ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, మరో ముగ్గురికి గాయాలు

Published : Oct 14, 2018, 11:33 AM ISTUpdated : Oct 14, 2018, 11:39 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, మరో ముగ్గురికి గాయాలు

సారాంశం

:ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఆదివారం నాడు  జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

రాయ్‌పూర్:ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఆదివారం నాడు  జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

భిలాయ్ నుండి డొంగర్‌ఘడ్‌కు వెళ్తున్న కారు లారీని ఢీకొట్టింది. దీంతో  9 మంది అక్కడికక్కడే మృతి చెందారు.డొంగర్‌పూర్‌లోని మా బమ్లేశ్వరీ ఆలయాన్ని సందర్శించుకొని తిరుగు ప్రయాణమైన సమయంలో  ఈ ప్రమాదం చోటు చేసుకొంది. కారు డ్రైవర్ మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్ఠిందని పోలీసులు  చెబుతున్నారు. 

సంఘటనాస్థలంలోనే  తొమ్మిది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలంలో పోలీసులు  చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.  మృతులంతా దుర్గ్ జిల్లాలోని భిలాయ్ జిల్లాకు చెందినవారుగా  పోలీసులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే