CM: ఇంతకీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయవచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయి ?

By Rajesh Karampoori  |  First Published Feb 1, 2024, 3:27 AM IST

Hemant Soren: భూ కుంభకోణం, మనీలాండరింగ్ ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)  అధికారులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అరెస్టు చేయవచ్చా? ఎలాంటి కేసులు నమోదైతే అరెస్టు చేయ్చొచ్చు అనే అంశం చర్చనీయాంశంగా మారింది.


Hemant Soren: జార్ఖండ్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భూ కుంభకోణం, మనీలాండరింగ్ ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)  అధికారులు కొన్ని గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం హేమంత్ సోరెన్‌ తన రాజీనామాను గవర్నర్ అందచేసిన వెంటనే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రిని అరెస్టు చేయవచ్చా? ఎలాంటి కేసులు నమోదైతే అరెస్టు చేయ్చొచ్చు? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ రాజ్యాంగ నియమాలు,  నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఓ సారి తెలుసుకుందాం.

 అరెస్టుకు ముందు అనుమతి తప్పనిసరి 

Latest Videos

సివిల్ ప్రొసీజర్ కోడ్ 135 ప్రకారం ముఖ్యమంత్రి లేదా శాసన మండలి సభ్యులకు సివిల్ కేసులలో అరెస్టు నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ, ముఖ్యమంత్రి, అసెంబ్లీ సభ్యునిపై ఏదైనా క్రిమినల్ కేసు నమోదైతే.. సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద అరెస్టుచేసే అవకాశం ఉంటుంది. అయితే..ఇక్కడకూడా ఒక నియమం వర్తిస్తుంది. ముఖ్యమంత్రి లేదా శాసన మండలి సభ్యులను అరెస్టు చేయాలనుకుంటే.. ముందుగా అసెంబ్లీ స్పీకర్ ఆమోదం పొందాలి. చట్టం ప్రకారం సీఎంను అరెస్టు చేయాలంటే ముందుగా సభాపతి ఆమోదం తప్పనిసరి.  ఆమోదం పొందిన తరువాతే ముఖ్యమంత్రిని అరెస్టు చేయొచ్చు.

ముఖ్యమంత్రిని ఎప్పుడు అరెస్ట్ చేయలేరు?

 సివిల్ ప్రొసీజర్ కోడ్ 135 ప్రకారం.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే 40రోజుల ముందు, సమావేశాలు ముగిసిన 40 రోజుల తరువాత ముఖ్యమంత్రి, అసెంబ్లీ సభ్యుడిని అరెస్టు చేయరాదు. అంతే కాకుండా.. ముఖ్యమంత్రిని లేదా  ఏ అసెంబ్లీ సభ్యుడినైనా హౌస్ నుంచి అరెస్టు చేయడం కుదరదు. అలాగే..నిందితులు ఏ పదవుల్లో ఉండగా అరెస్టు చేయలేరంటే.. ఆర్టికల్ 61 ప్రకారం.. రాష్ట్రపతి, గవర్నర్ ను పదవిలో ఉన్నప్పుడు అరెస్టు చేయరాదు. చట్టం ప్రకారం, ఈ అరెస్టు సివిల్, క్రిమినల్ రెండింటిపై ఎలాంటి అభియోగంపై చేయరాదు. రాష్ట్రపతి, గవర్నర్ తమ పదవులకు రాజీనామా చేస్తే అరెస్టు చేయొచ్చు.
 
ఆర్టికల్ 361 ఏం చెబుతోంది?

ఆర్టికల్‌ 361  రాష్ట్రపతి, గవర్నర్లకు మాత్రమే రక్షణ కల్పించింది. ఆర్టికల్‌ 361(1) ప్రకారం.. రాష్ట్రపతి, గవర్నర్లకు అరెస్టు , నిర్బంధం విషయంలో మినహాయింపు ఉంది. తమ పదవీకాలంలో వారిపై ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్‌లు ఏ కోర్టుల్లోనూ ప్రారంభించలేం. తమ అధికారాలు, విధుల నిర్వహణలో తీసుకునే నిర్ణయాలు, చర్యలను ప్రశ్నించే అధికారం ఏ న్యాయస్థానానికీ లేదని చెబుతోంది. అలాగే ఏ కోర్టు కూడా వారి అరెస్టు చేయాలని  ఆదేశించకూడదు. కానీ, ఈ నిబంధన ప్రకారం.. రాష్ట్రపతి, గవర్నర్ల చర్యలకు మినహాయింపులున్నప్పటికీ.. వారి చర్యలు దురుద్దేశపూరితంగా, ఏకపక్షంగా, అసంబద్ధంగా ఉంటే..వారిపై కూడా జోక్యం చేసుకోవచ్చని గతంలో పలు సంద ర్భాల్లో కోర్టులు తీర్పులు చెప్పాయి

అరెస్టయినా ముఖ్యమంత్రులు వీరే.. 

లాలూ ప్రసాద్ యాదవ్:దాణా కుంభకోణం కేసులో 1997లో సీబీఐ తొలి ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పేరు ఉంది. అటువంటి పరిస్థితిలో అతను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన భార్య రబ్రీదేవికి సీఎం పగ్గాలు అప్పగించాడు. ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ చేయబడ్డారు.

జయలలిత: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె దోషిగా తేలారు. అయినా ఆమె ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు.  జయలలిత తన పదవికి రాజీనామా చేయడంతో ఆ తరువాత అరెస్ట్ అయ్యారు.

బీఎస్‌ యడియూరప్ప: 2011లో అక్రమ మైనింగ్‌కు సంబంధించి లోకాయుక్త నివేదిక రావడంతో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. దీని తరువాత.. రాష్ట్ర బాధ్యతలను  డివి సదానంద గౌడకు అప్పగించబడింది. కొన్ని రోజుల తరువాత యడియూరప్పను అరెస్టు చేశారు.

click me!