జగన్‌ను నాలుగో పెళ్లాంగా రమ్మంటావా.. నీ రాజకీయాలే తేడా అనుకున్నా , కానీ : పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

జగన్‌ను అథ:పాతాళానికి తొక్కేస్తానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. జగన్‌ను నాలుగవ పెళ్లాంగా రమ్మంటున్నారని.. పవన్ రాజకీయాలే తేడా అనుకున్నామని, కానీ ఈ తేడా కూడా వుందా అంటూ పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ex minister perni nani counter to janasena president pawan kalyan over his comments on ap cm ys jagan ksp

జగన్‌ను అథ:పాతాళానికి తొక్కేస్తానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ దగ్గర ఆధారాలుంటే బయటపెట్టాలని, బ్లాక్‌మెయిలింగ్‌లు జగన్ దగ్గర నడవవన్నారు. యుద్ధం అంటున్న నువ్వు 2014, 2019లలో ఏం చేశావని పేర్ని నాని ప్రశ్నించారు. 2019లో అమరావతి కొందరి రాజధాని, కుల రాజధాని అన్నారని .. మరి చంద్రబాబుతో పవన్ లాలూచీ ఏంటి అని ఆయన నిలదీశారు. 24 సీట్లు కాకపోతే.. సున్నా తీసుకో, వైసీపీకి వచ్చేదేంటీ అని అని పేర్ని నాని చురకలంటించారు. 

2014 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సున్నా సీట్లే తీసుకున్నాడని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబును పాతాళానికి తొక్కేది పవన్ కళ్యాణ్ మాత్రమేనంటూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కనీసం ఒక్క మాట కూడా పవన్ గురించి మాట్లాడలేదని..పవన్‌ను పురాణాల్లో శల్యుడితో పోల్చవచ్చన్నారు. శల్యుడిలా పవన్ జనసేన శ్రేణులను నీరు కారుస్తున్నారని.. యుద్ధం మధ్యలో వస్తున్న శిఖండిలా పవన్ వస్తున్నారని పేర్ని నాని దుయ్యబట్టారు. జగన్ నాట్ కిల్డ్ బాబాయ్ అని అప్పుడు సీఎంగా వున్న చంద్రబాబు అన్నారని.. మరి హూ కిల్డ్ ఎన్డీఆర్ అంటే ఏం చెబుతారని నాని ప్రశ్నించారు. 

యువరాజ్యం అధ్యక్షుడిగా వున్నప్పుడు 2009లో సైకిల్ చంద్రబాబుది కాదన్నారని.. మళ్లీ 2014లో అదే చంద్రబాబుతో పవన్ స్నేహం చేశాడని దుయ్యబట్టారు. 2019లో చంద్రబాబుతో మళ్లీ రాజకీయ వైరం పెట్టుకున్నాడని .. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన జెండాలను ప్రజలు మడత వేయడం ఖాయమని నాని జోస్యం చెప్పారు. పవన్ తల్లి, చంద్రబాబు తల్లిదండ్రులు వారి వద్ద ఎప్పుడైనా వున్నారా.. అలాంటప్పుడు జగన్ తన తల్లిని దూరంగా పెట్టారని అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయమ్మ హైదరాబాద్‌లోని తన సొంతింటిలో వున్నారని పేర్కొన్నారు. జగన్‌ను నాలుగవ పెళ్లాంగా రమ్మంటున్నారని.. పవన్ రాజకీయాలే తేడా అనుకున్నామని, కానీ ఈ తేడా కూడా వుందా అంటూ పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios