Asianet News TeluguAsianet News Telugu

Aryan Khan: సమీర్‌ వాంఖడేపై వేటు..! ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తు నుంచి తొలగింపు

ముంబయి డ్రగ్స్ క్రూయిజ్‌కు సంబంధించిన కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చిన తరుణంలో ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షణ చేస్తున్న ఎన్‌సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఎన్‌సీబీ విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా, క్రూయిజ్ కేసుతోపాటు మరో నాలుగు కేసుల దర్యాప్తు బాధ్యతల నుంచి ఆయనను తొలగించింది. ఈ కేసుల దర్యాప్తును ముంబయి జోన్ నుంచి సెంట్రల్ జోన్‌కు బదిలీ చేసింది.
 

NCB officer Sameer Wankhede removed from Aryan Khan case
Author
Mumbai, First Published Nov 5, 2021, 8:10 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ముంబయి: దేశవ్యాప్తంగా సంచలమైన ముంబయి Drugs Cruise కేసులో మరో కీలక పరిణామం ముందుకు వచ్చింది. Mumbai పోర్టు నుంచి బయల్దేరి గోవా చేరుతున్న ఓ క్రూయిజ్‌లో NCB అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అందులో బాలీవుడ్ స్టార్ Shah Rukh Khan తనయుడు Aryan Khan కూడా ఉన్నారు. ఆర్యన్ ఖాన్ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనానికి తెరతీసింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ విషయమై తీవ్ర చర్చ జరిగింది. ఆ తర్వాత అనూహ్యంగా అవినీతి ఆరోపణలు తెర మీదకు రావడంతో కేసుపై నుంచి ఫోకస్ సమీర్ వాంఖడే పైకి షిఫ్ట్ అయింది. ఎన్‌సీబీ స్వయంగా Sameer Wankhedeపై విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తాజాగా ఆర్యన్ ఖాన్ కేసుతో పాటు మరో నాలుగు కేసుల్లోనూ దర్యాప్తు నుంచి తప్పిస్తూ ఎన్‌సీబీ నిర్ణయం తీసుకుంది. 

మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్‌సీబీ చర్యలను విమర్శనాత్మకంగానే చూసింది. మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీయడానికే కేంద్ర ప్రభుత్వం అక్కసుతో ఈ చర్యలు చేపడుతున్నదని పలుసార్లు ఆరోపణలు చేసింది. రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ మాత్రం సమీర్ వాంఖడేపై విమర్శలకు పదును పెంచారు. బీజేపీ నేతలు, ఎన్‌సీబీ అధికారులు కుమ్మక్కై ఈ కేసు బనాయించారని ఆరోపించారు. క్రూయిజ్ కేసులో బీజేపీ నేత బంధువు ఒకరిని డ్రగ్స్ దొరికినా అరెస్టు చేయలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. సమీర్ వాంఖడే వ్యక్తిగత విషయాలనూ నవాబ్ మాలిక్ తన విమర్శల్లో చేర్చారు.

Also Read: ఆర్యన్ ఖాన్ కేసులో అనూహ్య ట్విస్ట్.. సాక్షి సంచలన ఆరోపణలు.. 18 కోట్ల డీల్.. నాకు ప్రాణ హాని

అయితే, క్రూయిజ్ డ్రగ్స్ కేసు పంచనామా పత్రంలో సాక్షిగా సంతకం చేసిన కేపీ గోసావి బాడీగార్డ్ ప్రభాకర్ సాయిల్ ఆరోపణలు కేసులో అనూహ్య మలుపు తెచ్చింది. కేపీ గోసావి షారూఖ్ ఖాన్ తరఫు వాళ్లతో డీల్ మాట్లాడారని, కేసు నుంచి ఆర్యన్ ఖాన్‌ను విడుదల చేయడానికి రూ. 25కోట్ల డీల్ మాట్లాడారని సాయిల్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, అందులో ఎన్‌సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు రూ. 8 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని కేపీ గోసావి ఫోన్‌లో మాట్లాడినట్టు సాయిల్ ఆరోపించారు.

ఈ ఆరోపణల తర్వాత నవాబ్ మాలిక్ ఆరోపణలు పెంచారు. తీవ్రమైన ఆరోపణలు రావడంతో సమీర్ వాంఖడేపై ఎన్‌సీబీ విజిలెన్స్ దర్యాప్తును ప్రారంభించింది. తీవ్ర ఆరోపణలు రావడం, విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభమైన తరుణంలో సమీర్ వాంఖడేను ఆ కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించింది.

Also Read: Aryan Khan Released: జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్.. జైలుకు వద్దకు వచ్చిన షారుఖ్..భారీగా చేరుకున్న అభిమానులు

ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తును సమీర్ వాంఖడే చేయడం లేదని, కేవలం దర్యాప్తును పర్యవేక్షిస్తున్నాడని ఇది వరకే ఎన్‌సీబీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆర్యన్ ఖాన్ కేసుతోపాటు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్‌కు సంబంధించిన డ్రగ్స్ కేసు, మరో మూడు కేసుల దర్యాప్తు బాధ్యతల నుంచి సమీర్ వాంఖడేను తొలగిస్తూ ఎన్‌సీబీ నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల దర్యాప్తును ఎన్‌సీబీ ముంబయి జోన్ నుంచి సెంట్రల్ జోన్‌కు బదిలీ చేసింది. ఎన్‌సీబీ అధికారి సంజయ్ సింగ్ ఈ కేసుల దర్యాప్తును పర్యవేక్షించనున్నారు.

కాగా, సమీర్ వాంఖడే ఎన్‌సీబీ ముంబయి యూనిట్ జోనల్ డైరెక్టర్‌గా కొనసాగుతారు.

Follow Us:
Download App:
  • android
  • ios