నా రాజీనామా నాజేబులోనే ఉంది, లేఖ చూపిస్తూ కీలక వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Jul 23, 2019, 6:44 PM IST
Highlights

తాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తినే అయినా స్పీకర్ గా చాలా హుందాగా వ్యవహరించానని చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఒకవేళ అలాంటి పరిస్థితి నెలకొంటే అప్పటికప్పుడే రాజీనామా చేసేందుకు రెడీగా ఉంటానన్నారు. 
 

కర్ణాటక: కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పటికి ఎవరికి తలొగ్గాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బలనిరూపణ పరీక్షకు సంబంధించి తాను జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నానంటూ బీజేపీ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. 

స్పీకర్ పదవి తనకు కొత్తేమీ కాదన్నారు రమేష్ కుమార్. తాను స్పీకర్ కుర్చీకి కట్టుబడి పనిచేశాననే తప్ప ఎవరికి తలొగ్గి పనిచేయలేదని చేయబోనని స్పష్టం చేశారు. రాజకీయాల్లో తనకు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అవకాశం కల్పించారని చెప్పుకొచ్చారు. 

తాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తినే అయినా స్పీకర్ గా చాలా హుందాగా వ్యవహరించానని చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఒకవేళ అలాంటి పరిస్థితి నెలకొంటే అప్పటికప్పుడే రాజీనామా చేసేందుకు రెడీగా ఉంటానన్నారు. 

ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తాను రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని తిరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తన జేబులో ఉన్న రాజీనామా లేఖను బీజేపీ శాసన సభాపక్ష నేత యడ్యూరప్పకు చూపించారు. యడ్యూరప్ప స్పీకర్ రాజీనామా లేఖను చూసి నవ్వుకున్నారు. 

 

కర్ణాటక అసెంబ్లీ లైవ్ : సోనియాగాంధీ కోరితేనే సీఎం అయ్యానన్న కుమారస్వామి

కర్ణాటక క్రైసిస్: అపార్టుమెంటు వద్ద ఆందోళన, చూడండి (వీడియో)

కర్ణాటక క్రైసిస్: ఇద్దరు ఎమ్మెల్యేల కోసం బీజేపీ,కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ

కర్ణాటక క్రైసిస్: అసెంబ్లీలో హై డ్రామా, నేడే బల పరీక్ష

కర్ణాటక క్రైసిస్: జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

అది నా అదృష్టపు గది, అందుకే అక్కడ ఉన్నా: కుమారస్వామి

బీజేపీలా కొనుగోలు చేయలేదు, మావాళ్లే వెన్నుపోటు పొడిచారు: కుమారస్వామి

click me!