RCB : బెంగ‌ళూరులో ఆర్సీబీ ఫ్యాన్స్ ర‌చ్చ మాములుగా లేదు.. ఇక మ్యాచ్ అయితే.. !

Published : May 18, 2024, 03:32 PM IST
RCB :  బెంగ‌ళూరులో ఆర్సీబీ ఫ్యాన్స్ ర‌చ్చ మాములుగా లేదు.. ఇక మ్యాచ్ అయితే.. !

సారాంశం

RCB fans : ఐపీఎల్ 2024 లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు-చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు చిన్న‌స్వామి స్టేడియంలో త‌ల‌ప‌డనున్నాయి. ప్లేఆఫ్స్ లో చోటుద‌క్కించుకోవాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ కావ‌డంతో ఇరు జ‌ట్ల ఫ్యాన్స్ స్టేడియం ద‌గ్గ‌ర సందడి చేస్తున్నారు.   

Royal Challengers Bangalore : ఐపీఎల్ ఏ సీజ‌న్ అయిన స‌రే ఆ జ‌ట్టు ఫ్యాన్స్ ర‌చ్చ మాములుగా ఉండ‌దు. గెలుపు ఓటముల‌తో సంబంధం లేకుండా త‌మ జ‌ట్టుకు మ‌ద్ద‌తు ఇస్తూనే ఉంటారు. త‌మ జ‌ట్టు ప్లేయ‌ర్ల‌ను ఉత్సాహాప‌రుస్తూనే ఉంటారు. త‌మ ప్లేయ‌ర్లు బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపితే ఆ ఆ రచ్చ మాములుగా ఉండ‌దు. స్టేడియం హోరెత్తుతుంది.. సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. ఆ జ‌ట్టే విరాట్ కోహ్లీ టీమ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. ఐపీఎల్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ క‌లిగిన బెంగ‌ళూరు టీమ్ శ‌నివారం కీల‌క మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డుతోంది.

ప్లేఆఫ్స్ లో చోటుద‌క్కించుకోవాలంటే బెంగ‌ళూరు ఈ మ్యాచ్ లో త‌ప్ప‌క‌గెల‌వాల్సి ఉంటుంది. అలాగే, ఒక‌వేళ ఓడిపోతే ఈ సీజ‌న్ లో ఆర్సీబీకి ఇదే చివ‌రి మ్యాచ్ అవుతుంది. దీంతో ఆర్సీబీ అభిమానులు చిన్న స్వామి స్టేడియం వ‌ద్ద ర‌చ్చ మొద‌లు పెట్టారు. త‌మ అభిమాన టీమ్ ఆర్సీబీ గెల‌వాల‌ని స్టేడియం వ‌ద్ద పెద్ద సంఖ్య‌లో బైకుల‌తో ర్యాలీ చేప‌ట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. అలాగే, చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్యాన్స్ సైతం స్టేడియం వ‌ద్ద‌కు భారీగా చేరుకుంటున్నారు. మ్యాచ్ ఎలా జ‌రుగుతుందో తెలియ‌దు కానీ, ఇరు జ‌ట్ల ఫ్యాన్స్ ర‌చ్చ తో స్టేడియం షేక్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

 

 

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