"రోడ్డు కార్పెట్" .. నాసిరకం రోడ్డును చేతులతో ఎత్తి చూపుతున్న స్థానికులు.. వీడియో వైరల్..

Published : Jun 02, 2023, 04:26 AM ISTUpdated : Jun 02, 2023, 06:48 AM IST
"రోడ్డు కార్పెట్" .. నాసిరకం రోడ్డును చేతులతో ఎత్తి చూపుతున్న స్థానికులు.. వీడియో వైరల్..

సారాంశం

మహారాష్ట్ర గ్రామస్థులు కొత్తగా నిర్మించిన రహదారిని ఒట్టి చేతులతో ఎత్తడం వీడియో చూపిస్తుంది. రోడ్డు నిర్మాణంలో నాసిరకం పనులకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

రెడ్ కార్పెట్ లాగా.. రోడ్డు కార్పెట్ ను ఎప్పుడైనా చూశారా? కానీ.. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డు కార్పెట్ కూడా ఉంటుందా అనే సందేహం ప్రారంభమవుతోంది. ఓ కాంట్రాక్టర్ పని తనాన్ని స్థానికులు ఎత్తి చూపుతున్నారు. ఇటివల నిర్మించిన రోడ్డు కింద టార్పాలిన్ లాంటి మెటీరియల్ వేసి దాని పైన తారు వేశారనీ, అతడు నాశిరకమైన రోడ్డు నిర్మించారని స్తానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.  38-సెకన్ల నిడివి గల ఈ క్లిప్ లో రాణా ఠాకూర్‌గా అనే స్థానిక కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణంలో పాతరోడ్డుమీద   టార్పాలిన్ లాంటి మెటీరియల్ వేసి దాని పైన తారు వేశారు. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. 

ఫ్రీ ప్రెస్ జర్నల్ ప్రకారం..ఈ సంఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంబాద్ తాలూకాలో భాగమైన కర్జాత్-హస్త్ పోఖ్రీలో జరిగింది. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (PM గ్రామీణ సడక్ యోజన) కింద ఈ రహదారిని నిర్మించారు.రోడ్డు నిర్మాణం కోసం జర్మన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు కాంట్రాక్టర్ పేర్కొన్నాడు.  అయితే, వీడియోలో చూడగలిగినట్లుగా, గ్రామస్తులు తాత్కాలిక పరిష్కారాన్ని బహిర్గతం చేయడంతో వాగ్దానం బూటకమని నిరూపించబడింది. స్థానిక ప్రజలు కూడా మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నాసిరకం పని, ఇంజనీర్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

మేక్ ఇన్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం.. భారతదేశం దాదాపు 63.32 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌తో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. రహదారి నిర్మాణాన్ని అమలు చేయడానికి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వివిధ ఏజెన్సీలను కలిగి ఉంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్స్ , యూనియన్ టెరిటరీస్, నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ , ఇండియన్ హైవేస్ అకాడమీ ఆఫ్ ఇంజనీర్స్ (IAHE). సాంప్రదాయ రహదారి నిర్మాణంలో మన్నికను నిర్ధారించడానికి కంకర, ఇసుక,  కుదించబడిన మట్టి మిశ్రమం ఉపయోగించబడుతుంది. ఇటీవలి సంవత్సరాలలో ఇంజనీర్లు రహదారి యొక్క మన్నికను పెంచడానికి కాంక్రీటును ఉపయోగించడం ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu