నా ఫ్రెండ్ ని సుఖ పెట్టు.. భార్యకు భర్త వేధింపులు..!

By telugu news teamFirst Published Jun 10, 2021, 12:08 PM IST
Highlights

ఏదో ఒక విషయంలో ఏదో ఒక విధంగా టార్చర్ చేసేవాడు. తాజాగా.. సెక్స్ విషయంలోనూ ఆమెను బలవంతం చేయడం మొదలుపెట్టాడు.

తాను కట్టుకున్న భర్తను మరో వ్యక్తి కన్నెత్తి చూస్తేనే చాలా మంది మగవాళ్లకు నచ్చదు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా.. భార్యతో మరో వ్యక్తితో సెక్స్ చేయాలంటూ బలవంత పెట్టాడు. భర్త వేధింపులు తట్టుకోలేకపోయిన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరుకు చెందిన వాసిమ్ షరీఫ్ కి 2018లో వివాహమైంది. పెళ్లైన కొంతకాలం బాగానే ఉన్న అతను.. ఆ తర్వాత నుంచి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఏదో ఒక విషయంలో ఏదో ఒక విధంగా టార్చర్ చేసేవాడు. తాజాగా.. సెక్స్ విషయంలోనూ ఆమెను బలవంతం చేయడం మొదలుపెట్టాడు.

ముఖ్యంగా.. తన స్నేహితులతో భార్యను సెక్స్ చేయాలంటూ బలవంత పెట్టడం మొదలుపెట్టాడు. గతంలో ఆమెకు రెండు సార్లు గర్భం రాగా.. బలవంతంగా అబార్షన్ చేయించాడు. మూడోసారి సదరు మహిళకు ఓ పాపకు జన్మనిచ్చింది.

పాప పుట్టిన తర్వాత కూడా భర్తలో మార్పు రాకపోగా.. తన స్నేహితులతో సెక్స్ చేయమని బలవంత పెట్టాడు. దీంతో.. అతని వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


 

click me!