కారణమిదే: రేప్ బాధితురాలికి విషం తాగించాడు

By narsimha lodeFirst Published Jan 13, 2019, 12:51 PM IST
Highlights

అత్యాచారానికి పాల్పడిన  నిందితులు బాధితురాలు కోర్టులో  సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు బలవంతంగా విషం తాగించారు. కానీ, బాధితురాలిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది

న్యూఢిల్లీ: అత్యాచారానికి పాల్పడిన  నిందితులు బాధితురాలు కోర్టులో  సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు బలవంతంగా విషం తాగించారు. కానీ, బాధితురాలిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన న్యూఢిల్లీకి సమీపంలోని  ద్వారకా జిల్లాలో చోటు చేసుకొంది.

న్యూఢిల్లీ సమీపంలోని ద్వారకా జిల్లాలోని హస్తసాల్ ఏరియాలో మైనర్ బాలిక ట్యూషన్ నుండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో   ఇద్దరు నిందితులు బైక్‌‌పై వచ్చి  బాధితురాలిని బెదిరించారు.

అత్యాచారానికి సంబంధించిన కేసులో సాక్ష్యం చెప్పొద్దని  బెదిరించారు.  ఆమె నిరాకరించింది. దీంతో  నిందితులు  ఆమెకు విషం తాగించి  పారిపోయారు. బాధితురాలు స్పృహ కోల్పోతున్న సమయంలోనే  ఓ ఆటోరిక్షాలో స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.  

ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితురాలు  శుక్రవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది రాన్హోలా పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో బాధితురాలిపై అత్యాచారం చోటు చేసుకొంది.  నిందితుడు ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. 

 

 

 

click me!