Union Budget 2024 Live Updates : ఇది చారిత్రాత్మక బడ్జెట్ :ప్రధాని నరేంద్ర మోదీ 

Union Budget 2024 Live Updates AKP

2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.  రూ.47.66 లక్షల కోట్ల బడ్జెట్ కు లోక్ సభ ఆమోదం లభించింది. 

5:32 PM IST

మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ : ఉద్థవ్ థాక్రే

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో గురువారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్థవ్ థాక్రే స్పందించారు. మోడీ ప్రభుత్వం చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని, దేశంలో పేదలు, యువత, రైతులు, మహిళలు వున్నారని గుర్తించిందని థాక్రే చురకలంటించారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భారమైన హృదయంతో చివరి బడ్జెట్‌ను సమర్పించారని ఆయన వ్యాఖ్యానించారు. 

5:13 PM IST

బడ్జెట్ 2024 : కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఏమన్నారంటే..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో గురువారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ స్ఫూర్తి, సూత్రంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం 'అమృత్ కాల్' శకానికి ఎలా నాంది పలికిందో భారత ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఒక అద్భుతమైన సారాంశం అని రాజీవ్ వివరించారు. ఇది కేవలం నినాదం మాత్రమే కాదని .. భారతదేశాన్ని, మన ఆర్థిక వ్యవస్థను గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా మార్చివేసిన నిజమైన పాలనా భావజాలం అని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. 2014లో భారత్ బలహీనమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న 5 దేశాల జాబితాలో ఉందని, కానీ నేడు బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో టాప్ 5లో ఉందని ఆయన వెల్లడించారు

5:03 PM IST

ఆత్మ నిర్భర్ భారత్‌కు ఈ బడ్జెట్‌తో ఊతం : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

అభివృద్ధి చెందిన, 'ఆత్మ-నిర్భర్' భారతదేశాన్ని నిర్మించడానికి ఈ మధ్యంతర బడ్జెట్ వేగాన్ని అందిస్తుందన్నారు బీజేపీ నేత , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. 140 మంది ఆశలను నెరవేర్చే బడ్జెట్‌ను సమర్పించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ఈ మధ్యంతర బడ్జెట్ ముఖ్యమైనదని యోగి అన్నారు. 

4:59 PM IST

బడ్జెట్‌తో ఏపీకి దక్కిందేమీ లేదు : జేడీ లక్ష్మీనారాయణ

2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు , మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. విభజన వల్ల గాయపడిన ఏపీకి ఈ బడ్జెట్ వల్ల ఒనగూరిందేమీ లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా పేదరికంపై స్కీములు పెట్టే స్థితిలోనే వున్నామని జేడీ ఆవేదన వ్యక్తం చేశారు. జన్ ధన్ ఖాతాల్లో 34 లక్షల కోట్లు వేశామని కేంద్రం చెబుతోందని.. అలా వేస్తే అభివృద్ధి జరిగినట్లేనా అని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఏపీలో పోలవరం పరిస్ధితి అగమ్య గోచరంగా వుందని ఆయన దుయ్యబట్టారు. 
 
4:35 PM IST

5 లక్ష్యాలను నిర్దేశించుకున్నాం : నిర్మలా సీతారామన్

వరుసగా మూడేళ్ల నుంచి 7 శాతం అభివృద్ధి రేటు సాధిస్తున్నామన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.మధ్యంతర బడ్జెట్ అనంతరం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సరైన నిర్ణయాలు, విధానాలతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. క్రమంగా ద్రవ్యోల్భణ లోటును తగ్గించుకుంటూ వస్తున్నామని నిర్మల తెలిపారు. ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించాలని నిర్ణయించుకున్నామని, దిశా నిర్దేశక్ బాతే కింద 5 లక్ష్యాలను నిర్దేశించుకున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. మోడీ ప్రభుత్వ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని.. జీ20లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ వుందన్నారు. అభివృద్ధి పథంలో సాగుతూ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 
 
4:29 PM IST

ఇది రోజువారీ లెక్కల బడ్జెట్ : మల్లిఖార్జున ఖర్గే

2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన  మధ్యంతర బడ్జెట్‌పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. తాను బడ్జెట్‌ను శ్రద్ధగా విన్నానని .. పేద, దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజల కోసం బడ్జెట్‌లో ఏదీ ప్రస్తావించలేదని ఖర్గే ఎద్దేవా చేశారు. ఇది కేవలం రోజువారీ వ్యవహారాల బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు. పదేళ్లుగా ఇచ్చిన వాగ్థానాల వివరాలు , ఎన్ని హామీలు నెరవేర్చారో తులనాత్మక ప్రకటన ఇవ్వాలని ఖర్గే పేర్కొన్నారు. 
 
4:14 PM IST

రూ.6.21 లక్షల కోట్లకు చేరిన డిఫెన్స్ బడ్జెట్ : రక్షణ శాఖ స్పందన ఇదే

2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన  మధ్యంతర బడ్జెట్‌పై కేంద్ర రక్షణ శాఖ స్పందించింది. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్వయం విశ్వాసం, ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యాలతో 2024-25 ఆర్ధిక సంవత్సరంలో రక్షణ బడ్జెట్ రూ.6.21 లక్షల కోట్లకు చేరుకుందని పేర్కొంది.  ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన మొత్తం కేంద్ర బడ్జెట్‌లో ఇది 13.04 శాతమని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 
 
3:58 PM IST

ఈ బడ్జెట్ దేశానికే మార్గదర్శకం : నాదెండ్ల మనోహర్

2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన  మధ్యంతర బడ్జెట్ దేశానికి మార్గదర్శకంగా ఉందన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను స్వాగతిస్తున్నామన్న ఆయన.. యువతను, మహిళలను  ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిందని నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు. 
 
3:38 PM IST

మధ్యంతర బడ్జెట్‌పై అమిత్ షా ప్రశంసలు

2024- 25 మధ్యంతర బడ్జెట్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌కు ఈ బడ్జెట్ రోడ్ మ్యాప్‌లా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. గడిచిన పదేళ్ల కాలంలో ప్రధాని మోడీ సారథ్యంలో సాధించిన మైలురాళ్లను బడ్జెట్ హైలైట్ చేసిందని షా అన్నారు. 
 
