Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో మరికొద్దిగంటల్లో బడ్జెట్ ప్రకటన, వైసీపీ ఐదో జాబితా విడుదల, త్వరలో మెగా డీఎస్సీ, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు , హేమంత్ సోరెన్ అరెస్టు .. జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్..!, జ్ఞానవాపిలో పూజలకు కోర్టు అనుమతి , ఇండియా కూటమి నుంచి బయటకు రావడానికి కారణం వెల్లడించిన నితీష్ కుమార్, నిరుద్యోగులకు శుభవార్త.. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ .. కుమారీ ఆంటీకి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. , ఒకేసారి 86 మంది బదిలీ, నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు. , ఢిల్లీ వేదికగా షర్మిల భారీ స్కెచ్!, పెండింగ్ చలాన్లపై మరోసారి గడువు పొడిగింపు.. వంటి వార్తల సమాహారం.
Today Top Stories:
(నోట్: పూర్తి వివరాల కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి)
మరికొద్దిగంటల్లో బడ్జెట్ ప్రకటన
Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల దృష్ట్యా ఈసారి మధ్యంతర బడ్జెట్ కానుంది. 2024-25 ఆర్థిక బడ్జెట్‌లో పెద్ద ప్రకటనలు ఉండవని, సాధారణ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు బడ్జెట్ కార్యాచరణ ప్రణాళికగా ఉంటుందని ఆర్థిక మంత్రి ఇప్పటికే సూచించారు.
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఐదో జాబితాను విడుదల చేసింది. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆమోదముద్ర అనంతరం అభ్యర్ధుల పేర్లను మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిలు విడుదల చేశారు. నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాల్లో జగన్ మార్పులు చేశారు. అందరూ ఊహించినట్లుగానే మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. నర్సరావుపేట లోక్‌సభ బరిలో దిగనున్నారు.
హేమంత్ సోరెన్ అరెస్టు .. జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్..!
Hemant Soren: జార్ఖండ్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భూ కుంభకోణం, మనీలాండరింగ్ ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఏడు గంటలపాటు విచారించారు. విచారణ అనంతరం హేమంత్ సోరెన్ తన రాజీనామాను గవర్నర్ అందచేసిన వెంటనే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ తరుణంలో సీఎంగా ఎవరు ఎన్నికవుతారనే ఉత్కంఠ నెలకొంది. తొలుత హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ను తదుపరి సీఎంగా ఎన్నుకున్నారనీ భావించారు. కానీ పలు రాజకీయా పరిణామాల నేపథ్యంలో చంపై సోరెన్ (Champai Soren) పేరును తెరపైకి వచ్చింది.
జ్ఞానవాపిలో పూజలకు కోర్టు అనుమతి
జ్ఞానవాపి బేస్‌మెంట్‌లో పూజలకు కోర్ట్ అనుమతి .. ఆ వ్యాజ్యాల్లోనూ విజయం ఖాయం : న్యాయవాది అలోక్ కుమార్ వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రార్థనా మందరంలోని సీల్ వేసి వున్న బేస్‌మెంట్‌లో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతించింది. న్యాయస్థానం తీర్పుపై విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది అలోక్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇండియా కూటమి నుంచి బయటకు రావడానికి కారణం అదే
Nitish Kumar: బీహార్‌లో (మహాఘట్ బంధన్‌కు) కూటమి నుంచి వైదొలిగి తిరిగి అధికారం చేజిక్కించుకున్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాలను ఖరారు చేయడంలో ప్రతిపక్షాల నిష్క్రియాపరత్వాన్ని పేర్కొంటూ ఎన్డీయేలో చేరాలన్న తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. గత వారం బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో జతకట్టడానికి మహాఘటబంధన్ నుండి బయలుదేరిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ .. ప్రతిపక్ష కూటమికి ఇండియా అని నామాకరణం చేయడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
నిరుద్యోగులకు శుభవార్త.. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ..
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను ఈ ఏడాది చివరికల్లా భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అదే రోజు 6,956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు పంపిణీ చేశామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగాఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేస్తుందని తెలిపారు. పోలీస్ శాఖలో 15 వేల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఒకేసారి 86 మంది బదిలీ.
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సిబ్బందిని మొత్తం మార్చారు హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పనిచేసే సీఐ స్థాయి అధికారి నుండి హోంగార్డులుగా విధులు నిర్వహిస్తున్న 86 మందిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరందరినిక ఏఆర్ కు అటాచ్ చేశారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల నుండి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు అధికారులను బదిలీ చేస్తున్నారు.
కుమారీ ఆంటీకి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..
Kumari Aunty: కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ క్లోజ్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ పై నమోదు చేసిని కేసును పున:పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో నిర్వహించిన స్థలంలోనే కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ నిర్వహించుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఈ మేరకు ఎంఏయూడీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పాలనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని సీఎంఓ తెలిపింది.త్వరలోనే కుమారీ ఆంటీ ఫుడ్ సెంటర్ ను తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి సందర్శించే అవకాశం ఉంది.
నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు..
GADDAR AWARDS: తెలుగు చలన చిత్ర సీమలో అత్యున్నత పురస్కారం... నంది పురస్కారం (Nandi Awards). 1964 నుంచి ఈ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేస్తూ వస్తోంది. చివరిగా 2016లో పురస్కారాలను అందజేశారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో.. దాదాపు ఎనిమిదేళ్లు ఈ అవార్డుల ఊసే లేదు. దీనిపై ఎన్నో మార్లు సినీ ప్రముఖులు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ పెద్ద పండగ ఆగిపోయినట్లైంది. ఇక తాజాగా నంది అవార్డులపై సీఎం రేవంత్ రెడ్డి Revanth Reddy కీలక ప్రకటన చేశారు.
పెండింగ్ చలాన్లపై మరోసారి గడువు పొడిగింపు.
వాహనాల పెండింగ్ చలాన్ల రాయితీ గడువును మరోసారి తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది.ఈ మేరకు బుధవారం నాడు రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 వ తేదీ వరకు పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఇప్పటికే ఒక్కసారి గడువును పొడిగించింది.ఇవాళ్టితో గడువు ముగియనుంది. దీంతో గడువును వచ్చే నెల 15వ తేదీ వరకు పెంచింది సర్కార్.
ఢిల్లీ వేదికగా షర్మిల భారీ స్కెచ్!
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటు కరణను వ్యతిరేకిస్తూ వైఎస్ షర్మిరెడ్డి ఢిల్లీలో దీక్ష చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో దీక్షకు హాజరు కావాలని కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులను దీక్షకు హాజరు కావాలని ఏపీ కాంగ్రెస్ నేతలు కోరినట్టు తెలుస్తోంది.
మెగా డీఎస్సీ .. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో మెగా డీఎస్సీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే.. యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపు ఆదేశాలు జారీ చేశారు.