Feb 29 : Top Ten News @6PM .. ఏషియానెట్‌లో టాప్ 10 వార్తలు

By Siva Kodati  |  First Published Feb 29, 2024, 5:38 PM IST

ఫిబ్రవరి 29, 2024న ఏషియానెట్‌లో సాయంత్రం 6 గంటల వరకు టాప్ 10 వార్తలు ఇవే. 


రా.. మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం: సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈ రోజు మీడియాతో చిట్ చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రా.. మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం అని అన్నారు. తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని పేర్కొన్నారు. తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వస్తానని, రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మల్కాజ్‌గిరి నుంచి తనపై పోటీకి రావాలని సవాల్ చేశారు. సిద్ధమా? అని ప్రశ్నించారు. పూర్తి కథనం 

Latest Videos

బీఆర్ఎస్‌కు షాక్: బీజేపీలో చేరిన నాగర్ కర్నూల్ ఎంపీ రాములు

నాగర్ కర్నూల్ ఎంపీ  పి. రాములు  గురువారంనాడు  భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. 2019 ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పి. రాములు పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  బీఆర్ఎస్ ను వీడాలని  నిర్ణయం తీసుకున్నారు. దరిమిలా  పి. రాములు ఇవాళ న్యూఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. పూర్తి కథనం

జగన్‌ను నాలుగో పెళ్లాంగా రమ్మంటావా.. నీ రాజకీయాలే తేడా అనుకున్నా , కానీ : పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

జగన్‌ను అథ:పాతాళానికి తొక్కేస్తానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని.  2014 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సున్నా సీట్లే తీసుకున్నాడని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబును పాతాళానికి తొక్కేది పవన్ కళ్యాణ్ మాత్రమేనంటూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కనీసం ఒక్క మాట కూడా పవన్ గురించి మాట్లాడలేదని..పవన్‌ను పురాణాల్లో శల్యుడితో పోల్చవచ్చన్నారు. పూర్తి కథనం

జగన్‌ను అథ:పాతాళానికి తొక్కేస్తానన్న పవన్ కళ్యాణ్ .. రోజా స్ట్రాంగ్ కౌంటర్

వైసీపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి ఆర్కే రోజా. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు జగనన్నను అథ:పాతాళానికి తొక్కుతావా అంటూ రోజా మండిపడ్డారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా వుండి 24 సీట్లకే పరిమితమైపోయి మళ్లీ క్యాడర్‌ను తిడుతున్నాడంటూ మంత్రి ఎద్దేవా చేశారు. బూత్ కమిటీలు, మండల కమిటీలను పార్టీ అధ్యక్షుడు ఏర్పాటు చేయాలని రోజా ధ్వజమెత్తారు. పూర్తి కథనం

నాపై పోటీ చేసి గెలవాలి: కేసీఆర్‌కు వంశీచంద్ రెడ్డి సవాల్

మహబూబ్ నగర్ లోక్ సభ స్థానంలో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినాయకుడు కే చంద్రశేఖర్ రావుకు సంచలన లేఖ రాశారు. మహబూబ్ నగర్ ప్రజలను కేసీఆర్ మోసం చేశాడని ఆరోపించారు. తనకు రాజకీయ పునర్మజన్మ ఇచ్చిన మహబూబ్ నగర్ అంటే కేసీఆర్‌కు నచ్చదని పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో వారు ఏ తప్పు చేయలేదని చెప్పై ధైర్యం ఉంటే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. పూర్తి కథనం

లీప్ ఇయర్ లో.. ఫిబ్రవరి 29న పుట్టిన ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?

ఈరోజు( పిబ్రవరి 29) చాలా స్పెషల్. అది అందరకి తెలిసిందే.. ఇది లీప్ ఇయర్ డే. నాలుగు ఏళ్లకు ఒక్క సారి వచ్చే రోజు ఇది. ఈ డేట్ చాలా మందికి స్పెషల్. ముఖ్యంగా ఈరోజు పుట్టిన వారికి మరీ స్పెషల్ అనాలి. అంతే కాదు ఈరోజు పెళ్ళి చేసుకున్నవారు కూడా చాలా స్పెషల్ అనే చెప్పాలి. అయితే సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీలెందరో ఈ లీప్ ఇయర్ డే రోజు పుట్టారు. పూర్తి కథనం

ఎన్నికల వేళ మెగా-నందమూరి హీరోల మధ్య నాగబాబు చిచ్చు... క్షమాపణలు చెప్పినా నో యూజ్!

నాగబాబు అనాలోచితంగా చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి దారితీశాయి. పొట్టి హీరోలు పోలీస్ పాత్రలకు నప్పరు అని ఆయన అన్నారు. ఇది మెగా-నందమూరి ఫ్యాన్ వార్ కి దారి తీసింది. ఇటీవల వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఈ వేదికపై నాగబాబు మాట్లాడుతూ... ఐదు అడుగుల మూడు అంగుళాల హీరో పోలీస్ అంటే.. వీడు పోలీస్ ఏంట్రా బాబు అనిపిస్తుంది. కొన్ని పాత్రలు చేయాలంటే హైట్ ఉండాలి... అని అన్నారు. పూర్తి కథనం

#Chinmayi: సింగర్ చిన్మయిపై హైదరాబాద్ పోలీస్ కేసు ,కారణం ఏంటంటే

ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో మీడియాకు ఎక్కుతూంటుంది  గాయని, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి శ్రీపాద. ఆమె పై తాజాగా గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో (Gachibowli Police Station) కేసు నమోదు అయ్యింది. ఆమె రెండు రోజుల క్రితం భారతదేశం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు గురించి హెచ్ సీయూ విద్యార్థి కుమార్‌ సాగర్‌ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆమె పై కేసు నమోదు చేశారు. పూర్తి కథనం

టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక సార్లు 5 వికెట్లు తీసిన టాప్-5 భార‌త బౌల‌ర్లు వీరే !

అంత‌ర్జాతీయ క్రికెట్ కు భార‌త్ అద్భుత‌మైన ప్లేయర్లను అందించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతాలు చేసిన భార‌త ప్లేయ‌ర్లు చాలా మంది ఉన్నారు. ఇక బౌలింగ్ విష‌యానికి వ‌స్తే అత్య‌ధిక సార్లు 5 వికెట్లు తీసిన టాప్-5 బౌల‌ర్ల‌లో అనిల్ కుంబ్లే, ర‌విచంద్ర‌న్ అశ్విన్ లు స‌మంగా నిలిచాడు. టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక సార్లు 5 వికెట్లు తీసిన ఇండియ‌న్ బౌల‌ర్ల జాబితా ఇలా ఉంది.. పూర్తి కథనం

బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ! టెస్టు క్రికెటర్లపై కోట్ల వర్షం ! దేశ‌వాళీ క్రికెట్ లో ఏదో జ‌రుగుతోంది?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పుడు దేశ‌వాళీ క్రికెట్, రెడ్ బాల్ క్రికెట్‌కు సంబంధించి కొత్త ప్రణాళికను రూపొందించడంలో బిజీగా ఉంది. భారత ఆటగాళ్లను డొమెస్టిక్, రెడ్ బాల్ క్రికెట్ వైపు ఆకర్షించేందుకు మ్యాచ్ ఫీజులను పెంచే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. టెస్ట్, దేశీయ స్థాయిలో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు/రిటైనర్‌షిప్ విలువను పెంచే ప్రతిపాదనను బోర్డు స్వీకరించింది. పూర్తి కథనం

click me!