చాగంటి కోటేశ్వరరావు కొడుకు, కూతురు ఎక్కడుంటారు? ఏం చేస్తారో తెలుసా?
చాగంటి కోటేశ్వరరావు గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. మరి ఆయన భార్య ఎవరు? ఏం చేస్తారు? పిల్లలెంతమంది? వారేం చేస్తున్నారు? మనవళ్లు మనవరాల్లు ఎంతమంది? ఇలాంటి వ్యక్తిగత వివరాలు చాలామందికి తెలియవు. ఇక్కడ వారిగురించి తెలుసుకుందాం.

ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు వ్యక్తిగత జీవితం
Chaganti Koteshwara Rao : ఆయన పేరు వింటేనే ఆధ్యాత్మిక భావన కలుగుతుంది... అలాంటిది ప్రవచనాలు వింటే ఇంకెలా ఉంటుంది... మనసు ప్రశాంతంగా మారి దైవిక చింతనలోకి వెళ్లిపోతుంది. ఎంతటి కఠినమైన మనసున్నవారైనా ఆయన మాటలువింటే మారిపోవాల్సిందే. ఇలా తెలుగులో ప్రవచనాలు చెబుతూ గొప్పపేరు సంపాదించుకున్న ఆయన ఇంకెవరో కాదు చాగంటి కోటేశ్వరరావు.
ప్రవచన చక్రవర్తి బిరుదు పొందిన చాగంటివారు తెలుగు ప్రజలందరికీ సుపరిచితమే. ఆయనను టీవీల్లోనో లేదంటే ఏదైనా ఆలయంలో ప్రవచనం ఇస్తుండగానో చూసివుంటారు. ఆయన ప్రవచనాలను చివరకు సినిమాల్లోనూ వాడుతున్నారంటే ఎంత ఫేమసో అర్థం చేసుకోవచ్చు. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల ప్రభావం నేటి తెలుగు సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో చెప్పడానికి ఇదే నిదర్శనం.
చాగంటి పిల్లలు ఏం చేస్తారు?
ఇక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గతేడాది చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ సలహాదారుగా నామినేట్ చేసింది. విద్యార్థులు మరీముఖ్యంగా యువతలో నైతిక విలువలు పెంపొందించేందుకు చాగంటికి ప్రత్యేకంగా నామినేటెడ్ పదవిని కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వం. కేబినెట్ ర్యాంకును కేటాయించి భారీ సాలరీతో పాటు ఇతర సౌకర్యాలను కూడా కల్పిస్తోంది.
ఇలా చాగంటి కోటేశ్వరరావు ప్రొఫెషనల్ లైఫ్ గురించి అందరికీ తెలుసు... మరి ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఎంతమందికి తెలుసు? తెలుగు ప్రజలకు నైతిక విలువలు నేర్పే ఆయన సొంత పిల్లలను ఎలా పెంచారు? వారు ఇప్పుడేం చేస్తున్నారు? ఇలా చాగంటి కుటుంబం, పిల్లల గురించి తెలుసుకుందాం.
చాగంటి కోటేశ్వరరావు తల్లిదండ్రులెవరు?
ప్రవచనకర్తగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపుపొందిన చాగంటి కోటేశ్వరావు స్వస్థలం కాకినాడ. ఆయన 1959 జులై 14న చాగంటి సుందర శివరావు, సుశీలమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పటినుండి ఆయన ఏకసంతాగ్రహే... ఏదయినా ఒక్కసారి వింటే మరిచిపోయేవారు కాదు.
చిన్నతనంలోనే తండ్రి చనిపోగా ఎన్నో కష్టాలు భరించి తల్లి చాగంటితో పాటు తోబుట్టువులను చదవించింది… పెంచి పెద్దవాళ్లను చేసింది. తల్లి కష్టాన్ని చూస్తూ పెరిగిన ఆయన చదువును అశ్రద్ద చేయలేదు… ఆయన యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారంటేనే ఆయన చదువు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఎంతో కష్టపడి చదివిన ఆయన ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాన్ని సాధించారు.
తోబుట్టువుల పెళ్లిళ్లు చేసాక చాగంటి కోటేశ్వరరావు కూడా సుబ్మహ్మణ్యేశ్వరిని పెళ్లాడారు... ఆమెకూడా వ్యవసాయ శాఖలో ఉన్నతాధికారిని. వీరి అనోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు సంతానం ఉన్నారు. కొడుకు షణ్ముకాంజనేయ సుందర శివ చరణ్ శర్మ, కూతురు నాగ శ్రీవల్లి. ఇద్దరూ బిటెక్ పూర్తిచేశారు... పెళ్లిళ్లు కూడా అయ్యాయి.
చాగంటి కొడుకు సాప్ట్ వేర్ ఇంజనీర్
చాగంటి దంపతులు బిడ్డలిద్దరినీ ఎంతో క్రమశిక్షణగా పెంచారు... దీంతో బాగా చదువుకుని జీవితంలో స్థిరపడ్డారు. కొడుకు శివచరణ్ టిసిఎస్ (టాటా కన్సల్టేన్సీ సర్వీసెస్) లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతడి భార్య దివ్య సుమన కూడా బిటెక్ పూర్తిచేసింది... అయితే పిల్లలను చూసుకునేందుకు ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. వీరికి ఇద్దరు కవలలు సంతానం... మనవడికి కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖరానంద సరస్వతిపై భక్తితో చంద్రశేఖర స్వామి అని పేరు పెట్టుకున్నారు చాగంటి... మనవరాలిపేరు మీనాక్షి.
చాగంటి కోటేశ్వరరావు కూతురు, అల్లుడు ఏం చేస్తారో తెలుసా?
ఇక చాగంటి కోటేశ్వరరావు కూతురు నాగ శ్రీవల్లికి కూడా పెళ్లయ్యింది. ఆమె బిటెక్ పూర్తిచేసారు.. భర్త బిట్స్ పిలానీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఉద్యోగం నిమిత్తం వీరిద్దరు అమెరికాలో ఉంటున్నారు. వీరికి కూడా ఇద్దరు కవలలు సంతానమని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు.
ఇలా చాగంటి కోటేశ్వరరావు ఇద్దరు పిల్లుల లైఫ్ లో సెటిల్ అయ్యారు. దీంతో కుటుంబ బాధ్యతలేవీ లేవుకాబట్టి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి ప్రవచనకర్తగా మారిపోయారు. ఇలా తెలుగువారిని భక్తిమార్గంలో నడిపిస్తూ యువతలో నైతిక విలువలు పెంచేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.