3:21 PM IST

విశాఖ రైల్వే జోన్‌ : ఏపీ సర్కార్ భూమి ఇవ్వలేదన్న అశ్వినీ వైష్ణవ్

మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. విశాఖ రైల్వే జోన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమిని కేటాయించలేదన్నారు. తాము 53 ఎకరాల భూమిని అడిగితే .. ఏపీ సర్కార్ నుంచి ఆ భూమి అప్పగింత జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు భూమి ఇస్తే.. అప్పుడు పనులు మొదలుపెడతామని, జోన్ కోసం డీపీఆర్ కూడా సిద్ధమైందని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. 
 
3:07 PM IST

ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9138 వేల కోట్లు

మధ్యంతర బడ్జెట్ సందర్భంగా రైల్వే బడ్జెట్‌ను సైతం కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,138 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో రూ.886 కోట్లు మాత్రమే కేటాయించారని ఆయన గుర్తుచేశారు. ఇది 10 శాతం రెట్టింపు కేటాయింపులని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఏపీలో ఏడాదికి 240 కిలోమీటర్ల ట్రాక్ పనులు జరుగుతున్నాయని.. 98 శాతం విద్యుద్దీకరణ పూర్తయ్యిందని రైల్వే మంత్రి తెలిపారు. ఏపీలో 72 రైల్వే స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 
 
2:45 PM IST

మధ్యంతర బడ్జెట్‌పై భారత్‌లో డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి ప్రశంసలు

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌పై భారత్‌లో డబ్ల్యూహెచ్‌వో ప్రతినిథి డాక్టర్ రోడెరికో హెచ్. ఆఫ్రిన్ స్పందించారు. ‘‘ ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు,  హెల్పర్లు అట్టడుగు స్థాయిలో ఆరోగ్యం సంరక్షణ విషయంలో ముందంజలో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఆయుష్మాన్ భారత్ కింద వారికి ఆరోగ్య సంరక్షణను పొడిగించడం అభినందనీయం . మధ్యంతర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన అంశాలు భారత్‌లో వ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ సేవలు బలోపేతం అవుతాయి ’’ అని ఆఫ్రిన్ వ్యాఖ్యానించారు. 

2:29 PM IST

స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు బూస్టప్ ఇచ్చేలా బడ్జెట్ : ఫడ్నవీస్

మధ్యంతర బడ్జెట్‌పై బీజేపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో పేద , మధ్యతరగతి ప్రజల కోసం అనేక పథకాలను ప్రకటించారని ప్రశంసించారు. రూ. లక్ష కోట్ల కార్పస్ దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు సహాయం చేస్తుందని ఫడ్నవీస్ ఆకాంక్షించారు. నానోడాప్ పథకం రైతులకు మేలు చేస్తుందని, ఇన్‌ఫ్రాలో రూ. 11 లక్షల కోట్లకు పైగా పథకాలు వినూత్నమైనవని ఆయన ప్రశంసించారు.  అభివృద్ధి చెందిన భారత్‌కు రోడ్‌మ్యాప్‌ను ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్‌లో సమర్పిస్తామని నిర్మలా సీతారామన్ నమ్మకంగా చెప్పారని ఫడ్నవీస్ అన్నారు. 

2:16 PM IST

స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపని మధ్యంతర బడ్జెట్

మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గానే కొనసాగుతున్నాయి. తాత్కాలిక బడ్జెట్‌లో చెప్పుకోదగ్గ ప్రకటనలేవీ లేకపోవడంతో మార్కెట్లు స్పందించలేదని అప్‌డేట్స్ చెబుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 12.31 వరకు బీఎస్ఈ సెన్సెక్స్ 8 పాయింట్ల లాభంతో 71,760 వద్ద.. నిఫ్టీ 1 పాయింట్ లాభంతో 21,727 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 

1:53 PM IST

తాజా బడ్జెట్ తో కేంద్రం ఖాతాలో కొత్త రికార్డ్ : యూపీ మాజీ సీఎం అఖిలేష్

కేంద్ర బడ్జెట్ పై ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందించారు. బిజెపి ప్రభుత్వం దశాబ్ద కాలంగా ప్రజా వ్యతిరేక బడ్జెట్లను ప్రవేశపెట్టి రికార్డ్ సృష్టించిందన్నారు. ఈ రికార్డును ఎవరూ బద్దలేకొట్టలేరు... ఎందుకంటే త్వరలోనే ప్రజాపాలన అందించే ప్రభుత్వం అధికారంలోకి రానుందని అన్నారు. 

1:22 PM IST

ఇది చారిత్రాత్మక బడ్జెట్ :ప్రధాని నరేంద్ర మోదీ

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇది చారిత్రాత్మక బడ్జెట్ అని అన్నారు. యువత కోసమే ఈ బడ్జెట్లో కేటాయింపులు వుందన్నారు. అందరి అవవరాలు తీర్చే భద్రత ఇది అని అన్నారు.  వికసిత భారత్ లక్ష్యంగా ఈ బడ్జెట్ కేటాయింపులు వున్నాయన్నారు. 
 
1:20 PM IST

ఇది పేద, మద్య తరగతి వర్గాల బడ్జెట్

పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ బడ్జెట్ తో లభ్ది లభిస్తుంది. సోలార్ రూప్ టాప్ ద్వారా కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ కల్పిస్తాం... మిగులు విద్యుత్ అమ్మకం ద్వారా 15 నుండి 20 వేల రూపాయల ఆదాయం వస్తుంది. 
 
12:50 PM IST

పథకాలు, కార్యక్రమాల వారిగా నిధుల కేటాయింపు

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం  86 వేల కోట్లు 

ఆయుష్మాన్ భారత్ ‌- పీఎంజేఏవై   7500 కోట్లు 

ఉత్పాదక రంగానికి చెందిన పథకాల కోసం 6,200 కోట్లు 

టెక్నాలజీ అభివృద్ది 6,900 కోట్లు

సోలార్ పవర్ 8,500 కోట్లు 

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్   600 కోట్లు 
 
12:41 PM IST

శాఖలవారిగా నిధుల కేటాయింపు

రక్షణ శాఖ  6.2 లక్షల కోట్లు 

రవాణ మరియు హైవే   2.78 లక్షల కోట్లు 

రైల్వే   2.55 లక్షల కోట్లు 

పౌర సరఫరా శాఖ 2.13 లక్షల కోట్లు

హోంశాఖ  2.03 లక్షల కోట్లు

రూరల్ డెవలప్ మెంట్ 1.77 లక్షల కోట్లు

కెమికల్ ఆండ్ పర్టిలైజర్స్ 1.68 లక్షల కోట్లు

కమ్యూనికేషన్ 1.37 లక్షల కోట్లు

వ్యవసాయం మరియ రైతుల సంక్షేమం  1.27 లక్షల కోట్లు

12:16 PM IST

ఓటాన్ అకౌంట్ రూ.47.66 లక్షల కోట్లు

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ.47.66 లక్షల  కోట్లుగా ప్రకటించారు నిర్మలా సీతారామన్.  30  లక్షల కోట్ల ఆదాయంగా పేర్కొన్నారు.  

