ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పారికర్..కేబినెట్‌లో మార్పులు

By sivanagaprasad kodatiFirst Published Oct 14, 2018, 3:30 PM IST
Highlights

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పాన్‌క్రియాటిక్ సమస్యతో బాధపడుతున్న పారికర్ అమెరికా, ముంబైలలో చికిత్స చేయించుకున్నారు. 

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పాన్‌క్రియాటిక్ సమస్యతో బాధపడుతున్న పారికర్ అమెరికా, ముంబైలలో చికిత్స చేయించుకున్నారు.

అయినప్పటికీ వ్యాధి నయం కాకపోవడంతో గత నెల 15న ఎయిమ్స్‌లో చేరారు. సీఎం విధులకు దూరంగా ఉండటంతో రాష్ట్రంలో పాలనా వ్యవస్థ దెబ్బతింటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

అనారోగ్యంతో బాధపడుతూనే పారికర్ ఆసుపత్రి నుంచే పాలనా వ్యవహారాలు చూస్తున్నారు. ఇటీవల ఎయిమ్స్‌లోనే కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున పారికర్ ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉండటంతో ఆయనకు ఐసీయూలో చికిత్స అందించారు.

ఆ తర్వాత ఆరోగ్యం మెరుగవ్వడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లు ఎయిమ్స్ తెలిపింది. మరోవైపు తన కేబినెట్‌లో మార్పులు చేయాలని పారికర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన వద్ద ఉన్న మంత్రిత్వ శాఖలను ముఖ్యమంత్రి ఇతరులకు కేటాయించడంతో పాటు ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారి శాఖలను మార్చే అవకాశం ఉందని పనాజీలో చర్చ జరుగుతోంది.

ఆసుపత్రిలో పారికర్ కేబినేట్ మీటింగ్‌?

గోవా కుర్చీ కోసం బీజేపీ కాంగ్రెస్ సై

గోవాలో వేడెక్కుతున్న రాజకీయం

పారికర్ ఔట్.. గోవాకి కొత్త సీఎం..?

మళ్లీ ఆసుపత్రిలో చేరిన గోవా సీఎం.... ఆందోళనలో ప్రభుత్వ వర్గాలు, నేతలు

అలాంటి అమ్మాయిలను చూస్తే భయమేస్తోందంటున్న సీఎం
 

click me!