శబరిమలలో హై టెన్షన్: ఆలయంలో లోపల మహిళా పోలీసులు

By sivanagaprasad kodatiFirst Published Nov 6, 2018, 9:59 AM IST
Highlights

మకరవిలక్కు పూజల కోసం శబరిమల ఆలయం తెరుచుకోవడంతో.. మరోసారి అయ్యప్ప సన్నిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. అన్ని వయస్సుల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ఆలయంలోకి వెళ్లేందుకు మహిళా భక్తులు భారీగా శబరిగిరుల్లో మకాం వేశారు

మకరవిలక్కు పూజల కోసం శబరిమల ఆలయం తెరుచుకోవడంతో.. మరోసారి అయ్యప్ప సన్నిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. అన్ని వయస్సుల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ఆలయంలోకి వెళ్లేందుకు మహిళా భక్తులు భారీగా శబరిగిరుల్లో మకాం వేశారు.

‘చితిర అట్ట విశేషం’ సందర్భంగా నిన్న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించారు. మాలధారణ చేసిన భక్తులు అయ్యప్పను దర్శించుకునేందుకు పోటెత్తారు.

మరోవైపు ఆలయంలోకి వెళ్లేందుకు మహిళా భక్తులు సిద్ధంగా ఉండటం... సేవ్ శబరిమల పేరుతో వీహెచ్‌పీ భారీ ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో శబరిమల, పంబ, నీలక్కల్, ఇలౌంగల్ ప్రాంతాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటుచేశారు.

ఆలయం లోపల 15 మంది మహిళా పోలీస్ ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. వీరంతా 50 ఏళ్లు పైబడిన వారు కావడం గమనార్హం. వీరిలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు స్వామి వారిని దర్శించుకోలేదని అధికారులు తెలిపారు.

వారిలో కొందరు మాట్లాడుతూ.. ‘‘ తామిక్కడ విధులు నిర్వహించడానికి వచ్చామని.. ఆలయ నిబంధనలు ఉల్లంఘించి దర్శనం కోసం ప్రయత్నించే మహిళలను అడ్డుకోవడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. ఇవాళ రాత్రి 10 గంటల వరకు అయ్యప్ప ఆలయం తెరిచే వుండటంతో శబరిమల పరిసరాల్లో హైటెన్షన్ నెలకొంది. 

శబరిమల: తెరుచుకొన్న అయ్యప్ప ఆలయం, భారీ బందోబస్తు

శబరిమల హోటళ్లలో మహిళలు.. గవర్నర్‌కు ఎమ్మెల్యే లేఖ

శబరిమల వివాదంపై మంచు మనోజ్ కామెంట్!

శబరిమలలోకి మహిళల ప్రవేశం..517 కేసులు.. 3,345 మంది అరెస్ట్

శబరిమల ఆలయంలోకి వెళ్లినందుకు...వేటు వేసిన బీఎస్ఎన్ఎల్

శబరిమల వ్యవహారాన్ని టాయ్ లెట్ తో పోల్చిన కమల్ హాసన్ సోదరుడు

శబరిమల.. ఐదుగురు తెలంగాణ మహిళలను అడ్డుకున్న ఆందోళనకారులు

శబరిమల వివాదంపై మొదటిసారి స్పందించిన రజినీకాంత్!

శబరిమల ప్రవేశం: మహిళల పట్ల వివక్ష అనడం దురదృష్టకరం..ప్రమాదం
 

click me!