Asianet News TeluguAsianet News Telugu

IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్టు ఎవరికి అనుకూలం.. ధ‌ర్మ‌శాల‌ పిచ్ రిపోర్ట్ ఏం చెబుతోంది?

India vs England: భార‌త్-ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో చివ‌రిదైన 5వ టెస్టు మ్యాచ్  మార్చి 7 నుంచి ధ‌ర్మ‌శాల‌లోని  హెచ్‌పీసీఏ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఈ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ ల గ‌ణాంకాలు గ‌మ‌నిస్తే ఇక్క‌డ భార‌త్ గెలుపున‌కు సానుకూల అంశాలు ఉన్నాయి. 
 

IND vs ENG: India vs England 5th Test is in favour of whom.. What does the Dharamshala pitch report say? RMA
Author
First Published Mar 6, 2024, 4:03 PM IST

India vs England - Dharmashala : మార్చి 7 నుంచి ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌పీసీఏ) స్టేడియంలో జరగనున్న భార‌త్-ఇంగ్లాండ్ 5వ టెస్టు మ్యాచ్ కు స‌ర్వం సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ఇరు టీమ్స్ ఇక్క‌డ‌కు చేరుకున్నాయి. ఈ మ్యాచ్ లో ఇరు జ‌ట్టు గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. ఇక్క‌డ గెలిస్తే భార‌త్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) లో టాప్ ప్లేస్ ను సుస్థిరం చేసుకుంటుంది. అలాగే, ఇంగ్లాండ్ గెలిస్తే కీలకమైన పాయింట్లను అందుకుంటుంది. అంత‌కుముందు, రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ కాంప్లెక్స్‌లో జ‌రిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే జోరును కొన‌సాగించాల‌ని టీమిండియా చూస్తోంది.

ధ‌ర్మ‌శాల హెచ్‌పీసీఏ స్టేడియం గ‌ణాంకాలు గ‌మ‌నిస్తే.. 

ధ‌ర్మ‌శాల హెచ్‌పీసీఏ స్టేడియంలో టీ20, వ‌న్డే మ్యాచ్ లు ఎక్కువ‌గానే జ‌రిగిన‌ప్ప‌టికీ.. టెస్టు మ్యాచ్ మాత్రం ఒక్క‌టి మాత్ర‌మే జ‌రిగింది. ముందు బ్యాటింగ్ చేసిన జ‌ట్టు విజ‌యం సాధించింది. 1వ‌ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 300, 2వ ఇన్నింగ్స్ స‌గ‌టు స్కోర్ 332 ప‌రుగులు, 3వ ఇన్నింగ్స్ స్కోర్ 137  ప‌రుగులు, 4వ ఇన్నింగ్స్ స్కోర్ 106 ప‌రుగులుగా ఉన్నాయి. నమోదైన అత్యధిక ప‌రుగులు 332/10 (118.1 ఓవర్లు) భారత్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ లో న‌మోద‌య్యాయి. అత్యల్ప స్కోర్ 137/10 (53.5 ఓవర్లు) దక్షిణాఫ్రికా vs భారత్ మ్యాచ్ లో జ‌రిగింది.

టెస్ట్ క్రికెట్‌లో పరుగుల కంటే ఎక్కువ వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు

పిచ్ రిపోర్టు ఏం చెబుతోంది? 

ధ‌ర్మ‌శాల హెచ్‌పీసీఏ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో మంచి బౌన్స్, క్యారీతో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ వేదికపై జరిగిన ఏకైక టెస్ట్‌లో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ స‌మయంలో స్పిన్, పేస్ బౌలర్లు కీల‌కంగా ఉన్నారు.

ధర్మశాల వాతావరణం ఎలా ఉంటుంది? 

గురువారం (మార్చి 7) నుండి సోమవారం (మార్చి 11) వరకు వాతావరణ సూచనల ప్రకారం 15 నుండి 12 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ స‌మ‌యంలో చలి పరిస్థితులు కొనసాగుతాయని వాతావ‌ర‌ణ శాఖ‌ అంచనా వేసింది. అయితే, మ్యాచ్ 5వ రోజు (మార్చి 11) వర్షం పడే అవకాశం ఉంది. కాబ‌ట్టి చివ‌రి రోజు వ‌ర‌కు మ్యాచ్ జ‌రిగిగే ఆటకు అంతరాయం కలిగే అవ‌కాశ‌ముంది.

భారత్ vs ఇంగ్లాండ్ 5వ టెస్ట్ ప్లేయింగ్ 11 అంచ‌నాలు :

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్

ఇంగ్లాండ్ : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జేమ్స్ ఆండర్సన్, షోయబ్ బషీర్, మార్క్ వుడ్.

ఆ ఇద్ద‌రు క్రికెట‌ర్లు ఇష్ట‌మ‌ట‌.. ! జాన్వీ కపూర్ అభిమాన క్రికెటర్ ఎవ‌రంటే..?

Follow Us:
Download App:
  • android
  • ios