రేప్ కేసులో శిక్ష.. బెయిల్ పై బయటకు వచ్చి... భాధితురాలు, ఆమె భర్తపై..

By telugu teamFirst Published Nov 29, 2019, 12:49 PM IST
Highlights

 నాలుగు రోజుల క్రితం టింకు అన్వర్ బెయిల్ పై బయటకు వచ్చాడు. బెయిల్ పై బయటకు రాగానే.. తన మిత్రులు సిక్కు, షారూఖ్, అబ్రాబ్ అనే ముగ్గురు మిత్రులతో కలిసి సదరు బాధిత మహిళ ఇంటికి వెళ్లాడు. ముందుగా బాధిత మహిళ భర్త(40)పై కత్తితో దాడి చేశాడు. 

అప్పటికే తప్పు చేశాడు..  కోర్టు అతనికి శిక్ష వేసింది. అతనిలో మార్పు రాకపోగా.. తనపై కేసు పెట్టిన వారిపై పగ పెంచుకున్నాడు. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కేసులో అతనికి కోర్టు శిక్ష విధించింది. తనపై కేసు పెట్టారని పగ పెంచుకొని.. బెయిల్ పై బయటకు వచ్చి మరీ.. సదరు భాదిత మహిళ, ఆమె భర్త పై దాడి చేశాడు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... టింకు అన్వర్  2017లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను రెండు సంవత్సరాల పాటు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో సదరు మహిళ ఈ ఏడాది సెప్టెంబర్ లో అతనిపై ఫిర్యాదు  చేసింది. అతను చేసింది నేరం అని రుజువు కావడంతో కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది.

కాగా... నాలుగు రోజుల క్రితం టింకు అన్వర్ బెయిల్ పై బయటకు వచ్చాడు. బెయిల్ పై బయటకు రాగానే.. తన మిత్రులు సిక్కు, షారూఖ్, అబ్రాబ్ అనే ముగ్గురు మిత్రులతో కలిసి సదరు బాధిత మహిళ ఇంటికి వెళ్లాడు. ముందుగా బాధిత మహిళ భర్త(40)పై కత్తితో దాడి చేశాడు. కత్తితో పలు మార్లు అతనిని పొడిచాడు. అనంతరం సదరు మహిళపై కూడా కత్తితో దాడి చేశాడు. పొట్టలో పలు మార్లు పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.

కాగా... బాధితులు ఇద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సదరు మహిళ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రధాన నిందితుడు టింకు అన్వర్, అతని మిత్రులు సిక్కు, షారూఖ్, అబ్రాబ్ లపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

click me!