ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యాపారి ఇంట్లో ఐదుగురు దొంగలు పడ్డారు. వారు నగలు, డబ్బులు ఎత్తుకెళ్లడంతోపాటు ఇంట్లో ఇంటరిగా ఉన్న ఆ బిజినెస్ మ్యాన్ భార్యపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ బిజినెస్ మ్యాన్ ఇంటిలో ఐదుగురు దొంగలు పడ్డారు. విలువైన వస్తువులను, డబ్బును సేకరించారు. అదే సమయంలో ఇంట్లో ఆ వ్యాపారి భార్య ఒక్కరే ఉన్నారు. దొంగతనం చేయడంతోపాటు వారంతా ఆమెపైనా కర్కశంగా గ్యాంగ్ రేప్ చేశారు. ఆమెను తాళ్లతో కట్టేసి సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టారు. సిగరెట్ల మొనలతో ఆమె చర్మంపై కాల్చారు. ఈ ఘటన యూపీలోని బిజ్నోర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆ బిజినెస్‌మ్యాన్ తన తల్లి, పిల్లలతో కలిసి చికిత్స కోసం ఓ వైద్యుడి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో వ్యాపారి భార్య ఒక్కరే ఉన్నారు. ఆ దొంగలు మద్యం మత్తులో ఉన్నారు. ఇంట్లోకి చొరబడి బంగారు నగలు, రెండు కిలోల వెండి వస్తువులు, రూ. 1.5 లక్షల నగదును పట్టుకున్నారు. అలాగే.. ఓ స్కూటర్, ఎల్‌ఈడీ టీవీని కూడా వారు పట్టుకుని వెళ్లడానికి సిద్ధం చేసుకున్నారు. అల్మారా, ఇతర గదుల తాళాలను కట్ చేసి ఈ దొంగతనానికి తెరలేపారు.
వ్యాపారి భార్యకూ మత్తు ఇచ్చారు. ఆమెను తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత దొంగలు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం, ఆ వస్తువులను అన్నింటిని పట్టుకుని పారిపోయారు.
Also Read: అంగస్తంభనల కోసం వాటికి షాక్ థెరపీ.. 45 ఏళ్ల వయసులో ఆ మిలియనీర్ చేసే ప్రయోగాలివే
సదరు బిజినెస్ మ్యాన్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు ఫిర్యాదు అందించాడు. కానీ, పోలీసులు కేసు నమోదు చేయకుండా ఘటనను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. కానీ, మీడియాలోనూ ఈ ఘటన గురించి వివరాలు రావడంతో కేసు ఫైల్ చేసినట్టు సమాచారం.
అక్టోబర్ 19వ తేదీన కూడా ఓసారి దొంగలు పడ్డట్టు ఆ వ్యాపారి చెప్పారు. అప్పుడు తనను నిర్బంధించి రూ. 80 వేలు లూటీ చేశారని ఆరోపించారు. అప్పుడు కూడా పోలీసులకు చెబితే చర్యలు తీసుకుంటామని గాలికి వదిలేశారని అన్నారు.
ఇప్పుడు చోరీ, గ్యాంగ్ రేప్ కింద కేసులు నమోదు చేశారు.