అసహజ శృంగారం వద్దన్నందుకు భార్యను విడిచిపెట్టిన ఎన్నారై భర్త.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

By team teluguFirst Published Jan 18, 2023, 3:19 PM IST
Highlights

అసహజ సెక్స్ వద్దని చెప్పినందుకు ఓ ఎన్నారై భార్యను వదిలిపెట్టారు. ఈ భార్య భర్తలిద్దరూ రెండేళ్ల పాటు సహజీవనం చేసి 2019లో వివాహం చేసుకున్నారు. తరువాత ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. ఈ ఘటనలో బాధితురాలు గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందినవారు. 

అసహజ శృంగారానికి నిరాకరించిందని ఓ భర్త తన భార్యను వదిలిపెట్టాడు. ఈ ఘటనలో నిందితుడు ఓ ఎన్నారై కాగా.. భార్య గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన వారు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

జల్లికట్టుకు వెళ్లి తిరిగి వస్తుండ‌గా ఘోర‌ రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి, 11 మందికి గాయాలు

2016 అక్టోబర్ 24న బెంగళూరులోని ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా బాధితురాలికి, ఆమె భర్తకు పరిచయం ఏర్పడింది. తరువాత తమ నంబర్లు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని స్నేహితులయ్యారు. చివరికి డేటింగ్ మొదలుపెట్టి దాదాపు రెండేళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే వారి పెళ్లి మహిళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయినా వీరిద్దరు 2019 ఫిబ్రవరిలో వీరు వివాహం చేసుకున్నారు.

పెళ్లయిన తర్వాత అత్తమామలు తన రూపాన్ని బట్టి తిట్టడం, వెక్కిరించడం, వేధించడం మొదలుపెట్టారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త తనతో అసహజ శృంగారానికి ప్రయత్నించాడని, తాను నిరాకరించినప్పుడల్లా విడాకులు ఇస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది.

ఢిల్లీలో మరో రోడ్డు ప్రమాదం.. కారు వేగంగా ఢీకొట్టడంతో ఐఐటీ రీసెర్చ్ స్టూడెంట్ మృతి, మరొకరికి గాయాలు

గత ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు ఈ జంట తమ జీవితాల్లో బిజీ అయ్యారు. పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉండటంతో మూడు నెలల తర్వాత మళ్లీ అసహజ శృంగారానికి భర్త డిమాండ్ చేయడం ప్రారంభించాడు. కానీ ఆమె దానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. అతడిని కోరికను తిరస్కరించింది. దీంతో అతడికి కోపం వచ్చి భార్యను చితకబాదాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత తనను వదిలేసి స్పాన్సర్‌షిప్‌ను ఉపసంహరించుకున్నాడని తెలిపారు 2022 జూలై 30న ఆమెకు భర్త విడాకుల నోటీసు పంపారు.

బీజేపీ వీఐపీ ఆకతాయిలు : ఇండిగో విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను తెరిచింది తేజస్వి సూర్యనే.. కాంగ్రెస్

కాగా.. భారత రాయబార కార్యాలయం సహాయంతో ఆమె గుజరాత్‌కు తిరిగి వచ్చింది. అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత మహిళ డిప్రెషన్ కు గురయ్యింది. భర్తపై ఫిర్యాదు చేయడానికి ఆమె తల్లిదండ్రులు బాధితురాలుకు అండగా నిలిచారు. మద్దతు అందించారు. భర్త తనపై గృహహింసకు పాల్పడ్డాడని, అసహజ సెక్స్‌కు ఒడిగట్టాడని ఆమె శాటిలైట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 

click me!