కోరిక తీరిస్తేనే ట్రాన్స్‌ఫర్.. అధికారులపై మహిళా హోంగార్డుల ఫిర్యాదు

Published : Nov 04, 2018, 12:51 PM ISTUpdated : Nov 04, 2018, 12:57 PM IST
కోరిక తీరిస్తేనే ట్రాన్స్‌ఫర్.. అధికారులపై మహిళా హోంగార్డుల ఫిర్యాదు

సారాంశం

#MeeToo ఉద్యమం దేశవ్యాప్తంగా ఉన్నత హోదాల్లో ఉన్నవారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తోంది. ఇప్పుడు ఈ శాఖ గుజరాత్ పోలీస్ శాఖను తాకింది. ట్రాన్స్‌ఫర్ చేయమని కోరినందుకు.. కోరిక తీర్చాలని వేధింపులకు గురిచేశారంటూ ఉన్నతాధికారులపై మహిళా హోంగార్డులు ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది.

#MeeToo ఉద్యమం దేశవ్యాప్తంగా ఉన్నత హోదాల్లో ఉన్నవారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తోంది. ఇప్పుడు ఈ శాఖ గుజరాత్ పోలీస్ శాఖను తాకింది. ట్రాన్స్‌ఫర్ చేయమని కోరినందుకు.. కోరిక తీర్చాలని వేధింపులకు గురిచేశారంటూ ఉన్నతాధికారులపై మహిళా హోంగార్డులు ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది.

కోరుకున్న చోటికి బదిలీ కావాలంటే పై అధికారులు కోరికలు తీర్చమంటున్నారంటూ సూరత్‌కు చెందిన 25 మంది మహిళా హోంగార్డులు శుక్రవారం నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా పై అధికారులు తమను మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారని.. నాలుగు పేజీలతో కూడిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బదిలీ కావాలంటే డబ్బులివ్వాలని.. లేదంటే కోరిక తీర్చాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ అధికారైతే యూనిఫామ్ సరిచేసుకోవాలని తాకరని చోట చేతులు వేస్తూ.. అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. వీరి ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్.. ఈ ఫిర్యాదును డీసీపీకి పంపించామని.. జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీ విచారణ ప్రారంభించిందని తెలిపారు.

హోంగార్డులు పోలీస్ శాఖ పరిధిలోకి రారని.. దీంతో పోలీసులు అంతర్గత కమిటీ కాకుండా స్థానిక ఫిర్యాదుల కమిటీ విచారణ జరుపుతుందన్నారు. అలాగే ఫిర్యాదును హోంమంత్రితో పాటు ముఖ్యమంత్రికి కూడా పంపినట్లు సీపీ తెలిపారు.
 

#మీటూ: మాట మార్చిన నటుడు!

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

#మీటూ ఎఫెక్ట్: రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

అలా ‘మీటూ’ రానా కు కలిసి వచ్చింది

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

మీటూ ఎఫెక్ట్...ఆ ఎన్నారై జర్నలిస్టుతో సంబంధం ఉంది...కానీ...: ఎంజే. అక్బర్

పల్లవి వల్లే మా కుటుంబంలో అశాంతి: ఎంజె అక్బర్ భార్య

ఒక్క ముద్దుకి రూ.15వేలు.. ప్రభుత్వ ఉద్యోగిపై మీటూ ఆరోపణలు

మీటూ: కమల్ - రజిని ఎక్కడ?.. ఆన్సర్ ఇవ్వాలట!

టాలీవుడ్ మీటూ.. నలుగురు నిర్మాతలు, ఇద్దరు హీరోలపై ఆరోపణలు!

'మీటూ' పై ర‌జ‌నీకాంత్ భార్య చాలా తెలివిగా కామెంట్!

PREV
click me!

Recommended Stories

Richest Village: 17 బ్యాంకులు, రూ. 7 వేల కోట్లు ఎఫ్‌డీలు.. ఆసియాలోనే ధ‌నిక గ్రామం మాధాప‌ర్ విశేషాలు
Pongal: నిజ‌మైన సంక్రాంతి అంటే వీళ్ల‌దే.. ప్ర‌భుత్వం నుంచి ఒక్కో కుటుంబానికి రూ. 13 వేలు సాయం