దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

By narsimha lodeFirst Published Sep 3, 2018, 11:37 AM IST
Highlights

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో నిఖా హలాల పేరుతో  మహిళలపై  అత్యాచారాలు చోటు చేసుకొన్న ఘటనలు పెరుగుతున్నాయి.  ఈ నియమం పేరుతో తమ జీవితాలతో ఆడుకొంటున్నారు

లక్నో:ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో నిఖా హలాల పేరుతో  మహిళలపై  అత్యాచారాలు చోటు చేసుకొన్న ఘటనలు పెరుగుతున్నాయి.  ఈ నియమం పేరుతో తమ జీవితాలతో ఆడుకొంటున్నారు. తాజాగా నిఖా హలాల పేరుతో  కోడిలిపై స్వంత మామా అత్యాచారానికి  పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

స్వంత మామాతో పాటు మరో నలుగురు  వ్యక్తులు  తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా యూపీకి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూపీలోకి మొరాదాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళకు  2014 డిసెంబర్‌లో పెళ్లి అయింది.

పెళ్లైన  కొంత కాలానికే  అత్తమామల వేధింపులు ప్రారంభమయ్యాయి.  దీంతో 2015 లో ఆమెను ఇంటి నుండి బయటకు పంపారు. దీంతో  బాధితురాలు  పోలీసులను  ఆశ్రయించింది. కొద్ది రోజులకు నిఖా హలాలను ముందుకు తీసుకెళ్లారు. తనకు విడాకులు ఇవ్వాలని  ఆచారం ప్రకారం మరో పెళ్లి చేసుకోవాలని మహిళకు సూచించారు. మామయ్యతో కాపురం చేయాలని వేధింపులకు గురి చేసినట్టు  బాధితురాలు ఆరోపిస్తోంది.

నిఖా హలాలాలో భాగంగా మామతో పెళ్లికి నిరాకరించిందని బాధిత మహిళను భర్త గదిలో బంధించాడు.  నియమం పేరుతో కోడలిపై మామ అత్యాచారానికి పాల్పడ్డాడు.  అంతేకాదు రాత్రి పూట కోడలిపై అత్యాచారానికి పాల్పడిన మామ... తెల్లారే కోడలికి విడాకులు ఇచ్చాడు.  భర్త బంధువులైన మరో ముగ్గురు కూడ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు  చెప్పారు.

దీంతో తాను గర్భం దాల్చినట్టు బాధితురాలు చెప్పారు. 2017లో తనకు కొడుకు పుట్టినట్టు ఆమె చెప్పారు. నిఖా హలాల పేరుతో అత్యాచారం చేసిన అత్తింటి వారిపై బాధితురాలు  ఆదివారం నాడు మొరాదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు  తనతో పాటు  తన కుటుంబసభ్యులను చంపేస్తారని బెదిరించారని  బాధితురాలు ఆరోపించారు.

ఈ వార్త చదవండి

నపుంసకుడు, నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్: టెక్కీపై భార్య ఆరోపణలు

 

click me!