అమెరికాలో జరుగుతున్న తాజా పరిణామాలు అక్కడున్న ప్రవాస భారతీయులను ఆందోళనకు గురిచేస్తున్నాయని, భవిష్యత్తు గురించి ఆలోచనలో పడేలా చేస్తున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
అమెరికాలో జరుగుతున్న తాజా పరిణామాలు అక్కడున్న ప్రవాస భారతీయులను ఆందోళనకు గురిచేస్తున్నాయని, భవిష్యత్తు గురించి ఆలోచనలో పడేలా చేస్తున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో హెచ్1బి వీసాపై వచ్చిన ఉద్యోగుల జీవిత భాగస్వామ్యులకు వర్క్ పర్మిట్ (ఈఏడి)ని జారీ చేసే విషయంలో ట్రంప్ సర్కారు కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఇటీవలి వార్తల్లో మనం తెలుసుకున్నాం. ఇదే జరిగితే అనేక మంది భారతీయులు అమెరికా వదలి భారత్‌కు తిరిగి వచ్చే ఆస్కారం ఉంది.
కాగా.. ఇప్పుడు ఇదే విషయాన్ని తాజా అధ్యయనాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. టెన్నెస్సీ విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్టోఫర్ జేఎల్ కన్నింగ్‌హామ్, కెమ్మీ బిజినెస్ స్కూల్‌కు చెందిన పూజ బి విజయ్‌కుమార్ నిర్వహించిన సర్వేలో కొన్ని ఆందోళన కలిగించే విషయాలు వెలువడ్డాయి.
undefined
హెచ్1బి, హెచ్4 వీసాల విషయంలో ట్రంప్ తన నిర్ణయాన్ని యధాతథంగా అమలు చేస్తే దాదాపుగా లక్ష మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోతారని ఈ అధ్యయనంలో తేలింది. ఈ సర్వేలో భాగంగా, మొత్తం 1800 మంది ప్రవాస భారతీయ కుటుంబాలతో వారు మాట్లాడిన తర్వాత, తుది నివేదిక కోసం 416 మంది అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని ఈ అధ్యయం చేశారు.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది భారతీయులు అమెరికాను వదిలి స్వదేశానికి వెళ్లడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరోవైపు అమెజాన్, గూగుల్ వంటి పలు కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసుల వివరాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు సేకరించం కూడా మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇదంతా చూస్తుంటే, ట్రంప్ తన మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయటానికి వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.