కర్ణాటకలో హైటెక్ వ్యభిచారం.. డ్రెస్సింగ్ టేబుల్ కింద రహస్యమార్గం...!

By AN TeluguFirst Published Sep 22, 2021, 10:04 AM IST
Highlights

వ్యభిచార ముఠా చేతుల్లో ఇరుక్కున్న ఐదుమంది యువతులను పోలీసులు దాడిలో రక్షించారు. వీరంతా కోల్ కతాకు చెందిన వారని తేలింది. ఈ దాడిలో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. శహాపురవాడ్‌ వేశ్యావాటికను ఎస్సీ రాహుల్ పరిశీలించారు. ఈ క్రమంలో అతనికి కనిపించిన దృశ్యం షాకింగ్ కి గురి చేసింది. 

కర్ణాటకలో హైటెక్ వ్యభిచారం (Hi-tech prostitution racket) గుట్టు రట్టు చేశారు పోలీసులు. తుమకూరు సమీపంలో ఉన్న క్యాత్సంద్రలోని ఒక లాడ్జిలో గుట్టుగా వ్యభిచారం  నిర్వహిస్తున్న వేశ్యా వాటిక మీద పోలీసులు దాడి చేశారు. అక్కడ వారికి షాకింగ్ విషయాలు కనిపించాయి. 

వ్యభిచార ముఠా చేతుల్లో ఇరుక్కున్న ఐదుమంది యువతులను పోలీసులు దాడిలో రక్షించారు. వీరంతా కోల్ కతాకు చెందిన వారని తేలింది. ఈ దాడిలో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. శహాపురవాడ్‌ వేశ్యావాటికను ఎస్సీ రాహుల్ పరిశీలించారు. ఈ క్రమంలో అతనికి కనిపించిన దృశ్యం షాకింగ్ కి గురి చేసింది. 

రైడింగ్స్ జరిగితే తప్పించుకోవడానికి నిర్వాహకులు ఓ రహస్య మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ వేశ్యావాటికలోని డ్రెస్సింగ్ టేబుల్ కింద ఈ రహస్య మార్గం ఉండడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.. నిర్వాహకులను పట్టుకునే పనిలో పోలీసులు తీవ్రంగా నిమగ్నమై ఉన్నారు. 

చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ లో సూదులు గుచ్చి... ప్రియుడితో కలిసి చంపేసిన తల్లికి మరణశిక్ష

ఇదిలా ఉండగా, కర్ణాటక లోని బసశంకరిలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.  కలబుర్గికి చెందిన ఓ వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లోని అమ్మాయిల ఫోటోలు తీసుకుని అశ్లీలంగా మార్ఫింగ్ చేస్తున్నాడు.  ఇతన్ని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు ఆగ్నేయ విభాగ డిసిపి శ్రీనాథ్‌జోషి మాట్లాడుతూ ఇన్ స్టాలో గుడ్ బాయ్ బ్యాడ్ ట్రోల్ అనే పేజీని ఒక యువకుడు ఏర్పాటు చేశాడు. ఐటిఐ చదివిన ఈ యువకుడు రెండేళ్లపాటు బెంగళూరులో ఎలక్ట్రీషియన్ గా పనిచేశాడు.

కరోనా లాక్డౌన్ తర్వాత సొంతూరు కలబుర్గి వెళ్ళిపోయాడు. అమ్మాయిల ఫోటోలు అశ్లీలంగా మార్చి వారికి పంపుతూ పైశాచికానందాన్ని పొందేవాడు.  దీనిపై ఫిర్యాదులు రావడంతో మునిరెడ్డి మొబైల్ నెట్వర్క్ ఆధారంగా అతని ఆచూకీని గుర్తించి మంగళవారం అరెస్టు చేసినట్లు చెప్పారు. అతనికి సహకరించిన మరొకరు పరారీలో ఉన్నారు. 

click me!