Champai Soren: జార్ఖండ్ రాజకీయాలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా జార్ఖండ్ రాజకీయం వేడెక్కింది. ఈ తరుణంలో జార్ఖండ్ తదుపరి సీఎంగా ఎవరు ఎన్నికవుతారనే ఉత్కంఠ నెలకొంది. తొలుత హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ను తదుపరి సీఎంగా ఎన్నుకున్నారనీ భావించారు. కానీ పలు రాజకీయా పరిణామాల నేపథ్యంలో చంపై సోరెన్ (Champai Soren) పేరును తెరపైకి వచ్చింది. ఇంతకీ ఆయన ఎవరు?
Jharkhand New CM: జార్ఖండ్ రాజకీయం ఉత్కంఠ భరితంగా సాగుతోంది. కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అయితే ఈ విషయాన్ని ముందే పసిగట్టిన హేమంత్ సోరెన్.. అరెస్ట్‌కు ముందే రాజ్‌భవన్‌కు వెళ్లి తనరాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేశారు.ఈ తరుణంలో జార్ఖండ్ తదుపరి సీఎంగా ఎవరు ఎన్నిక అవుతారు అనే ఉత్కంఠ నెలకొంది. అయితే.. హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ను తదుపరి సీఎంగా ఎన్నుకున్నారనీ భావించారు. కానీ.. సోరెస్ కుటుంబంలో సీఎం కూర్చీపై కుమ్ములాట మొదలైంది.
హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ను సీఎంగా చేయాలనే ప్రతిపాదను తీవ్రంగా హేమంత్ సోరెన్ వదిన, శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ భార్య సీతా సోరెన్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో జేఎంఎం పార్టీ తన నిర్ణయాన్ని వెంటనే మార్చుకుంది. ఈ ఉత్కంఠ పరిస్థితిలో చంపై సోరెన్ పేరును తెరపైకి వచ్చింది. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే.. జేఎంఎం ఎమ్మెల్యేలు చంపై సోరెన్ (Champai Soren)ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. జార్ఖండ్ టైగర్‌గా ప్రసిద్ధి చెందిన చంపై సోరెన్ ఇప్పుడు రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం చంపాయ్ జార్ఖండ్ కేబినెట్ సీనియర్ మంత్రి.
undefined
ఇంతకీ చంపై సోరెన్ ఎవరు?
చంపై సోరెన్ (Champai Soren) సెరైకెలా-ఖర్సావాన్ జిల్లాలోని జిల్లింగాగోడ గ్రామ నివాసి. అతని తండ్రి పేరు సిమల్ సోరెన్. వారిది వ్యవసాయ కుటుంబం. సిమల్ సోరెన్ నలుగురు పిల్లలలో చంపై పెద్ద వాడు. చంపై 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు. ఆయనకు మాంకోతో చిన్నతనంలోనే వివాహమైంది.
బీహార్ లో ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం ఉద్యమం ప్రారంభమైనప్పటీ నుంచి హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్‌తో కలిసి పనిచేశారు. అనతికాలంలోనే అతను 'జార్ఖండ్ టైగర్' పేరుతో ప్రసిద్ధి చెందాడు. దీని తరువాత..చంపై సోరెన్ సెరైకెలా స్థానం నుండి ఉప ఎన్నికలో స్వతంత్ర ఎమ్మెల్యేగా పోటీ చేసి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఇక జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కూడా చంపై సొరెన్ తీవ్రంగా కృషి చేశారు.
ఆ తర్వాత అతను జార్ఖండ్ ముక్తి మోర్చాలో చేరాడు. అర్జున్ ముండా నాయకత్వంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో ఆయన క్యాబినెట్ మంత్రిగా, పలు మంత్రిత్వ శాఖలను చేపట్టారు. చంపై 11 సెప్టెంబర్ 2010 నుండి 18 జనవరి 2013 వరకు మంత్రిగా ఉన్నారు. దీని తరువాత..రాష్ట్రపతి పాలన విధించబడింది. ఆ తరువాత ఏర్పడిన హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వంలో.. చంపై సోరెన్ ఆహార, పౌర సరఫరాలు, రవాణా మంత్రిగా చేశారు.
హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రెండోసారి మంత్రి .. 2019లో హేమంత్ సోరెన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సమయంలో చంపై సోరెన్ రవాణా, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు. చంపై ప్రస్తుత్తం JMM వైస్ ప్రెసిడెంట్ కూడా. ఇప్పుడు ఆయన శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. దీంతో 67 ఏళ్ల చంపై సోరెన్ జార్ఖండ్ నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.