11:56 AM IST

టాక్స్ రేట్లు యధావిధిగా వుంటాయి

ట్యాక్స్ రేట్లు యధావిధిగా వుంటాయన్నారు. సార్టప్స్ కు ట్యాక్స్ బెనిఫిట్స్ వుంటాయన్నారు. 
 
11:54 AM IST

10 రోజుల్లోనే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్...

టాక్స్ పేయర్స్ ను అభినందించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. గతంలో 90 రోజులుగా వున్న ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ సమయాన్ని  10 రోజులకు తగ్గించామన్నారు. 

11:45 AM IST

నిర్మలమ్మ ప్రసంగంలో లక్షద్వీప్ ప్రస్తావన

టూరిజం అభివృద్దికి కృషి చేస్తున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఆద్యాత్మిక టూరిజం డెవలప్ చేస్తున్నామన్నారు. ఈ దిశగా కృషిచేయాలని రాష్ట్రాలకు సూచించారు. ఈ సందర్భంగా లక్షద్వీప్ ను ప్రస్లావించారు.  

11:40 AM IST

వందే భారత్ స్థాయికి 40 వేల రైలు బోగీలు

3 రైల్వే కారిడార్ ప్రోగ్రాం చేపట్టాం.40 వేల రైల్వే బోగీలను వందే భారత్ స్థాయికి తీసుకుచ్చామని అన్నారు. విమానయాన రంగంలో అద్భుత ప్రగతి సాధించామన్నారు. 

11:36 AM IST

జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ కు  మోదీ జై అనుసంధాన్ చేర్చారు..

జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి ఇస్తే, అటల్ బిహారీ వాజ్ పేయి దానికి జై విజ్ఞాన్ చేసారు. ఇప్పుడు జై అనుసంధాన్ అనేది ప్రధాని నరేంద్ర మోదీ చేర్చారు. 
 
11:34 AM IST

ప్రపంచంలో అతిపెద్ద పాల సరఫరాదారుగా ఇండియా

డెయిరీ రైతులకు ఎంతో చేస్తున్నామని అన్నారు. దేశంలోనే అతిపెద్ద పాల సరఫరాదారుగా మారిందన్నారు. రాష్ట్రీయ్ గోకుల్ మిషన్ వంటి పథకాలు ఉపయోగపడుతున్నాయని అన్నారు.  ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్యకారులకు ఎంతో లబ్ది జరుగుతోంది. 

11:30 AM IST

ఆయుష్మాన్ భారత్ ఇక అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు కూడా

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అందరు అంగన్వాడీ, ఆశా వర్కర్లకు కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు 
 
11:27 AM IST

3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాం... మరో 2 కోట్ల ఇళ్లను నిర్మిస్తాం : నిర్మలా సీతారామన్

పీఎం ఆవాస్ యోజన్ గ్రామీణం 3 కోట్ల ఇళ్ల నిర్మాణం ఇచ్చినట్లు తెలిపారు. 2 కోట్ల కొత్త ఇళ్లను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. 
 
11:23 AM IST

2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా ఇండియా

2047 నాటికి ఇండియా అభివృద్ది చెందిన దేశంగా మారుతుందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. వేగంగా, సమతుల్యతతో కూడిన అబివృద్ది దేశంలో జరుగుతోందని అన్నారు. 
 
11:22 AM IST

ఆర్థికవ్యవస్థ గేమ్ చేంజర్ గా ఇండియా

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది కానీ ఇండియా ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగా వుందన్నారు. గ్లోబల్ సమస్యలకు ఇండియా పరిష్కారంగా కనిపిస్తోందని అన్నారు. ఆర్థికవ్యవస్థ గేమ్ చేంజర్ గా ఇండియా మారిందని అన్నారు. 
 
11:18 AM IST

జిడిపికి కొత్త అర్థం చెప్పిన నిర్మలా సీతారామన్

జిడిపికి కొత్త అర్థం చెప్పారు నిర్మలా సీతారామన్. గవర్నెస్, డెవలప్ మెంట్, ప్రోగ్రెస్ అని అన్నారు. 

11:16 AM IST

చెస్ ఛాంపియన్ ప్రజ్ఞానంద పేరు ప్రస్తావించిన నిర్మలా సీతారామన్

ఏషియన్ గేమ్స్ 2023, పారా గేమ్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటారని ఆర్థిక మంత్రి తెలిపారు.  చెస్ క్రీడాకారుడు ప్రజ్ఞానందం  గురించి కూడా ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. 

11:13 AM IST

అన్నదాతల కోసం చేస్తున్నదిదే..

పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 11.8 కోట్ల రైతులకు లబ్ది లభిస్తోంది. పీఎం ఫసల్ భీమా యోజన కూడా రైతులకు అందిస్తున్నాం. 

11:07 AM IST

2047 నాటికి  వికసిత్ భారత్ దిశగా అడుగులు

హర్ గర్ జల్, విద్యుత్, గ్యాస్, బ్యాంక్ సదుపాయం రికార్డు సమయంలో కల్పించామన్నారు. ఫ్రీ రేషన్ అందిస్తున్నామని తెలిపారు. 2047 నాటికి  వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం. సోషల్ జస్టిస్  పేరుతో రాజకీయాలు చేయడంలేదని అన్నారు. 

11:06 AM IST

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మంత్రంతో ముందుకు...

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత  సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళుతున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. 

