కోటి ఇళ్లకు సోలార్ ప్లాంట్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్: రూ. 75 వేల కోట్లు

By narsimha lode  |  First Published Feb 29, 2024, 4:01 PM IST


దేశంలోని కోటి ఇళ్లపై సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి  కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


న్యూఢిల్లీ: పీఎం సూర్యఘర్ యోజన పథకానికి కేంద్ర కేబినెట్  గురువారంనాడు ఆమోదం తెలిపింది.  ఇవాళ కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ప్రతి ఇంటిపై  సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకొనే వారికి  ప్రభుత్వం  ఆర్ధిక సహాయం అందించనుంది.  రూ.75,021 కోట్లను ఈ పథకానికి  కేంద్రం కేటాయించింది. దేశంలోని కోటి మంది ఇళ్లకు  ఈ పథకాన్ని వర్తింపచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని  కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకొనే వారికి ఒక్క కిలో వాట్ కు రూ. 30 వేలు, రెండు కిలో వాట్ కు రూ. 60 వేలను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా అందించనుంది.

2025 నాటికి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపై  సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని ప్రధాని మోడీ ఈ నెల  13న ప్రారంభించారు.ఈ పథకం కుటుంబాలకు సహాయం చేయడమే కాకుండా  సౌరశక్తి విడి భాగాల తయారీకి ఊతమివ్వనుందని కేంద్రం తెలిపింది.ఈ పరిశ్రమ ద్వారా 17 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తుందని మంత్రి ఠాకూర్ చెప్పారు.

Latest Videos

ఈ పథకం కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల వకు ఉచిత విద్యుత్ ను వినియోగించుకోవచ్చు. రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు కోసం  వెబ్ సైట్ లో ధరఖాస్తులను స్వీకరించనున్నారు.సౌర విద్యుత్ వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.


  

 


 

click me!