రేప్ చేస్తే ఇక ఉరి శిక్షే... నూతన చట్టం చేసే పనిలో కేంద్రం

By telugu teamFirst Published Dec 1, 2019, 4:05 PM IST
Highlights

చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకొని, న్యాయవ్యవస్థలో జాప్యం వల్ల తప్పించుకొని తిరుగుతున్న రేపిస్టులకు ఇక తెర దించే పనిలో పడింది కేంద్రం. 

న్యూ ఢిల్లీ: హైద్రాబాబ్డ్ లో ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. ప్రతిఒక్కరూ ఈ హేయమైన చర్యను ఖండిస్తూ, నేరస్థులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని సత్వరం న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. 

సినీ హీరో మహేష్ బాబు సైతం ప్రధాని మోడీకి, కేటీఆర్ కి ట్విట్టర్లో చట్టాలను మార్చాల్సిందే అని విన్నవించారు. సోషల్ మీడియాలో, బయట ప్రతి ఒక్కరు కూడా నేరస్థులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. 

మన దేశంలో కోర్టు తీర్పులు వెలువడడానికి ఎంత సమయం పడుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిర్భయ కేసు దానికి ఒక మంచి ఉదాహరణ. ఇలా చట్టం వల్ల ఆలస్యం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకొచ్చే పనిలో ఉంది. 

Also read: ప్రియాంక హత్య: మీరు ఆ పని చేయాల్సిందే.. మోడీ, కేటీఆర్ కు మహేష్ బాబు రిక్వస్ట్!

హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు స్వస్తిపలకాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం తీసుకుంది. ఇప్పుడు ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరించనుంది. 

ఇక మీదట ఎవరైనా రేప్ చేస్తే హై కోర్టును కూడా బైపాస్ చేస్తూ నేరుగా ఉరి శిక్షను విధించే వీలుంటుంది. అప్పుడు ఆ సదరు ముద్దాయికి సుప్రీమ్ కోర్టుకు తప్ప వేరే ఏ ఆప్షన్ కూడా మిగలకుండా చేయవచ్చు. తద్వారా న్యాయం జరగడంలో జరిగే జాప్యాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. 

ప్రజలు నిన్న శంషాబాద్ పోలీస్ స్టేషన్ బయట కానీ, నేడు చర్లపల్లి జైలు బయట కానీ, నినాదాలు చేయడానికి కారణం కోర్టు తీర్పులు చెప్పడానికి జరిగే జాప్యం. ఇలా జాప్యం జరగడం వల్లనే ప్రజలు ఆ నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

నిర్భయ కేసులో గనుక తీసుకుంటే, సంఘటన జరిగింది 2012 డిసెంబర్ లో, కింది కోర్ట్ తీర్పు వెలువరించింది 2013 సెప్టెంబర్ లో. ఆ తరువాత నిందితులు హై కోర్టులో అప్పీల్ కి వెళ్లారు. హై కోర్ట్ 2014లో కింద కోర్టు విధించిన మరణ దండన సరైందేనని చెప్పింది. 

వారు ఆ తరువాత సుప్రీమ్ కోర్టుకు కూడా వెళ్లారు. సుప్రీమ్ కోర్ట్ 2017 మేలో వారికి ఉరి శిక్ష విధించాల్సిందేనని చెప్పినప్పటికీ, ఇంతవరకు వారిని ఉరి తీయలేదు. ఇప్పటికి వారు తీహార్ జైల్లోనే గడుపుతున్నారు. 

Also read: నో అప్పీల్స్.. ఓన్లీ హ్యాంగింగ్: చట్టాలను మార్చండి, ప్రధాని మోడీకి కేటీఆర్ ట్వీట్

ఇలాంటి జాప్యాలను తగ్గించేందుకే ఈ నూతన చట్టాన్ని తీసుకురానున్నారు. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇలాంటి కఠిన చట్టాలైనా ఇలాంటి కామాంధులను ఆపుతాయో లేదో చూడాలి. 

click me!