తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
12:13 AM (IST) Jul 08
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు చేస్తానంటున్నారు అజయ్ దేవగణ్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన ఈ ప్రతిపాదన చేశారు.
11:30 PM (IST) Jul 07
మారుతి సుజుకి ఆల్టో K10 కారుపై అదిరిపోయే తగ్గింపు! పెట్రోల్, సిఎన్జీ, ఆటోమేటిక్ వెర్షన్లలో కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. 6 ఎయిర్‌బ్యాగులు, అద్భుతమైన మైలేజ్, తక్కువ ధరతో ఇది మధ్యతరగతి కుటుంబాలకు అనువైన ఎంపిక.
10:15 PM (IST) Jul 07
చాగంటి కోటేశ్వరరావు గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. మరి ఆయన భార్య ఎవరు? ఏం చేస్తారు? పిల్లలెంతమంది? వారేం చేస్తున్నారు? మనవళ్లు మనవరాల్లు ఎంతమంది? ఇలాంటి వ్యక్తిగత వివరాలు చాలామందికి తెలియవు. ఇక్కడ వారిగురించి తెలుసుకుందాం.
08:09 PM (IST) Jul 07
సుఖోయ్ యుద్దవిమానాలను రష్యా నుండి భారత్ కొనుగోలుచేసింది. అయితే ఇప్పుడు వాటి సామర్థ్యంపై అనుమానాలు మొదలయ్యాయి. మరి నిజంగానే ఇవి అత్యాధునిక యుద్దాలకు పనికిరావా?
06:23 PM (IST) Jul 07
దక్షిణ మధ్య రైల్వే ఈ జులైలో బాసర సరస్వతీ దేవాలయం (తెలంగాణ), తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం (ఆంధ్రప్రదేశ్) మధ్య హైదరాబాద్ మీదుగా ప్రత్యేక రైలు సర్వీసును ప్రారంభించింది. దీంతో కేవలం వీకెండ్ లో ఈ రెండు దేవాలయాలను సందర్శించి వచ్చే అవకాశం లభిస్తుంది.
05:54 PM (IST) Jul 07
మనిషి శాస్త్ర సాంకేతంగా ఎంత ఎదిగినా ఇప్పటికీ జ్యోతిష్యాన్ని విశ్వసించే వారు మనలో చాలా మంది ఉంటారు. గ్రహాల కదలికలు మన జీవితంపై ప్రభావాన్ని చూపుతాయి. మరి ఈ వారం కుంభరాశి వారి ఫలితం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
05:05 PM (IST) Jul 07
ఏటీఎమ్ నుంచి డబ్బులు తీసుకోవాలంటే ఏటీఎమ్ కార్డు ఉండాలని తెలిసిందే. అయితే దేశంలో కొత్త ఏటీఎమ్ సెంటర్లు వస్తున్నాయి. ఏటీఎమ్ కార్డుల అవసరం లేకుండానే డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉన్న ఈ సేవల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
03:46 PM (IST) Jul 07
ప్రస్తుతం దేశంలో టెలికం కంపెనీల మధ్య పోటీ పెరిగింది. జియో రాకతో రీఛార్జ్ ధరలు భారీగా తగ్గాయి. అయితే గతేడాది జియో సహా అన్ని కంపెనీలు టారిఫ్‌లను భారీగా పెంచాయి. అయితే మరోసారి యూజర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి టెలికం కంపెనీలు..
03:00 PM (IST) Jul 07
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిపై దృష్టిసారించింది. ముఖ్యంగా అమరావతితో పాటు ఇతర నగరాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
01:11 PM (IST) Jul 07
ఇంట్లో బంగారం ఉంటే ఆ ధీమానే వేరు. ఇప్పటికీ చాలా మంది భారతీయులు బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా మంచి పెట్టుబడి మార్గంగా కూడా భావిస్తారు. క్షణాల్లో గోల్డ్ లోన్ పొందొచ్చు. అయితే తాజాగా ఆర్బీఐ గోల్డ్ లోన్ విషయంలో కీలక మార్పులు చేసింది.
12:20 PM (IST) Jul 07
క్రికెట్ ప్రపంచంలో ధోనీకు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోనీ క్రీజులో ఉంటేనే మ్యాచ్ చూసే వాళ్లు కూడా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ధోనీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ ఆసక్తికర కథనం.
11:55 AM (IST) Jul 07
ఈ వారాంతంలో తెలుగు విద్యార్థులకు వరుస సెలవులు ఉన్నాయి. వచ్చే శని, ఆదివారం అందరికి సెలవే. తెలంగాణ విద్యార్థులకు ఈ రెండ్రోజులతో పాటు మరో సెలవు అదనంగా వచ్చే అవకాశాలున్నాయి. ఈ వారం స్కూల్స్, కాలేజీలు, ఉద్యోగుల సెలవులపై పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
11:55 AM (IST) Jul 07
చరిత్ర తనలో ఎన్నో రహస్యాలను దాచుకుంటుంది. అయితే ఇప్పటికీ సమాధానం లభించని రహస్యలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి ఓ రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
10:21 AM (IST) Jul 07
మహేంద్రసింగ్ ధోనీ.. ఈ పేరే ఓ అద్భుతం. క్రికెట్ అభిమానులకు తారకమాత్రం. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ధోనీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర కథనం మీకోసం..
08:06 AM (IST) Jul 07
తెలంగాణలో ఇవాళ్టి నుండి అంటే జులై 7 నుండి 10వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది… ఆ జిల్లాలేవంటే…