Delhi: 45 ఏళ్ల పెయింటర్‌కు విజయవంతగా రెండు చేతులను ట్రాన్స్‌ప్లాంట్ చేసిన వైద్యులు

Published : Mar 06, 2024, 06:21 PM IST
Delhi: 45 ఏళ్ల పెయింటర్‌కు విజయవంతగా రెండు చేతులను ట్రాన్స్‌ప్లాంట్ చేసిన వైద్యులు

సారాంశం

ట్రైన్ యాక్సిడెంట్‌లో రెండు చేతులను కోల్పోయిన ఓ 45 ఏళ్ల పెయింటర్‌కు సర్ గంగా రామ్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా మరో వ్యక్తి రెండు చేతులను ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఇప్పుడు ఆయన రెండు చేతులతో పెయింట్ బ్రష్ పట్టుకోనున్నాడు.  

Bilateral Hand Transplant: ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ వైద్యులు ఓ కీలక మైలురాయిని సాధించారు. తొలిసారిగా ఓ పేషెంట్‌కు రెండు చేతులను విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఓ ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయిన 45 ఏళ్ల పెయింటర్ ఇప్పుడు మళ్లీ తన చేతులతో బ్రష్ పట్టుకోబోతున్నాడు. మార్చి 6వ తేదీన ఆయన డిశ్చార్జ్ అయ్యాడు.

2020లో ఓ విషాదకర ట్రైన్ యాక్సిడెంట్‌లో ఆయన రెండు చేతులను కోల్పోయాడు. కానీ, ఇప్పుడు ఆయన రెండు చేతులను పొందాడు. ఆ రెండు చేతులు మీనా మహెతావి. దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రముఖ స్కూల్ అడ్మినిస్ట్రేషన్‌ హెడ్‌గా ఆమె పని చేశారు. తాను మరణించాక తన అవయవాలను దానం చేయడానికి అంగీకరిస్తూ ఆమె ఓ హామీ ఇచ్చారు. ఆమె మరణించిన తర్వాత ఆమె అవయవాలను దానం చేసి నలుగురు జీవితాల్లో వెలుగు నింపారు.

ఆమె కిడ్నీ, లివర్, కార్నియాల ద్వారా ముగ్గురు జీవితాలు మారిపోయాయి. వీరితోపాటు ఆమె రెండు చేతుల ద్వారా 45 ఏళ్ల పెయింటర్ మళ్లీ తన పెయింట్ బ్రష్‌ను పట్టుకోనున్నాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

World Coldest Place : ఫ్రిజ్‌లో ఉన్నట్టే.. ప్రపంచంలోనే అత్యంత కూలెస్ట్ ప్లేస్ ఇదే గురూ !
పేదరిక నిర్మూలనకు సరికొత్త ఫార్ములా.. ఇక గ్రామాల బాధ్యత విద్యార్థులదే