అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

By Nagaraju TFirst Published Oct 24, 2018, 5:30 PM IST
Highlights

సీబీఐ అవినీతి వివాదంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా లంచం కేసును విచారిస్తున్న 15 మంది అధికారులను బదిలీ చేస్తూ సీబీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీబీఐ తాత్కాలిక చీఫ్ నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీచేశారు. 
 

ఢిల్లీ: సీబీఐ అవినీతి వివాదంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా లంచం కేసును విచారిస్తున్న 15 మంది అధికారులను బదిలీ చేస్తూ సీబీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీబీఐ తాత్కాలిక చీఫ్ నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీచేశారు. 

దేశచరిత్రలో ఎన్నడూ లేనివిధంగావ సీబీఐలో అవినీతి వ్యవహారం దేశ వ్యాప్తంగా రచ్చ రచ్చ అవుతుంది. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. సీబీఐ చీఫ్‌ అలోక్ వర్మను సెలవులపై పంపిస్తూ తాత్కాలిక చీఫ్‌గా నాగేశ్వరరావును నియమించింది. 

సీబీఐ డైరెక్టర్ నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా కేసును విచారిస్తున్న అధికారులపై బదిలీ వేటు చేశారు. కేసును విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ ఏ.కే బాసీని అండమాన్ దీవులలోని పోర్టు బ్లేయిర్‌కు బదిలీ చేశారు. తక్షణమే విధుల్లో చేరాలని బాసీని సీబీఐ ఉత్తర్వుల్లో పేర్కొంది. అటు అడిషనల్ డీఎస్పీ ఎస్ ఎస్ గుర్మ్ ను మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు బదిలీ చేశారు.  

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా కేసును ఏ.కే బాసీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ బృందం విచారిస్తోంది. అయితే బాసీతో పాటు మరో 13 మంది అధికారులను కూడా బదిలీ చేశారు. ఏకే బాసీ బృందం స్థానంలో సీబీఐ డీఐజీ తరుణ్ గౌబా, ఎస్పీ సతీష్ దాగర్, జాయింట్ డైరెక్టర్ మురుగేషన్ నియమించింది. ఆస్థానా కేసు దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. 
 
మరోవైపు నూతన సీబీఐ డైరెక్టర్‌ గా మన్నెం నాగేశ్వరరావు నియామకంపై సెలవుపై వెళ్లిన సీబీఐ చీఫ్ అలోక్ వర్మ సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. అలోక్ వర్మ పిటీషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు వాయిదా వేసింది.  

సీబీఐలో నెంబర్-2గా పరిగణించే స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా ఢిల్లీలో మాంసాన్ని మాంసం ఎగుమతిదారుడు మోయిన్ ఖురేషీపై నమోదైన మనీలాండరింగ్ కేసులో హైదరాబాద్‌కు చెందిన సతీష్ సనా అనే వ్యాపారిని సీబీఐ అధికారులు విచారించారు. తనపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రాకేశ్ ఆస్థానాకు 2017 డిసెంబరు నుంచి పది నెలల్లో వివిధ దఫాల్లో రూ.2 కోట్లు ముడుపులు చెల్లించానంటూ సతీష్ సనా సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో రాకేశ్ ఆస్థానా పేరును చేర్చారు.

ఈ కేసులో ఆస్థానాకు లంచం ఇవ్వాల్సిన సొమ్మును తీసుకునేందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన మనోజ్ ప్రసాద్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. మొత్తం మీద దేశంలో అవినీతి, అక్రమాలను వెలికితీసి.. వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ చరిత్రలోనే ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది.

తనపై నమోదైన కేసుపై సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్థానా హైకోర్టును ఆశ్రయించారు. రాకేష్ ఆస్థానా పిటీషన్ పై విచారించిన ఢిల్లీ హైకోర్టు కేసును ఈనెల 29కి వాయిదా వేసింది. ఈనెల 29 వరకు అరెస్ట్ చేయోద్దని యధాస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. 

ఇకపోతే సీబీఐ డైరెక్టర్ల మార్పుని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సమర్థించుకుంది. సీబీఐ చీఫ్ అలోక్ వర్మ తమకు సహకరించడం లేదని ఆరోపించింది. కేసులకు సంబంధించి రికార్డులు ఇవ్వడం లేదని, ఉద్దేశపూర్వకంగానే అలోక్ వర్మ అడ్డంకులు సృష్టించారని ఆరోపించింది.

                                                              

 

ఈ వార్తలు కూడా చదవండి

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

రేప్ కేసులో తొలిసారి డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ వాడింది నాగేశ్వర రావే

సీబీఐ చీఫ్‌గా రెండో తెలుగోడు: ఎవరీ నాగేశ్వరరావు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

దేశచరిత్రలోనే తొలిసారిగా.. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా తెలుగు ఐపీఎస్

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ కు ఊరట:అరెస్ట్ చేయెుద్దన్న ఢిల్లీ హైకోర్టు

సతీష్ సానా ఇష్యూ: సిఎం రమేష్ ఇరుక్కున్నారా, టీడీపికి చిక్కులే...

జగన్ కేసు: అప్పటి నుండే సీబీఐ దర్యాప్తులో సతీష్ సానా పేరు

సీబీఐలో అంతర్యుద్దం: ఎవరీ సతీష్‌బాబు

 

click me!