11:03 AM IST

బడ్జెట్ ప్రసంగాన్ని ప్రాంభించిన ఆర్థిక మంత్రి

బడ్జెట్ సమావేశం ప్రారంభమయ్యాయి. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మొదట మాట్లాడారు. అనంతరం నిర్మలా సీతారామన్ ప్రారంభిచారు.

10:46 AM IST

బడ్జెట్ 2024 కు కేంద్ర కేబినెట్ ఆమోదం

మధ్యంతర బడ్జెట్ 2024 కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మరికొద్దిసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. 

10:29 AM IST

రాష్ట్రపతిని కలిసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

బడ్జెట్ 2024 ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసారు.  ఈ సందర్భంగా మంత్రికి రాష్ట్రపతి స్వీట్ తినిపించారు. 

10:15 AM IST

తాత్కాలిక బడ్జెట్ లో కొత్త పథకాలు వుండకపోవచ్చు... కానీ

తాత్కాలిక బడ్జెట్ కాబట్టి ఇందులో కొత్త పథకాల ప్రకటన వుండకపోవచ్చు. కానీ ఇప్పటికే అమలు అవుతున్న పథకాలను భారీగా నిధులు కేటాయింపు వుండనుంది.  
 
9:24 AM IST

మరికొద్దిసేపట్లో పార్లమెంట్ కు నిర్మలా సీతారామన్

ఇప్పటికే మధ్యంతర బడ్జెట్ 2024 ను తయారీలో కీలకపాత్ర పోషించిన అధికారులతో ఆర్థిక మంత్రి సీతారామన్ ఫోటో దిగారు. అనతరం ఆర్థిక శాఖ కార్యాలయం నుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడానికి బయలుదేరారు. పది గంటలకు పార్లమెంట్ కు చేరుకోనున్న సీతారామన్ కేబినెట్ బేటీలో పాల్గొననున్నారు. బడ్జెట్ 2024 కు కేబినెట్ ఆమోదం తర్వాత లోక్ సభ కు వెళ్లి బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు ఆర్థిక మంత్రి సీతారామన్.
 
9:17 AM IST

ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్న నిర్మలా సీతారామన్

మరికొద్దిసేపట్లో కేంద్ర బడ్జెట్ 2024 ప్రవేశ పెట్టనున్న మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. 

9:04 AM IST

ఈ బడ్జెట్ తర్వాత పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గుతాయా?

చమురు మరీ ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేలా బడ్జెట్ నిర్ణయాలు వుంటాయని ప్రచారం జరుగుతోంది. అలాగే వంటగ్యాస్ ధరలు కూడా తగ్గించే చర్యలు వుండే అవకాశాలున్నాయట. వాటిపై ఇప్పుడున్న సుంకాలను తగ్గించడం ద్వారా ధరలను తగ్గించాలని కేంద్రం చూస్తోందట. 

8:58 AM IST

బడ్జెట్ 2024 మహిళలను ఆకట్టుకునేలా వుంటుందా?

ఎన్నిలక వేళ ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్ కాబట్టి మహిళలను ఆకట్టుకునే ప్రకటనలు వుండే అవకాశాలున్నాయి. మహిళా సాధికారత కోసం ప్రత్యేకంగా కేటాయింపులు, పథకాలు వుండనున్నాయి. 

8:32 AM IST

మరికొద్దిసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

మరికొద్దిసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. బడ్జెట్ గురించి రాష్ట్రపతికి వివరించిన అనంతరం పార్లమెంట్ కు చేరుకోనున్నారు. కేబినెట్ బేటీ అనంతరం ఆమె లోక్ సభలో అడుగుపెట్టనున్నారు. 11 గంటల తర్వాత బడ్జెట్ ప్రసంగం ప్రారంభంకానుంది. 

7:57 AM IST

ఇది ఓటర్లను సంతృప్తపర్చే బడ్జెటేనా?

ఎన్నికలకు ముందు వెలువడుతున్న మధ్యంతర బడ్జెట్ కావడంతో ఇందులో ప్రజలపై భారం మోపే  నిర్ణయాలు వుండే అవకాశాలు లేవు. అంతేకాదు ప్రజల కోసం కొత్తగా సంక్షేమ పథకాలు, దేశ అభివృద్దికి సంబంధించిన విషయాలను మాత్రమే ఈ బడ్జెట్ ప్రస్తావించనుంది. 

budget 2024: ఓటర్లను సంతృప్తి పరచడానికి ఎటువంటి కఠినమైన చర్యలు ఉండవు; ఆర్థిక మంత్రి
 
7:38 AM IST

తొలి మహిళ, రెండో ఆర్థిక మంత్రి ... బడ్జెట్ విషయంలో నిర్మలమ్మది అరుదైన ఘనత..

ఈసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు సాధించనున్నరు. వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో ఆర్థికమంత్రిగా ఆమె నిలిచారు. ఇంతకుముందే మొరార్జీ దేశాయ్ ఈ ఘనత సాధించారు. 

7:31 AM IST

ఈసారి సరికొత్తగా నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం...

భారత బడ్జెట్ చరిత్రలోనే ఎప్పుడూలేని విధంగా ఈసారి సరికొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈసారి పేపర్ లెస్ బడ్జెట్ వుండనుంది... టాబ్లెట్ లో చూస్తూ బడ్జెట్ ప్రసంగాన్ని చదవనున్నారు నిర్మలా సీతారామన్. 

7:11 AM IST

యువ భారత్ దిశగా బడ్జెట్ 2024 వుండనుందా?

దేశం అత్యధిక యువశక్తి కలిగి వుండటంతో బడ్జెట్ లో వారికి అత్యధిక కేటాయింపులు వుండే అవకాశాలున్నాయి. యుక్త వయసు వారికి ఈ బడ్జెట్ లో ఎక్కువ కేటాయింపులు వుండే అవకాశాలున్నాయి. 

బడ్జెట్ అంచనాలు : 10-19యేళ్ల యువతకు ఎక్కువ ప్రాధాన్యత.. ఎందుకంటే..
 
6:51 AM IST

కేంద్ర బడ్జెట్ పై స్టార్టప్స్ ఆశలు

కేంద్ర బడ్జెట్ లో స్టార్టప్ కంపనీలకు అనుకూల నిర్ణయాలు వుంటాయని యువ వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. దేశంలో ఇప్పటికే అనేక స్టార్టప్స్ వుండగా ఇంకా అనేకం నెలకొల్పేందుకు యువతరం తయారుగా వుంది. ఈ క్రమంలో వీటిని ప్రోత్సహించేలా బడ్జెట్ లో ఏయే అంశాలు వుంటాయో చూడాలిమరి. 

