  |  First Published May 18, 2024, 4:55 PM IST

RCB vs CSK Weather Update: ఐపీఎల్ 2024 లో ప్లేఆఫ్స్ కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేరుకోవాలంటే త‌న చివ‌రి లీగ్ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ పై మెరుగైన రన్ రేటుతో త‌ప్ప‌క గెల‌వాలి. అయితే, ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశ‌ల‌ను వ‌ర్షం దెబ్బ‌తీసేలా క‌నిపిస్తోంది. 
 


Royal Challengers Bangalore vs Chennai Super Kings : ఐపీఎల్ 2024 లో ఇప్ప‌టికే మూడు జ‌ట్లు ప్లేఆఫ్స్ అర్హ‌త సాధించాయి. వాటిలో కోల్ క‌తా టాప్ లో ఉండ‌గా, తర్వాతి స్థానాల్లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు ఉన్నాయి. 4వ స్థానంలో కోసం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు రేసులో ఉన్నాయి. నాలుగో స్థానం కోసం ఆర్సీబీ ఎలాగైన చెన్నై పై మంచి ర‌న్ రేటుతో గెల‌వాల‌ని చూస్తోంది. అయితే, ప్ర‌స్తుతం వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే వ‌ర్షం బెంగ‌ళైరు ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లేలా క‌నిపిస్తోంది.

బెంగ‌ళూరును ఇప్ప‌టికే మేఘాలు క‌మ్మేశాయి. వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయ‌ని వాతావ‌ర‌ణ నివేదిక‌లు పేర్కొంటున్నాయి. దీంతో సెకండ్ ఆఫ్ లో అద్భుత‌మైన ఆట‌తో వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతోంది ఆర్సీబీ. ఈ క్ర‌మంలోనే ప్లేఆఫ్ రేసులో ఇప్ప‌టివ‌ర‌కు ఉంది. చెన్నై తో చావోరేవో ప్లేఆఫ్స్ పోరుకు సిద్ధ‌మైంది. అయితే, ఈ మ్యాచ్ కు వ‌ర్షం అడ్డంకిగా మారే అవ‌కాశ‌ముంది. డూ ఆర్ డై మ్యాచ్ లో వ‌ర్షం ప‌డొద్ద‌నీ, బెంగ‌ళూరు గెల‌వాల‌ని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Latest Videos

ఏందిరా మావా ఇది.. ఆర్సీబీ ఇంట్లో సీఎస్కే రచ్చ.. షేక్ చేశారుగా.. !

కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ లు ఇప్ప‌టికే ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ కు అర్హ‌త సాధించాయి. చివ‌రి బెర్త్ కోసం ఆర్సీబీ-సీఎస్కే జట్లు శ‌నివారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో త‌ల‌ప‌డనున్నాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచి మెరుగైన ర‌న్ రేటుతో సీఎస్కేకు చెక్ పెట్టాల‌ని చూస్తోంది. ప్ర‌స్తుతం చెన్నై సూప‌ర్ కింగ్స్ 13 మ్యాచ్ లు ఆడి 7 మ్యాచ్ ల‌లో గెలిచి 14 పాయింట్లు సాధించింది.     +0.528 గా ర‌న్ రేటు ఉంది. ఇక ఆర్సీబీ 13 మ్యాచ్ ల‌ను ఆడి 6 మ్యాచ్ ల‌లో గెలిచి 12 పాయింట్లు, నెట్ ర‌న్ రేటు +0.387 గా ఉంది. ఈ మ్యాచ్ లో మంచి స్కోర్ తో గెలిచి ర‌న్ రేటు పెంచుకుంటే ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది. ఒక‌వేళ ఆర్సీబీ ఓడిపోతే చెన్నై ప్లేఆఫ్స్ కు అర్హ‌త సాధిస్తుంది. ఆర్సీబీ మెరుగైన‌ నెట్ ర‌న్ రేటు కావాలంటే క‌నీసం 18 ప‌రుగుల తేడాతో గెల‌వాలి లేదా 11 బంతులు మిగిలి ఉండ‌గానే లక్ష్యాన్ని ఛేదించాలి.

RCB : బెంగ‌ళూరులో ఆర్సీబీ ఫ్యాన్స్ ర‌చ్చ మాములుగా లేదు.. ఇక మ్యాచ్ అయితే.. !

అయితే వర్షం కురిసే అవకాశం ఉందన్న ఆర్సీబీ, ఫ్యాన్స్ భారీ అంచనాలు, ఆశ‌ల మ‌ధ్య డ్రామా నెలకొంది. వ‌ర్షం ప‌డితే చెన్నై టీమ్ ప్లేఆఫ్స్ కు వెళ్తుంది. అయితే ఆర్సీబీ కనీసం 18 పరుగుల తేడాతో గెలవాలి లేదా మరో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదిస్తే చెన్నై ఇంటికి పంపి ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది. టోర్నమెంట్ చివరి దశలో సూప‌ర్ ఫామ్ లో ఉన్న ఆర్సీబీ మ‌రో అద్భుత‌మైన పోరాటానికి సిద్ధంగా ఉంది. ఆరు మ్యాచ్ ల పరాజయ పరంపరను తట్టుకుని వరుసగా ఐదు విజయాలు సాధించి అద్భుత పునరాగమనం చేసింది ఆర్సీబీ. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కోహ్లీ గత ఐదు ఇన్నింగ్స్ ల్లో మూడు అర్ధసెంచరీలతో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. వ‌రుణుడు క‌రునిస్తే బెంగ‌ళూరు త‌న అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటుందో లేదో చూడాలి.. ! 

IPL 2024: టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఫామ్‌లోకి.. రోహిత్ శర్మ సూప‌ర్ హాఫ్ సెంచ‌రీ

click me!