పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

By telugu teamFirst Published Sep 15, 2019, 9:42 PM IST
Highlights

గోదావరిలో జరిగిన పడవ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించినవారికి సంతాపం ప్రకటించారు. పడవ ప్రమాదంపై కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ కూడా విచారం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: గోదావరి నదిలో లాంచీ మునకపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ బోటు నదిలో మునిగి పోయిందని తెలిసి ఎంతో బాధ పడుతున్నానని తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు. విషాద ఘటన జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని మోదీ ట్వీట్ చేశారు. 

కాగా, తూర్పు గోదావరి జిల్లా దేవీ పట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 12 మంది మృత్యువాత పడ్డారు. పడవలో 61 మంది ఉండగా, అనేకమంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

గోదావరిలో పడన ప్రమాదంపై కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నదిలో పడవ ప్రమాదంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించినవారికి ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గల్లంతైనవారు క్షేమంగా బయటపడాలని ఆయన ఆశించారు.

సంబంధిత వార్తలు

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

 

click me!