Hardik Pandya: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024 సీజన్ ను దారుణంగా ముగించింది. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్ లో ముంబై చివరి మ్యాచ్ తర్వాత కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది.
Hardik Pandya banned : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 లో ముంబై ఇండియన్స్ పోరు ముగిసింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఈ సీజన్ లో పేలవమైన ప్రదర్శనతో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ముంబై అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ సీజన్ లో ముంబై తన చివరి మ్యాచ్ లోనూ ఓటమిపాలైంది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగి ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ రాణించకపోవడంతో 214 టార్గెట్ ముందు 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (68), నమన్ ధీర్ (62) లు హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లు ఆడినా మిగతా ప్లేయర్లు రాణించకపోవడంతో ముంబై ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
హార్దిక్ కు భారీ జరిమానా, రాబోయే ఐపీఎల్ మ్యాచ్ లో నిషేధం..
undefined
ఈ మ్యాచ్ ఓటమి, తన కెప్టెన్సీలో దారుణ ప్రదర్శన పరిస్థితుల మధ్య హార్ధిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. భారీ జరిమానాతో పాటు రాబోయే ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించబడింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు నిషేధానికి గురైన హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆడలేడని బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. "మే 17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు అతనికి జరిమానా విధించబడింది" అని బీసీసీఐ తెలిపింది.
ఐపీఎల్ 2025 లో కొత్త కెప్టెన్ బరిలోకి ముంబై..
అయితే, ప్రస్తుత సీజన్ లో ముంబై ఆడాల్సిన మ్యాచ్ లు ఇంకా లేకపోవడంతో వచ్చే సీజన్ లో మొదటి మ్యాచ్ లో హార్దక్ పై ఈ నిషేధం ఉండనుంది. దీంతో వచ్చే సీజన్ లో ముంబై ఇండియన్స్ మరో కొత్త కెప్టెన్ తో ఐపీఎల్ 2025 సీజన్ ను ప్రారంభించనుంది. స్లోఓవర్ రేటు కారణంగా ఇప్పటికే ఈ సీజన్ లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ పై కూడా రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం ఎదుర్కొన్నాడు. ఇప్పుడు హార్ధిక్ పాండ్యా కూడా స్లోఓవర్ రేటు కారణంగా ఒక మ్యాచ్ నిషేధంతో పాటు అతని మ్యాచ్ ఫీజులో రూ.30 లక్షల జరిమానా విధించింది. అలాగే, ముంబై ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా మ్యాచ్ ఆడిన ఆటగాళ్లకు రూ. 12 లక్షలు లేదా వారి సంబంధిత మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు.
IPL 2024: టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఫామ్‌లోకి.. రోహిత్ శర్మ సూపర్ హాఫ్ సెంచరీ