స్వలింగ సంపర్కులంటే ఒకే.. కానీ స్వలింగ వివాహాలు ఆమోదయోగ్యం కాదు - బీజేపీ ఎంపీ సుశీల్ మోడీ

By team teluguFirst Published Dec 20, 2022, 9:07 AM IST
Highlights

స్వలింగ సంపర్కులు అంటే ఒకే కానీ వారి వివాహానికి చట్టబద్దత అంటే అది ఆమోదయోగ్యం కాదని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ మోడీ అన్నారు. ఈ అంశంపై పార్లమెంట్ లో, సమాజంలో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

పార్లమెంటులో సోమవారం స్వలింగ వివాహాలపై చర్చ జరిగింది. అయితే ఈ తరహా వివాహాలను బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ మోడీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి సామాజిక అంశంపై సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు కూర్చుని నిర్ణయం తీసుకోలేరని అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎన్ డీటీవీ’కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. స్వలింగ సంపర్కులు అంటే ఒకే కానీ.. స్వలింగ వివాహాలు ఆమోదయోగ్యం కాదని అన్నారు.

ప్రియుడిని చంపి, డ్రమ్ములో కుక్కి.. అడవిలోకి తీసుకెళ్లి తగలబెట్టి.. ఓ ప్రియురాలి ఘాతుకం..

“ఏ చట్టం అయినా దేశ సంప్రదాయాలు, సంస్కృతులకు అనుగుణంగా ఉండాలి. భారతీయ సమాజం అంటే ఏమిటి ? ప్రజలు దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా ? అని మనం అంచనా వేయాలి. ’’ అని అన్నారు. “ స్వలింగ సంబంధాలు నేరంగా పరిగణించారు. కానీ వివాహం పవిత్రమైనది. స్వలింగ జంటలు కలిసి జీవించడం ఒక విషయం అయితే దానికి చట్టపరమైన హోదా ఇవ్వడం మరో అంశం’’ అని సుశీల్ మోడీ తెలిపారు. స్వలింగ సంపర్కానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మాట్లాడిన సుశీల్ మోడీ స్వలింగ సంపర్కులు ఆమోదయోగ్యమైనవేనని.. అయితే అలాంటి వివాహాలను అనుమతించడం వల్ల అనేక స్థాయిల్లో సమస్యలు తలెత్తుతాయని ‘ఎన్‌డీటీవీ’తో ఆయన అన్నారు. 

గడ్డపారతో విద్యార్థిపై టీచర్ దాడి.. నాల్గోతరగతి స్టూడెంట్ మృతి..

అంతకు ముందు సోమవారం రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడుతూ.. సామాజిక, సాంస్కృతిక నేపథ్యంలో దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జీరో అవర్‌లో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. ‘కొందరు వామపక్ష-ఉదారవాద కార్యకర్తలు’ స్వలింగ వివాహాలకు చట్టపరమైన రక్షణ పొందడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇది ఆమోదయోగ్యం కాదని సుశీల్ మోడీ వాదిస్తూ.. “దేశ సాంస్కృతిక విలువలకు విరుద్ధమైన ఇలాంటి నిర్ణయాలేవీ న్యాయవ్యవస్థ ఇవ్వకూడదు…” అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

సబ్సిడీ రుణాల పేరుతో టీఆర్‌ఎస్‌ మైనార్టీలను అవమానిస్తోంది: కాంగ్రెస్‌

“నేను స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపును వ్యతిరేకిస్తున్నాను. భారతదేశంలో స్వలింగ వివాహానికి గుర్తింపు లేదు. క్రోడీకరించబడని వ్యక్తిగత చట్టంలో లేదా ముస్లిం పర్సనల్ లా వంటి క్రోడీకరించబడిన రాజ్యాంగ చట్టాలలో ఇది ఆమోదయోగ్యం కాదు. స్వలింగ వివాహాలు దేశంలో ఉన్న వివిధ వ్యక్తిగత చట్టాల మధ్య సున్నితమైన సమతుల్యతను పూర్తిగా దెబ్బతీస్తాయి” అని సుశీల్ మోడీ తెలిపారు.

బీజేపీ ప్రభుత్వం 'బయట సింహంలా మాట్లాడుతూ.. లోపల ఎలుకలా పనిచేస్తుంది': కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే

స్వలింగ వివాహాలకు వ్యతిరేకంగా కోర్టులో కూడా కఠినంగా వాదించాలని సుశీల్ మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇద్దరు న్యాయమూర్తులు కూర్చుని ఇంత ముఖ్యమైన సామాజిక సమస్యపై నిర్ణయం తీసుకోలేరని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది పార్లమెంటులో, సమాజంలో విస్తృతంగా చర్చ జరగాల్సిన అంశం అని అన్నారు. 

click me!