Delhi: 45 ఏళ్ల పెయింటర్‌కు విజయవంతగా రెండు చేతులను ట్రాన్స్‌ప్లాంట్ చేసిన వైద్యులు
ట్రైన్ యాక్సిడెంట్‌లో రెండు చేతులను కోల్పోయిన ఓ 45 ఏళ్ల పెయింటర్‌కు సర్ గంగా రామ్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా మరో వ్యక్తి రెండు చేతులను ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఇప్పుడు ఆయన రెండు చేతులతో పెయింట్ బ్రష్ పట్టుకోనున్నాడు.
Bilateral Hand Transplant: ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ వైద్యులు ఓ కీలక మైలురాయిని సాధించారు. తొలిసారిగా ఓ పేషెంట్‌కు రెండు చేతులను విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఓ ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయిన 45 ఏళ్ల పెయింటర్ ఇప్పుడు మళ్లీ తన చేతులతో బ్రష్ పట్టుకోబోతున్నాడు. మార్చి 6వ తేదీన ఆయన డిశ్చార్జ్ అయ్యాడు.
2020లో ఓ విషాదకర ట్రైన్ యాక్సిడెంట్‌లో ఆయన రెండు చేతులను కోల్పోయాడు. కానీ, ఇప్పుడు ఆయన రెండు చేతులను పొందాడు. ఆ రెండు చేతులు మీనా మహెతావి. దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రముఖ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్‌గా ఆమె పని చేశారు. తాను మరణించాక తన అవయవాలను దానం చేయడానికి అంగీకరిస్తూ ఆమె ఓ హామీ ఇచ్చారు. ఆమె మరణించిన తర్వాత ఆమె అవయవాలను దానం చేసి నలుగురు జీవితాల్లో వెలుగు నింపారు.
#Delhi’s first successful bilateral hand transplant in Ganga Ram Hospital.
— DD News (@DDNewslive) March 6, 2024
A terrific story of resilience and courage and also an example of humanity, a lady who was declared brain dead pledged her organs and her hands found way for this painter who belonged to economically… pic.twitter.com/hM2bkUtWKY
ఆమె కిడ్నీ, లివర్, కార్నియాల ద్వారా ముగ్గురు జీవితాలు మారిపోయాయి. వీరితోపాటు ఆమె రెండు చేతుల ద్వారా 45 ఏళ్ల పెయింటర్ మళ్లీ తన పెయింట్ బ్రష్‌ను పట్టుకోనున్నాడు.