BS Yediyurappa’s Granddaughter Hangs Self: యడియూరప్ప మ‌నువ‌రాలు మృతి !

By Mahesh RajamoniFirst Published Jan 28, 2022, 3:04 PM IST
Highlights

BS Yediyurappa’s Granddaughter Hangs Self: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప మనవరాలు బెంగళూరులోని వసంతనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌లో శుక్రవారం ఉరి వేసుకుని  అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 10 గంటల సమయంలో సౌందర్య ఇంట్లో పనిచేసే సహాయకురాలు తలుపు తట్టగా,  లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తో తలుపులు పగలగొట్టి చూడగా సౌందర్య తన  బెడ్‌రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఘటనాస్థిలిని పరిశీలించిన పోలీసులు.. ప్రాథమిక ఆధారాలు గుర్తించి.. ఇది ఆత్మహత్య కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 
 
ఆమె మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆస్పత్రికి చేరుకున్నారు. కాగా, సౌందర్య.. వైద్యురాలు. యడియూరప్ప మొదటి కుమార్తె అయన పద్మ కూతురు. ఆమెకు నాలుగు నెలల పాప ఉందనీ, గర్భధారణ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిందనే సోర్సెస్ పేర్కొంటున్నాయి. 

click me!