ఈ రోజు టాప్ టెన్ వార్తలు
ఆర్ఎస్పీ ఎఫెక్ట్: కాంగ్రెస్ వైపు కోనప్ప చూపు
భారత రాష్ట్ర సమితితో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) పొత్తు అంశం తెరమీదికి వచ్చింది. బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నిన్న కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో కోనేరు కోనప్ప బీఆర్ఎస్ ను వీడాలని భావిస్తున్నారనే ప్రచారం సాగుతుంది. పూర్తి కథనం
undefined
మళ్లీ అమేథీ బరిలో రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ మళ్లీ తన పాత లోక్ సభ నియోజకవర్గం అమేథీ నుంచి బరిలో నిలవబోతున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. తన తల్లి స్థానమైన రాయ్ బరేలీ నుంచి పోటీలో ఉండబోతున్నారు. ఈ రెండు స్థానాలకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య విడదీయలేని సంబంధం ఉంది. పూర్తి కథనం
ప్రధాని మోడీని కలిసిన బాధిత మహిళలు
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలి నుంచి ఐదుగురు మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. షేక్ షాజహాన్ ఇంకా తమను వేధిస్తున్నాడని ప్రధానమంత్రి ముందు వాపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్‌లో ఓ భారీ ర్యాలీలో మాట్లాడారు. సందేశ్‌ఖాలి ఏరియా కూడా ఈ జిల్లా పరిధిలోకే వస్తుంది. పూర్తి కథనం
మలివిడత జాబితా: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కసరత్తు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు ఉదయం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో సమావేశమయ్యారు.రెండో జాబితా విడుదలతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారని సమాచారం. పూర్తి కథనం
రెండు చేతులను ట్రాన్స్‌ప్లాంట్ చేసిన వైద్యులు
ట్రైన్ యాక్సిడెంట్‌లో రెండు చేతులను కోల్పోయిన ఓ 45 ఏళ్ల పెయింటర్‌కు సర్ గంగా రామ్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా మరో వ్యక్తి రెండు చేతులను ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఇప్పుడు ఆయన రెండు చేతులతో పెయింట్ బ్రష్ పట్టుకోనున్నాడు. పూర్తి కథనం
జయలలిత 27 కిలోల బంగారం మాకే చెందాలి
తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసంలో అధికారులు సీజ్ చేసిన 27 కిలోల బంగారు ఆభరణాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలనే ఆదేశాలపై స్టే ఇవ్వాలని ఆమె వారసులు హైకోర్టులో అప్పీల్ చేశారు. జయలలితకు తామే చట్టబద్ధమైన వారసులం అని ఆమె అన్నయ్య కుమార్తె, కుమారుడు పేర్కొన్నారు. పూర్తి కథనం
జాన్వీ కపూర్‌కు ఆ ఇద్దరు క్రికెటర్లు ఇష్టమట.. !
బాలీవుడ్ తారలు సైతం ఐపీఎల్ టీమ్స్ తో పాటు తామ అభిమాన క్రికెటర్ల గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తనకు నచ్చిన ఇద్దరు భారతీయ క్రికెటర్ల గురించి సమాచారం ఇచ్చింది. వారిద్దరి పేర్లను జాన్వీనే స్వయంగా వెల్లడించింది. పూర్తి కథనం
భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్టు ఎవరికి అనుకూలం
India vs England: భారత్-ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో చివరిదైన 5వ టెస్టు మ్యాచ్ మార్చి 7 నుంచి ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జరగనుంది. ఈ వేదికగా జరిగిన మ్యాచ్ ల గణాంకాలు గమనిస్తే ఇక్కడ భారత్ గెలుపునకు సానుకూల అంశాలు ఉన్నాయి. పూర్తి కథనం
SSMB29 ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
మహేష్ బాబుతో రాజమౌళి రూపొందించాల్సిన సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందట. పూర్తి కథనం
అల్లు అర్జున్, మృణాల్ ఠాకూర్, విశ్వక్‌సేన్‌లకు `గామా` పురస్కారాలు
అల్లు అర్జున్, మృణాల్ ఠాకూర్, సుకుమార్, విశ్వక్ సేన్, నిఖిల్ లకు గామా అవార్డులు వరించాయి. దుబాయ్‌లో ఈ ఈవెంట్ గ్రాంగ్‌గా జరిగింది. అవార్డు లిస్ట్ పై ఓ లుక్కేయండి. పూర్తి కథనం