గృహ నిర్బంధం నుంచి విడుదలైన హక్కుల నేత... కండిషన్స్ అప్లై

By sivanagaprasad kodatiFirst Published Oct 2, 2018, 7:40 AM IST
Highlights

భీమా-కోరెగావ్ అల్లర్ల కేసులో పుణె పోలీసులు పలువురు పౌర హక్కుల సంఘం నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసుల గృహ నిర్బంధంలో ఉన్న హక్కుల కార్యకర్త.. గౌతమ్ నవ్‌లఖాకు ఊరట లభించింది

భీమా-కోరెగావ్ అల్లర్ల కేసులో పుణె పోలీసులు పలువురు పౌర హక్కుల సంఘం నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసుల గృహ నిర్బంధంలో ఉన్న హక్కుల కార్యకర్త.. గౌతమ్ నవ్‌లఖాకు ఊరట లభించింది..

ఆయన్ను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు సూచించిన మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. దీనిని విచారించిన న్యాయస్థానం నవ్‌లఖాను ట్రాన్సిట్ రిమాండ్‌కు ఆదేశిస్తూ.. గత నెల 29న చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ వెలువరించిన ఉత్తర్వులను కొట్టి వేసింది.

రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలకు.. నేర శిక్ష్మా స్మృతికి వ్యతిరేకంగా ఆ ఉత్తర్వులు ఉన్నాయని.. చట్ట ప్రకారం నవ్‌లఖా 24 గంటల గృహ నిర్బంధం పూర్తయిందని తెలిపింది.. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఈ ఉత్తర్వులు అడ్డుకావని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పాటు పుణెకు సమీపంలోని భీమా-కోరెగావ్ గ్రామంలో జరిగిన అల్లర్ల కేసులో పౌరహక్కుల నేతలు వరవరరావు, వెర్నాన్ గోంజాల్వేస్, అరుణ్ ఫెరీరాయా, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లఖాను పోలీసులను అరెస్ట్ చేశారు. అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో వారిని గృహ నిర్బంధానికి పరిమితం చేశారు.

దర్యాప్తులో జోక్యం చేసుకోలేం.. వరవరరావు గృహనిర్బంధం పొడిగింపు: సుప్రీం

మోడీ హత్యకు కుట్ర: 'అరెస్టైన హక్కుల నేతల నుండి వందల లేఖలు'

మోదీ హత్యకు కుట్రపన్నలేదు:మావోలు లేఖ విడుదల

వరవరరావు గృహనిర్బంధం పొడిగింపు.. ఐపీఎస్‌పై సుప్రీం కన్నెర్ర

ఆయుధాలు దొరికే చోటు వరవరరావుకి తెలుసు: పూణే పోలీసులు

మోడీ హత్యకు కుట్ర: 'అరెస్టైన హక్కుల నేతల నుండి వందల లేఖలు'

ఇంటికి చేరుకున్న వరవరరావు: సుప్రీం ఆదేశాలపై స్పందన

వరవరరావు అరెస్టు: కంట తడి పెట్టిన భార్య హేమలత

వీవీ పత్రికకు ఎడిటర్‌ను, కేసుతో సంబంధం లేదు: జర్నలిస్ట్ క్రాంతి అరెస్ట్

click me!