ద్రవ్యోల్బణం అదుపులో ఉంది: స్పష్టం చేసిన నిర్మలా సీతారామన్

By Siva KodatiFirst Published Sep 14, 2019, 3:59 PM IST
Highlights

ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటంతో పాటు ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వచ్చారు. ద్రవ్యోల్బణం ప్రస్తుతం అదుపులోనే ఉందని.. ఎగుమతులపై పన్ను తగ్గింపుపై పునరాలోచిస్తున్నామని సీతారామన్ స్పష్టం చేశారు

ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటంతో పాటు ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వచ్చారు. ద్రవ్యోల్బణం ప్రస్తుతం అదుపులోనే ఉందని.. ఎగుమతులపై పన్ను తగ్గింపుపై పునరాలోచిస్తున్నామని సీతారామన్ స్పష్టం చేశారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో వృద్ధిరేటు ఆశాజనకంగానే ఉందని.. క్రెడిట్ గ్యారెంటీ స్కీంతో పరిస్ధితులు మెరుగుపడతాయని భావిస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు.

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రుణ వితరణ పెరుగుతోందని.. ఆర్ధిక రంగం బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు. ఎంఈఐఈఎస్ పథకం అమలుతో ఎగుమతులు భారీగా పెరుగుతాయని నిర్మల తెలిపారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్‌తో భారత్ స్థానం మెరుగైందని ఆర్ధిక మంత్రి వెల్లడించారు. టెక్స్‌టైల్స్ ఎగుమతులకు త్వరలోనే కొత్త పథకం తీసుకొస్తామని... 2020 నాటికి ఇది అమల్లోకి వస్తుందని నిర్మల ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 19న బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు విత్త మంత్రి చెప్పారు. 

click me!