శబరిమల వివాదం... మహిళలపై తరతరాలుగా నిషేధం, ఆధారం ఇదే

By sivanagaprasad kodatiFirst Published Nov 23, 2018, 10:52 AM IST
Highlights

సుమారు 200 ఏళ్ల కిందట మనదేశాన్ని పరిపాలించిన బ్రిటీష్ వారు శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించినట్లు బ్రిటిష్ పత్రాల ద్వారా స్పష్టమైంది. ‘‘మెమొయిర్ ఆఫ్ ది సర్వే ట్రావెన్ కోర్ అండ్ కొచ్చిన్’’ పేరిట బ్రిటీష్ ప్రభుత్వం రెండు భారీ సంపుటాలను ప్రచురించింది. 

10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు శబరిమలలో ఆలయ ప్రవేశంపై నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దీనిని సాంప్రదాయవాదులు వ్యతిరేకిస్తూ.. మహిళలు శబరిమలలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారు.

ఇది ఈనాటిది కాదని, తరతరాలుగా అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమం వయసులో ఉన్న మహిళల ప్రవేశంపై నిషేధం ఉందని వారు వాదిస్తు్నారు. ఈ క్రమంలో వారికి ఒక ఆధారం దొరికింది. సుమారు 200 ఏళ్ల కిందట మనదేశాన్ని పరిపాలించిన బ్రిటీష్ వారు శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించినట్లు బ్రిటిష్ పత్రాల ద్వారా స్పష్టమైంది.

 ‘‘మెమొయిర్ ఆఫ్ ది సర్వే ట్రావెన్ కోర్ అండ్ కొచ్చిన్’’ పేరిట బ్రిటీష్ ప్రభుత్వం రెండు భారీ సంపుటాలను ప్రచురించింది. మద్రాస్ ఇన్‌ఫ్యాంట్రీకి చెందిన లెఫ్టినెంట్‌‌లు బెంజమిన్ స్వైన్, పీటర్ ఐర్ కానర్ ఐదేళ్లపాటు పర్యటించి ఈ సర్వే  నిర్వహించారు.

1820లో పూర్తయిన ఈ సర్వే వివరాలతో 1893లో ఒక సంపుటి, 1901లో మరో సంపుటిని ప్రచురించారు. పర్వతం వెలిసిన ఈ ఆలయాన్ని ‘‘చౌరిముల్ల’’కు అంకితం చేసినట్లుగా తెలిపారు. దీనిని ‘‘ పర్వత దేవత’’ల ఆలయంగా వివరించారు.

ఇందులోకి ‘‘రజస్వల అయిన తర్వాతి నుంచి నిర్ధిష్టంగా కొంత వయసు వరకు మహిళలు ప్రవేశించకూడదు’’ అని రాశారు. పవిత్రమైన పదునెట్టాంబడి (18 మెట్లు)కు అప్పటికే రాగితో తాపడం చేశారని పత్రాల్లో పేర్కొన్నారు. ఆ రోజుల్లోనే ప్రతి ఏడాది జనవరి నెలలో ఐదు రోజుల పాటు 10 నుంచి 15 వేల మంది భక్తులు వచ్చేవారని వివరించారు.

ఈ పత్రాలపై చరిత్రకారుడు శశిభూషణ్ స్పందించారు. రుతుక్రమంలో ఉన్న మహిళలకు శబరిమలలోకి ప్రవేశంపై బ్రిటిష్ ప్రభుత్వ నివేదికే తిరుగులేని ఆధారమని తేల్చి చెప్పారు. ట్రావెన్ కోర్ సంస్థానంలో ఇది అలిఖిత చట్టంగా అమలైందని, 1991లో కేరళ హైకోర్టు ఈ నిషేధానికి చట్టబద్ధత కల్పించిందన్నారు. 

శబరిమలకు తృప్తిదేశాయ్.. కొచ్చి ఎయిర్‌పోర్టు దిగ్బంధం

శబరిమల ఆలయ రహస్యం: అయ్యప్ప ఎవరి పుత్రుడు, గుడి ఎవరిది...

శబరిమలలో ఉద్రిక్తతలకు మెట్టుగూడ అయ్యప్ప గుడికి లింకేంటీ?

శబరిమలలో హై టెన్షన్: ఆలయంలో లోపల మహిళా పోలీసులు

శబరిమల హోటళ్లలో మహిళలు.. గవర్నర్‌కు ఎమ్మెల్యే లేఖ

శబరిమల వివాదంపై మంచు మనోజ్ కామెంట్!

శబరిమలలోకి మహిళల ప్రవేశం..517 కేసులు.. 3,345 మంది అరెస్ట్

శబరిమల వ్యవహారాన్ని టాయ్ లెట్ తో పోల్చిన కమల్ హాసన్ సోదరుడు

శబరిమల ప్రవేశం: మహిళల పట్ల వివక్ష అనడం దురదృష్టకరం..ప్రమాదం

శబరిమల దాకా వెళ్లి వెనక్కి మళ్లిన ఏపీ మహిళ

శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి ప్రవేశం కోసం మహిళల యత్నం, రాళ్లదాడి

click me!