ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం కేసు విచారిస్తున్న అధికారి బదిలీ

By Siva KodatiFirst Published Aug 22, 2019, 4:32 PM IST
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్ఎక్స్ మీడియా కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి రాకేశ్ అహూజాపై బదిలీ వేటు పడింది. 

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్ఎక్స్ మీడియా కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి రాకేశ్ అహూజాపై బదిలీ వేటు పడింది.

ఆయనను ఢిల్లీ  పోలీస్ విభాగంలోకి బదిలీ  చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఆయన బదిలీ కావడం కలకలం సృష్టించింది.

మరోవైపు ఈడీలో అహూజా పదవీకాలం మూడు వారాల క్రితమే ముగిసినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఐఎన్ఎక్స్ మీడియా సంస్ధ రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడులు స్వీకరించేందుకు వీలుగా అనుమతులు ఇచ్చినందుకు గాను చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఎఫ్ఐపీపీ  అనుమతుల  కోసం తాము 2007లో లంచం ఇచ్చినట్లు ఐఎన్ఎక్స్ మీడియా  వ్యవస్ధాపకులు పీటర్ ముఖర్జియా, ఇంద్రాణీ  ముఖర్జియా చెబుతున్నారు.

ఆ సమయంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కార్తీ చిదంబరం అవినీతికి పాల్పడినట్లు తేలడంతో గతేడాది ఫిబ్రవరిలో ఆయనను అరెస్ట్ చేశారు. తాజా కేసులో అత్యంత  నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ అధికారులు చిదంబరాన్ని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. 

నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

ఐఎన్ఎక్స్ కేసు:చిదంబరానికి చుక్కెదురు, అరెస్ట్ తప్పదా?

చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ

కూతురిని హత్య చేసిన ఆమె... చిదంబరాన్ని పట్టించింది..!

click me!