ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేయాలనే కుట్ర.. సెల్ఫీ వైరల్ కావడంతో విఫలం : వాంఖడేపై మంత్రి ఆరోపణలు

By telugu teamFirst Published Nov 7, 2021, 2:38 PM IST
Highlights

ముంబయి క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసుపై ఎన్‌సీబీ అధికాని సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేసి, భారీ మొత్తంలో డబ్బు గుంజాలనే కుట్ర జరిగిందని, ఇందులో సమీర్ వాంఖడే కూడా భాగస్వామిగా ఉన్నారని తాజాగా ఆరోపణలు చేశారు. ఈ కుట్ర వెనుక బీజేపీ నేత మోహిత్ కంబోజ్ మాస్టర్ మైండ్ అని ఆరోపించారు.
 

ముంబయి: Maharashtra రాజధాని Mumbai నుంచి గోవాకు వెళ్లాల్సిన ఓ Cruise Shipలో Drugs లభించినట్టు చెప్పిన కేసులో ఊహించని పరిణామాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ కేసులో Bollywood స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు Aryan Khanకు బెయిల్ లభించింది. ఆ క్రూయిజ్ షిప్‌పై తనిఖీలకు సారథ్యం వహించిన NCB అధికారి Sameer Wankhedeపై Minister Nawab Malik ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాజాగా, బీజేపీ నేత మోహిత్ కంబోజ్, ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేపై ఆరోపణలు చేశారు.

షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను తొలుత కిడ్నాప్ చేయాలని కుట్ర చేశారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. కానీ, ఒకే ఒక సెల్ఫీ ఆ కుట్రను నాశనం చేసిందని అన్నారు. క్రూయిజ్ షిప్‌పైకి వెళ్లడానికి ఆర్యన్ ఖాన్ టికెట్ కొనుగోలు చేయలేదని కోర్టులో చెప్పారని గుర్తుచేశారు. ప్రతీక్ గాబా, అమిర్ ఫర్నీచర్‌వాలాల వల్లే ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్‌కు వెళ్లారని పేర్కొన్నారు. ఇదంతా కూడా ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేయాలనే అని, పెద్ద మొత్తంలో సొమ్మును గుంజాలనే అని ఆరోపణలు చేశారు. బీజేపీ లీడర్ మోహిత్ కంబోజ్ బంధువు ఈ కుట్ర చేశారని వివరించారు.

Also Read: Aryan Khan: సమీర్‌ వాంఖడేపై వేటు..! ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తు నుంచి తొలగింపు

ఆర్యన్ ఖాన్‌ను అక్కడికి తీసుకెళ్లారని, కిడ్నాప్ గేమ్ ప్రారంభించారని నవాబ్ మాలిక్ అన్నారు. ఈ కిడ్నాప్ గేమ్‌లో  భాగంగానే రూ. 25 కోట్ల డీల్ గురించిన చర్చ జరిగిందని తెలిపారు. చివరికి ఈ డీల్ రూ. 18 కోట్లకు కుదిరిందని పేర్కొన్నారు. అందులో భాగంగానే రూ. 50 లక్షలు చేతులు మారాయని వివరించారు. కేవలం ఒక్క సెల్ఫీ మాత్రమే మొత్తం కథనంతా అడ్డం తిప్పిందని చెప్పారు. ఇదే వాస్తవమని తెలిపారు. 

ఈ కేసులో బీజేపీ నేత మోహిత్ కంబోజ్ దీని వెనుక మాస్టర్ మైండ్ అని, ఈ కుట్రలో ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే కూడా పార్ట్‌నర్‌గా ఉన్నారని మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు.

క్రూయిజ్ షిప్‌ డ్రగ్స్ తనిఖీలో ఆర్యన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రైవేటు డిటెక్టర్‌గా పేరున్న కేపీ గోసావి అనే ఓ వ్యక్తి ఆర్యన్ ఖాన్‌తో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనంతరం కేపీ గోసావి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.

Also Read: Aryan Khan Case : ప్రత్యక్ష సాక్షి కిరణ్ గోసావి అరెస్ట్...

డ్రగ్స్ కేసు పంచానామాలో సాక్షిగా సంతకం చేసిన కేపీ గోసావి, ఆయన బాడీగార్డ్‌ ప్రభాకర్ సాయిల్ వార్తల్లోకి ఎక్కారు. ప్రభాకర్ సాయిల్ సంచలన ఆరోపణలతో సమీర్ వాంఖడే చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆర్యన్ ఖాన్ విడుదల కోసం ఓ డీల్ జరిగిందని, కేపీ గోసావి ఓ వ్యక్తితో ఫోన్‌లో డీల్ మాట్లాడాడని వెల్లడించారు. రూ. 25 కోట్ల డీల్ రూ. 18 కోట్లకు కుదిరిందని వివరించారు. ఇందులో ఎన్‌సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకూ వాటా ఉన్నదని ఆ ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ దొరికిందో లేదో కూడా తనకు తెలియదని ప్రభాకర్ సాయిల్ తెలిపారు. తెల్ల కాగితాలపై తన సంతకాన్ని తీసుకున్నారని వివరించారు.

click me!