కర్ణాటక సంక్షోభం: బెంగళూరులో 144వ సెక్షన్, వైన్ షాపులు బంద్

By telugu teamFirst Published Jul 23, 2019, 6:34 PM IST
Highlights

బెంగళూరులోని మద్యం షాపులను మూసేశారు. రేస్ కోర్స్ రోడ్డులోని నితేష్ అపార్టుమెంట్సు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అపార్టుమెంటు వెలుపల కాంగ్రెసు, బిజెపి మద్దతుదారులు ఘర్షణకు దిగారు. 

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభలో బలపరీక్షకు సిద్ధపడిన నేపథ్యంలో రాజధాని బెంగళూరులో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బెంగళూరులో 144వ సెక్షన్ విధించారు. ఈ నిబంధన మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు అమలులో ఉంటుందని బెంగళూరు పోలీసు కమిషనర్ ఆలోక్ కుమార్ చెప్పారు. 

బెంగళూరులోని పంబ్ లను, వైన్ షాపులను మూసేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని మద్యం షాపులను మూసేశారు. రేస్ కోర్స్ రోడ్డులోని నితేష్ అపార్టుమెంట్సు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అపార్టుమెంటు వెలుపల కాంగ్రెసు, బిజెపి మద్దతుదారులు ఘర్షణకు దిగారు. 

బలపరీక్ష నేపథ్యంలో ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యులు అపార్టుమెంటులో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఆ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా జెడిఎస్ - కాంగ్రెసు సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నారు. తాము బిజెపికి మద్దతు ఇస్తున్నామంటూ గవర్నర్ కు లేఖ రాశారు. 

 

 

కర్ణాటక అసెంబ్లీ లైవ్ : సోనియాగాంధీ కోరితేనే సీఎం అయ్యానన్న కుమారస్వామి

కర్ణాటక క్రైసిస్: అపార్టుమెంటు వద్ద ఆందోళన, చూడండి (వీడియో)

కర్ణాటక క్రైసిస్: ఇద్దరు ఎమ్మెల్యేల కోసం బీజేపీ,కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ

కర్ణాటక క్రైసిస్: అసెంబ్లీలో హై డ్రామా, నేడే బల పరీక్ష

కర్ణాటక క్రైసిస్: జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

నా రాజీనామా నాజేబులోనే ఉంది, లేఖ చూపిస్తూ కీలక వ్యాఖ్యలు

అది నా అదృష్టపు గది, అందుకే అక్కడ ఉన్నా: కుమారస్వామి

బీజేపీలా కొనుగోలు చేయలేదు, మావాళ్లే వెన్నుపోటు పొడిచారు: కుమారస్వామి

 

click me!