ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
09:41 PM (IST) Jul 13
Joe Root: ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ టెస్టుల్లో నంబర్ 4 స్థానంలో 8000 పరుగుల మైలురాయిని అధిగమించి అరుదైన క్లబ్‌లో చోటు దక్కించుకున్నారు.
08:54 PM (IST) Jul 13
Teenmar Mallanna: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఈ క్రమంలోనే గన్‌మెన్ గాల్లో కాల్పులు జరిపారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
07:35 PM (IST) Jul 13
Amazon Prime Day Smartphone Deals: అమెజాన్ ప్రైమ్ డే 2025లో OnePlus Nord 5 నుండి Galaxy S24 Ultra వరకు టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ చాలానే ఉన్నాయి.
06:46 PM (IST) Jul 13
Ai Plus smartphone: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో పాటు మరిన్ని ఫీచర్లతో కేవలం 4,499 రూపాయలకే భారత్ మార్కెట్ లోకి కొత్త స్మార్ట్స్ ఫోన్ వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
03:32 PM (IST) Jul 13
Parijat Plant: పారిజాత చెట్టు, పువ్వుల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ చెట్టు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ చెట్టు పువ్వులు కేవలం పూజకే కాాదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పారిజాత పుష్పం, ఆకులు, బెరడు లాభాల గురించి తెలుసుకుందాం.
01:29 PM (IST) Jul 13
ప్రతీ ఒక్కరూ ఉద్యోగం లేదా వ్యాపారం నుంచి విరమణ తీసుకోవాల్సిందే. అయితే ఏ పనిచేయకపోయినా ప్రతీ నెల రూ. 9 వేలు పొందే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ! మీరు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారా.? అయితే మీ స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిందే.
12:17 PM (IST) Jul 13
న్యాయం, కర్మలకు శనిదేవుడిని అధిపతిగా శాస్త్రం చెబుతుంది. అత్యంత నెమ్మదిగా ప్రయాణించే శని గ్రహ ప్రభావం మన జీవితాలపై ఉంటుందని విశ్వాసం. కాగా నేడు (ఆదివారం) శని తిరోమనంలోకి వెళ్తాడు. దీంతో కొన్ని రాశులపై ప్రభావం పడనుంది.
11:37 AM (IST) Jul 13
కర్ణాటకలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దట్టమైన అటవీ ప్రాంతంలో రష్యాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్న విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే..
10:47 AM (IST) Jul 13
తెలుగు సినీ పరిశ్రమ అద్భుత నటుడిని కోల్పోయింది. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాదు, నిజ జీవితంలోనూ ప్రజలకు సేవచేసిన ఓ గొప్ప వ్యక్తి కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు.
09:41 AM (IST) Jul 13
అన్ని రంగాల్లో టెక్నాలజీ అనివార్యంగా మారిన క్రమంలోనే ఇండియన్ రైల్వేస్ సైతం డిజిటలైజేషన్‌ను అందిపుచ్చుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా రైల్‌వన్ పేరుతో ఓ యాప్‌ను తీసుకొచ్చింది.
08:41 AM (IST) Jul 13
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇకపై ఆ ప్రాంత ప్రజలు కేవలం నాలుగున్నర గంటల్లోనే తిరుపతికి చేరుకోవచ్చు. ఇందులో భాగంగానే కొత్త వందే భారత్ రైలును ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఏ రూట్‌లో అందుబాటులోకి రానుందంటే.
07:42 AM (IST) Jul 13
ఈ ఏడాది మే 26 నే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. దీంతో కాలం త్వరగా వచ్చింది బాగా వర్షాలు పడుతాయని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఇంతకీ ఆశించిన స్థాయిలో వర్షాలు ఎందుకు కురవడం లేదంటే..