స్టార్టప్‌ల ఆశ నెరవేరుతుందా.. ; కేంద్ర బడ్జెట్‌పైనే కొత్త పారిశ్రామికవేత్తల కన్ను..

6:37 AM IST

ఈ బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి దక్కేదేంటి?

2024 మధ్యంతర బడ్జెట్‌లో ఆరోగ్య రంగం అనుకూలమైన విధానాన్ని ఆశిస్తోంది. ఈ బడ్జెట్‌ ప్రకటనలు ఆరోగ్య సంరక్షణ రంగంలో ఖర్చులను మరింత తగ్గించేలా వుండనున్నాయని... ఈ  రంగంలో ఆవిష్కరణలు, పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించేలా బడ్జెట్ వుండే అవకాశాలున్నాయి. 

union budget: మందుల ధర తగ్గుతుందా.. ? ఆరోగ్య రంగంలో బడ్జెట్ అంచనాలు ఇలా..
 
6:32 AM IST

బడ్జెట్ లో సామాన్యుడిపై నేరుగా ప్రభావంచూపే    అంశాలివే...

దేశ బడ్జెట్ లో సామాన్యుడు అర్థం చేసుకోవాల్సిన అంశాలు.. నేరుగా ఎఫెక్ట్ అయ్యే అంశాలు ఉంటాయి. ఆ పది విషయాలు ఏమిటో తెలుసుకొండి. 

Budget 2024 : బడ్జెట్ తో మీకు నేరుగా ముడిపడిన పది అంశాలు..

6:22 AM IST

భారత బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలు

కేంద్ర  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  భారత బడ్జెట్ 2024 ను మరికొద్దిసేపట్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో దేశ బడ్జెట్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి. 

యూనియన్ బడ్జెట్‌ ల గురించి ఇప్పటివరకు తెలియని 10 ఆసక్తికర విషయాలు
 
6:15 AM IST

ఇది ఎన్నికల బడ్జెట్ ... పెద్ద ప్రకటనలుండవు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్‌ను నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల దృష్ట్యా  ఈసారి మధ్యంతర బడ్జెట్‌ కానుంది. 2024-25 ఆర్థిక బడ్జెట్‌లో పెద్ద ప్రకటనలు ఉండవని, సాధారణ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు బడ్జెట్ కార్యాచరణ ప్రణాళికగా ఉంటుందని ఆర్థిక మంత్రి ఇప్పటికే సూచించారు.

union budget 2024; బడ్జెట్ నుండి ఈ 6 ప్రకటనలు రేపు వెలువడే ఛాన్స్ ..

5:32 PM IST:

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో గురువారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్థవ్ థాక్రే స్పందించారు. మోడీ ప్రభుత్వం చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని, దేశంలో పేదలు, యువత, రైతులు, మహిళలు వున్నారని గుర్తించిందని థాక్రే చురకలంటించారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భారమైన హృదయంతో చివరి బడ్జెట్‌ను సమర్పించారని ఆయన వ్యాఖ్యానించారు. 

5:13 PM IST:

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో గురువారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ స్ఫూర్తి, సూత్రంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం 'అమృత్ కాల్' శకానికి ఎలా నాంది పలికిందో భారత ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఒక అద్భుతమైన సారాంశం అని రాజీవ్ వివరించారు. ఇది కేవలం నినాదం మాత్రమే కాదని .. భారతదేశాన్ని, మన ఆర్థిక వ్యవస్థను గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా మార్చివేసిన నిజమైన పాలనా భావజాలం అని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. 2014లో భారత్ బలహీనమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న 5 దేశాల జాబితాలో ఉందని, కానీ నేడు బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో టాప్ 5లో ఉందని ఆయన వెల్లడించారు

5:03 PM IST:

అభివృద్ధి చెందిన, 'ఆత్మ-నిర్భర్' భారతదేశాన్ని నిర్మించడానికి ఈ మధ్యంతర బడ్జెట్ వేగాన్ని అందిస్తుందన్నారు బీజేపీ నేత , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. 140 మంది ఆశలను నెరవేర్చే బడ్జెట్‌ను సమర్పించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ఈ మధ్యంతర బడ్జెట్ ముఖ్యమైనదని యోగి అన్నారు. 

4:59 PM IST:

2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు , మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. విభజన వల్ల గాయపడిన ఏపీకి ఈ బడ్జెట్ వల్ల ఒనగూరిందేమీ లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా పేదరికంపై స్కీములు పెట్టే స్థితిలోనే వున్నామని జేడీ ఆవేదన వ్యక్తం చేశారు. జన్ ధన్ ఖాతాల్లో 34 లక్షల కోట్లు వేశామని కేంద్రం చెబుతోందని.. అలా వేస్తే అభివృద్ధి జరిగినట్లేనా అని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఏపీలో పోలవరం పరిస్ధితి అగమ్య గోచరంగా వుందని ఆయన దుయ్యబట్టారు. 
 
5:05 PM IST:

వరుసగా మూడేళ్ల నుంచి 7 శాతం అభివృద్ధి రేటు సాధిస్తున్నామన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.మధ్యంతర బడ్జెట్ అనంతరం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సరైన నిర్ణయాలు, విధానాలతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. క్రమంగా ద్రవ్యోల్భణ లోటును తగ్గించుకుంటూ వస్తున్నామని నిర్మల తెలిపారు. ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించాలని నిర్ణయించుకున్నామని, దిశా నిర్దేశక్ బాతే కింద 5 లక్ష్యాలను నిర్దేశించుకున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. మోడీ ప్రభుత్వ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని.. జీ20లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ వుందన్నారు. అభివృద్ధి పథంలో సాగుతూ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 
 
4:29 PM IST:

2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన  మధ్యంతర బడ్జెట్‌పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. తాను బడ్జెట్‌ను శ్రద్ధగా విన్నానని .. పేద, దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజల కోసం బడ్జెట్‌లో ఏదీ ప్రస్తావించలేదని ఖర్గే ఎద్దేవా చేశారు. ఇది కేవలం రోజువారీ వ్యవహారాల బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు. పదేళ్లుగా ఇచ్చిన వాగ్థానాల వివరాలు , ఎన్ని హామీలు నెరవేర్చారో తులనాత్మక ప్రకటన ఇవ్వాలని ఖర్గే పేర్కొన్నారు. 
 
