తమిళనాడులో కుప్పకూలిన నేవీ హెలికాప్టర్...

Published : Oct 01, 2018, 05:24 PM IST
తమిళనాడులో కుప్పకూలిన నేవీ హెలికాప్టర్...

సారాంశం

రక్షణ శాఖకు చెందిన ఓ హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో కుప్పకూలింది. చెన్నై సమీపంలోని అరక్కోణం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే సీహెచ్442 హెలికాప్టర్ లో సాంకేతిక లోపాలు ఏర్పడి కూలిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 

ఈ ప్రమాదానికి సంబంధించి నావికా దళ అధికారులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. అరక్కోణంలోని రాజాలి ఐఎన్‌ఎస్ నావికా స్థావరం నుండి చేతక్ సీహెచ్442 హెలికాప్టర్ ముగ్గురు సిబ్బందితో బయలుదేరింది. అయితే ఇలా బయలుదేరిన కొద్ది సేపటికే హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో చెన్నై సమీపంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సిబ్బంది పారాచ్యూట్ ల సాయంతో హెలికాప్టర్ లోంచి దూకేసి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.   

సాధారణ శిక్షణలో భాగంగా బయలుదేరిన హెలికాప్టర్ ఇలా కుప్పకూలినట్లు నేవీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు  జరపనున్నట్లు అధికారులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే