కేరళ యువతిపై బైక్ టాక్సీ డ్రైవర్ గ్యాంగ్ రేప్ కేసులో.. మహిళ సహా, ఇద్దరు నిందితులు అరెస్ట్..

By SumaBala BukkaFirst Published Nov 30, 2022, 9:47 AM IST
Highlights

కేరళలో ర్యాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు బెంగళూరుకు చెందిన ఇద్దరు నిందితులను, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరు : కేరళకు చెందిన ఓ యువతిపై బెంగళూరులో బైక్ టాక్సీ డ్రైవర్, అతని స్నేహితుడు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అత్యాచార బాధితురాలు (22) తన ఫిర్యాదులో.. ఆమె అర్ధరాత్రి సమయంలో ఒక స్నేహితుడి ఇంటి నుంచి మరొక స్నేహితుడిని చూడటానికి వెళ్లేందుకు..  బైక్ టాక్సీని బుక్ చేసుకున్నానని పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైడ్ షేరింగ్ అప్లికేషన్ 'రాపిడో'లో బైక్ బుక్ చేసే సమయంలో ఆ మహిళ మద్యం మత్తులో ఉంది. డ్రైవర్ మహిళను ఆమె గమ్యస్థానానికి తీసుకెళ్లాడు. అయితే, బాగా మత్తులో ఉన్న ఆమె బైక్ దిగే పరిస్థితి లేదు.

దీంతో, పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకున్న డ్రైవర్ ఆ మహిళను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే మరో మహిళ ఉంది. ఈ విషయాన్ని అతను తన స్నేహితుడికి తెలిపాడు. కాసేపటికి అతను కూడా డ్రైవర్ తో చేరాడు. అత్యాచార బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఇద్దరు వ్యక్తులు ఆమెపై వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లారి మత్తు దిగిపోయి, స్పృహలోకి వచ్చినప్పుడు, ఆమెకు భయంకరమైన నొప్పి కలిగింది. వెంటనే తాను ఎక్కడున్నానో అర్థం కాలేదు. 

ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేసుకుంటే.. స్నేహితుడితో కలిసి అత్యాచారం చేసిన రైడర్..

కాసేపటికి తేరుకుని ఆమె నిందితుడి ఇంటి నుండి బయటకు వచ్చి సెయింట్ జాన్స్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు, ఆమె మీద అత్యాచారం జరిగిందని నిర్థారణకు వచ్చి, పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా బెంగళూరుకు చెందిన ఇద్దరు నిందితులను, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు

click me!