4:25 PM IST:

2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన  మధ్యంతర బడ్జెట్‌పై కేంద్ర రక్షణ శాఖ స్పందించింది. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్వయం విశ్వాసం, ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యాలతో 2024-25 ఆర్ధిక సంవత్సరంలో రక్షణ బడ్జెట్ రూ.6.21 లక్షల కోట్లకు చేరుకుందని పేర్కొంది.  ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన మొత్తం కేంద్ర బడ్జెట్‌లో ఇది 13.04 శాతమని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 
 
3:58 PM IST:

2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన  మధ్యంతర బడ్జెట్ దేశానికి మార్గదర్శకంగా ఉందన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను స్వాగతిస్తున్నామన్న ఆయన.. యువతను, మహిళలను  ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిందని నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు. 
 
3:39 PM IST:

2024- 25 మధ్యంతర బడ్జెట్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌కు ఈ బడ్జెట్ రోడ్ మ్యాప్‌లా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. గడిచిన పదేళ్ల కాలంలో ప్రధాని మోడీ సారథ్యంలో సాధించిన మైలురాళ్లను బడ్జెట్ హైలైట్ చేసిందని షా అన్నారు. 
 
3:21 PM IST:

మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. విశాఖ రైల్వే జోన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమిని కేటాయించలేదన్నారు. తాము 53 ఎకరాల భూమిని అడిగితే .. ఏపీ సర్కార్ నుంచి ఆ భూమి అప్పగింత జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు భూమి ఇస్తే.. అప్పుడు పనులు మొదలుపెడతామని, జోన్ కోసం డీపీఆర్ కూడా సిద్ధమైందని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. 
 
3:07 PM IST:

మధ్యంతర బడ్జెట్ సందర్భంగా రైల్వే బడ్జెట్‌ను సైతం కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,138 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో రూ.886 కోట్లు మాత్రమే కేటాయించారని ఆయన గుర్తుచేశారు. ఇది 10 శాతం రెట్టింపు కేటాయింపులని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఏపీలో ఏడాదికి 240 కిలోమీటర్ల ట్రాక్ పనులు జరుగుతున్నాయని.. 98 శాతం విద్యుద్దీకరణ పూర్తయ్యిందని రైల్వే మంత్రి తెలిపారు. ఏపీలో 72 రైల్వే స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 
 
2:45 PM IST:

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌పై భారత్‌లో డబ్ల్యూహెచ్‌వో ప్రతినిథి డాక్టర్ రోడెరికో హెచ్. ఆఫ్రిన్ స్పందించారు. ‘‘ ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు,  హెల్పర్లు అట్టడుగు స్థాయిలో ఆరోగ్యం సంరక్షణ విషయంలో ముందంజలో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఆయుష్మాన్ భారత్ కింద వారికి ఆరోగ్య సంరక్షణను పొడిగించడం అభినందనీయం . మధ్యంతర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన అంశాలు భారత్‌లో వ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ సేవలు బలోపేతం అవుతాయి ’’ అని ఆఫ్రిన్ వ్యాఖ్యానించారు. 

2:29 PM IST:

మధ్యంతర బడ్జెట్‌పై బీజేపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో పేద , మధ్యతరగతి ప్రజల కోసం అనేక పథకాలను ప్రకటించారని ప్రశంసించారు. రూ. లక్ష కోట్ల కార్పస్ దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు సహాయం చేస్తుందని ఫడ్నవీస్ ఆకాంక్షించారు. నానోడాప్ పథకం రైతులకు మేలు చేస్తుందని, ఇన్‌ఫ్రాలో రూ. 11 లక్షల కోట్లకు పైగా పథకాలు వినూత్నమైనవని ఆయన ప్రశంసించారు.  అభివృద్ధి చెందిన భారత్‌కు రోడ్‌మ్యాప్‌ను ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్‌లో సమర్పిస్తామని నిర్మలా సీతారామన్ నమ్మకంగా చెప్పారని ఫడ్నవీస్ అన్నారు. 

2:16 PM IST:

మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గానే కొనసాగుతున్నాయి. తాత్కాలిక బడ్జెట్‌లో చెప్పుకోదగ్గ ప్రకటనలేవీ లేకపోవడంతో మార్కెట్లు స్పందించలేదని అప్‌డేట్స్ చెబుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 12.31 వరకు బీఎస్ఈ సెన్సెక్స్ 8 పాయింట్ల లాభంతో 71,760 వద్ద.. నిఫ్టీ 1 పాయింట్ లాభంతో 21,727 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 

1:53 PM IST:

కేంద్ర బడ్జెట్ పై ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందించారు. బిజెపి ప్రభుత్వం దశాబ్ద కాలంగా ప్రజా వ్యతిరేక బడ్జెట్లను ప్రవేశపెట్టి రికార్డ్ సృష్టించిందన్నారు. ఈ రికార్డును ఎవరూ బద్దలేకొట్టలేరు... ఎందుకంటే త్వరలోనే ప్రజాపాలన అందించే ప్రభుత్వం అధికారంలోకి రానుందని అన్నారు. 

1:22 PM IST:

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇది చారిత్రాత్మక బడ్జెట్ అని అన్నారు. యువత కోసమే ఈ బడ్జెట్లో కేటాయింపులు వుందన్నారు. అందరి అవవరాలు తీర్చే భద్రత ఇది అని అన్నారు.  వికసిత భారత్ లక్ష్యంగా ఈ బడ్జెట్ కేటాయింపులు వున్నాయన్నారు. 
 
1:19 PM IST:

పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ బడ్జెట్ తో లభ్ది లభిస్తుంది. సోలార్ రూప్ టాప్ ద్వారా కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ కల్పిస్తాం... మిగులు విద్యుత్ అమ్మకం ద్వారా 15 నుండి 20 వేల రూపాయల ఆదాయం వస్తుంది. 
 
12:49 PM IST:

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం  86 వేల కోట్లు 

ఆయుష్మాన్ భారత్ ‌- పీఎంజేఏవై   7500 కోట్లు 

ఉత్పాదక రంగానికి చెందిన పథకాల కోసం 6,200 కోట్లు 

టెక్నాలజీ అభివృద్ది 6,900 కోట్లు

సోలార్ పవర్ 8,500 కోట్లు 

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్   600 కోట్లు 
 
12:41 PM IST:

రక్షణ శాఖ  6.2 లక్షల కోట్లు 

రవాణ మరియు హైవే   2.78 లక్షల కోట్లు 

రైల్వే   2.55 లక్షల కోట్లు 

పౌర సరఫరా శాఖ 2.13 లక్షల కోట్లు

హోంశాఖ  2.03 లక్షల కోట్లు

రూరల్ డెవలప్ మెంట్ 1.77 లక్షల కోట్లు

కెమికల్ ఆండ్ పర్టిలైజర్స్ 1.68 లక్షల కోట్లు

కమ్యూనికేషన్ 1.37 లక్షల కోట్లు

వ్యవసాయం మరియ రైతుల సంక్షేమం  1.27 లక్షల కోట్లు

12:16 PM IST:

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ.47.66 లక్షల  కోట్లుగా ప్రకటించారు నిర్మలా సీతారామన్.  30  లక్షల కోట్ల ఆదాయంగా పేర్కొన్నారు.  

11:55 AM IST:

ట్యాక్స్ రేట్లు యధావిధిగా వుంటాయన్నారు. సార్టప్స్ కు ట్యాక్స్ బెనిఫిట్స్ వుంటాయన్నారు. 
 
11:54 AM IST:

టాక్స్ పేయర్స్ ను అభినందించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. గతంలో 90 రోజులుగా వున్న ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ సమయాన్ని  10 రోజులకు తగ్గించామన్నారు. 

11:45 AM IST:

టూరిజం అభివృద్దికి కృషి చేస్తున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఆద్యాత్మిక టూరిజం డెవలప్ చేస్తున్నామన్నారు. ఈ దిశగా కృషిచేయాలని రాష్ట్రాలకు సూచించారు. ఈ సందర్భంగా లక్షద్వీప్ ను ప్రస్లావించారు.  

11:39 AM IST:

3 రైల్వే కారిడార్ ప్రోగ్రాం చేపట్టాం.40 వేల రైల్వే బోగీలను వందే భారత్ స్థాయికి తీసుకుచ్చామని అన్నారు. విమానయాన రంగంలో అద్భుత ప్రగతి సాధించామన్నారు. 

11:36 AM IST:

జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి ఇస్తే, అటల్ బిహారీ వాజ్ పేయి దానికి జై విజ్ఞాన్ చేసారు. ఇప్పుడు జై అనుసంధాన్ అనేది ప్రధాని నరేంద్ర మోదీ చేర్చారు. 
 
11:34 AM IST:

డెయిరీ రైతులకు ఎంతో చేస్తున్నామని అన్నారు. దేశంలోనే అతిపెద్ద పాల సరఫరాదారుగా మారిందన్నారు. రాష్ట్రీయ్ గోకుల్ మిషన్ వంటి పథకాలు ఉపయోగపడుతున్నాయని అన్నారు.  ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్యకారులకు ఎంతో లబ్ది జరుగుతోంది. 

11:30 AM IST:

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అందరు అంగన్వాడీ, ఆశా వర్కర్లకు కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు 
 
11:27 AM IST:

పీఎం ఆవాస్ యోజన్ గ్రామీణం 3 కోట్ల ఇళ్ల నిర్మాణం ఇచ్చినట్లు తెలిపారు. 2 కోట్ల కొత్త ఇళ్లను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. 
 
11:23 AM IST:

2047 నాటికి ఇండియా అభివృద్ది చెందిన దేశంగా మారుతుందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. వేగంగా, సమతుల్యతతో కూడిన అబివృద్ది దేశంలో జరుగుతోందని అన్నారు. 
 
11:21 AM IST:

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది కానీ ఇండియా ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగా వుందన్నారు. గ్లోబల్ సమస్యలకు ఇండియా పరిష్కారంగా కనిపిస్తోందని అన్నారు. ఆర్థికవ్యవస్థ గేమ్ చేంజర్ గా ఇండియా మారిందని అన్నారు. 
 
11:17 AM IST:

జిడిపికి కొత్త అర్థం చెప్పారు నిర్మలా సీతారామన్. గవర్నెస్, డెవలప్ మెంట్, ప్రోగ్రెస్ అని అన్నారు. 

11:16 AM IST:

ఏషియన్ గేమ్స్ 2023, పారా గేమ్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటారని ఆర్థిక మంత్రి తెలిపారు.  చెస్ క్రీడాకారుడు ప్రజ్ఞానందం  గురించి కూడా ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. 

11:13 AM IST:

పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 11.8 కోట్ల రైతులకు లబ్ది లభిస్తోంది. పీఎం ఫసల్ భీమా యోజన కూడా రైతులకు అందిస్తున్నాం. 

11:07 AM IST:

హర్ గర్ జల్, విద్యుత్, గ్యాస్, బ్యాంక్ సదుపాయం రికార్డు సమయంలో కల్పించామన్నారు. ఫ్రీ రేషన్ అందిస్తున్నామని తెలిపారు. 2047 నాటికి  వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం. సోషల్ జస్టిస్  పేరుతో రాజకీయాలు చేయడంలేదని అన్నారు. 

11:06 AM IST:

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత  సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళుతున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. 

11:03 AM IST:

బడ్జెట్ సమావేశం ప్రారంభమయ్యాయి. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మొదట మాట్లాడారు. అనంతరం నిర్మలా సీతారామన్ ప్రారంభిచారు.

10:46 AM IST:

మధ్యంతర బడ్జెట్ 2024 కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మరికొద్దిసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. 

10:29 AM IST:

బడ్జెట్ 2024 ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసారు.  ఈ సందర్భంగా మంత్రికి రాష్ట్రపతి స్వీట్ తినిపించారు. 

10:14 AM IST:

తాత్కాలిక బడ్జెట్ కాబట్టి ఇందులో కొత్త పథకాల ప్రకటన వుండకపోవచ్చు. కానీ ఇప్పటికే అమలు అవుతున్న పథకాలను భారీగా నిధులు కేటాయింపు వుండనుంది.  
 
9:24 AM IST:

ఇప్పటికే మధ్యంతర బడ్జెట్ 2024 ను తయారీలో కీలకపాత్ర పోషించిన అధికారులతో ఆర్థిక మంత్రి సీతారామన్ ఫోటో దిగారు. అనతరం ఆర్థిక శాఖ కార్యాలయం నుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడానికి బయలుదేరారు. పది గంటలకు పార్లమెంట్ కు చేరుకోనున్న సీతారామన్ కేబినెట్ బేటీలో పాల్గొననున్నారు. బడ్జెట్ 2024 కు కేబినెట్ ఆమోదం తర్వాత లోక్ సభ కు వెళ్లి బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు ఆర్థిక మంత్రి సీతారామన్.
 
9:19 AM IST:

మరికొద్దిసేపట్లో కేంద్ర బడ్జెట్ 2024 ప్రవేశ పెట్టనున్న మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. 

9:04 AM IST:

చమురు మరీ ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేలా బడ్జెట్ నిర్ణయాలు వుంటాయని ప్రచారం జరుగుతోంది. అలాగే వంటగ్యాస్ ధరలు కూడా తగ్గించే చర్యలు వుండే అవకాశాలున్నాయట. వాటిపై ఇప్పుడున్న సుంకాలను తగ్గించడం ద్వారా ధరలను తగ్గించాలని కేంద్రం చూస్తోందట. 

8:57 AM IST:

ఎన్నిలక వేళ ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్ కాబట్టి మహిళలను ఆకట్టుకునే ప్రకటనలు వుండే అవకాశాలున్నాయి. మహిళా సాధికారత కోసం ప్రత్యేకంగా కేటాయింపులు, పథకాలు వుండనున్నాయి. 

8:31 AM IST:

మరికొద్దిసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. బడ్జెట్ గురించి రాష్ట్రపతికి వివరించిన అనంతరం పార్లమెంట్ కు చేరుకోనున్నారు. కేబినెట్ బేటీ అనంతరం ఆమె లోక్ సభలో అడుగుపెట్టనున్నారు. 11 గంటల తర్వాత బడ్జెట్ ప్రసంగం ప్రారంభంకానుంది. 

7:56 AM IST:

ఎన్నికలకు ముందు వెలువడుతున్న మధ్యంతర బడ్జెట్ కావడంతో ఇందులో ప్రజలపై భారం మోపే  నిర్ణయాలు వుండే అవకాశాలు లేవు. అంతేకాదు ప్రజల కోసం కొత్తగా సంక్షేమ పథకాలు, దేశ అభివృద్దికి సంబంధించిన విషయాలను మాత్రమే ఈ బడ్జెట్ ప్రస్తావించనుంది. 

budget 2024: ఓటర్లను సంతృప్తి పరచడానికి ఎటువంటి కఠినమైన చర్యలు ఉండవు; ఆర్థిక మంత్రి
 
7:37 AM IST:

ఈసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు సాధించనున్నరు. వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో ఆర్థికమంత్రిగా ఆమె నిలిచారు. ఇంతకుముందే మొరార్జీ దేశాయ్ ఈ ఘనత సాధించారు. 

7:32 AM IST:

భారత బడ్జెట్ చరిత్రలోనే ఎప్పుడూలేని విధంగా ఈసారి సరికొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈసారి పేపర్ లెస్ బడ్జెట్ వుండనుంది... టాబ్లెట్ లో చూస్తూ బడ్జెట్ ప్రసంగాన్ని చదవనున్నారు నిర్మలా సీతారామన్. 

7:11 AM IST:

దేశం అత్యధిక యువశక్తి కలిగి వుండటంతో బడ్జెట్ లో వారికి అత్యధిక కేటాయింపులు వుండే అవకాశాలున్నాయి. యుక్త వయసు వారికి ఈ బడ్జెట్ లో ఎక్కువ కేటాయింపులు వుండే అవకాశాలున్నాయి. 

బడ్జెట్ అంచనాలు : 10-19యేళ్ల యువతకు ఎక్కువ ప్రాధాన్యత.. ఎందుకంటే..
 
6:50 AM IST:

కేంద్ర బడ్జెట్ లో స్టార్టప్ కంపనీలకు అనుకూల నిర్ణయాలు వుంటాయని యువ వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. దేశంలో ఇప్పటికే అనేక స్టార్టప్స్ వుండగా ఇంకా అనేకం నెలకొల్పేందుకు యువతరం తయారుగా వుంది. ఈ క్రమంలో వీటిని ప్రోత్సహించేలా బడ్జెట్ లో ఏయే అంశాలు వుంటాయో చూడాలిమరి. 

స్టార్టప్‌ల ఆశ నెరవేరుతుందా.. ; కేంద్ర బడ్జెట్‌పైనే కొత్త పారిశ్రామికవేత్తల కన్ను..

6:37 AM IST:

2024 మధ్యంతర బడ్జెట్‌లో ఆరోగ్య రంగం అనుకూలమైన విధానాన్ని ఆశిస్తోంది. ఈ బడ్జెట్‌ ప్రకటనలు ఆరోగ్య సంరక్షణ రంగంలో ఖర్చులను మరింత తగ్గించేలా వుండనున్నాయని... ఈ  రంగంలో ఆవిష్కరణలు, పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించేలా బడ్జెట్ వుండే అవకాశాలున్నాయి. 

union budget: మందుల ధర తగ్గుతుందా.. ? ఆరోగ్య రంగంలో బడ్జెట్ అంచనాలు ఇలా..
 
6:32 AM IST:

దేశ బడ్జెట్ లో సామాన్యుడు అర్థం చేసుకోవాల్సిన అంశాలు.. నేరుగా ఎఫెక్ట్ అయ్యే అంశాలు ఉంటాయి. ఆ పది విషయాలు ఏమిటో తెలుసుకొండి. 

Budget 2024 : బడ్జెట్ తో మీకు నేరుగా ముడిపడిన పది అంశాలు..

6:21 AM IST:

కేంద్ర  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  భారత బడ్జెట్ 2024 ను మరికొద్దిసేపట్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో దేశ బడ్జెట్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి. 

యూనియన్ బడ్జెట్‌ ల గురించి ఇప్పటివరకు తెలియని 10 ఆసక్తికర విషయాలు
 
6:14 AM IST: