ఓటేయండి .. వేలికున్న ఇంక్ చూపించండి... అద్భుతమైన డిస్కౌంట్ పొందండి..!!

By Arun Kumar P  |  First Published May 15, 2024, 1:44 PM IST

ఓటుహక్కు చాలా విలువవైనది... కానీ దీనివల్ల తమకేంటి ఉపయోగం అనుకుని కొందరు  ఓటేయడం లేదు. అలాాంటి వారికోసమే సరికొత్త ఆఫర్ ప్రకటించింది రెస్టారెంట్ ఆండ్ హోటల్స్ అసోసియేషన్. ఆ ఆఫర్ ఏమిటో తెలుసుకొండి... 


ముంబై : ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది వజ్రాయుధం లాంటిది. దేశ భవిష్యత్ నే మర్చేసే సత్తా ఈ ఓటుకు వుంటుంది. మంచి పార్టీలను, ప్రజాసేవ చేసే పాలకులను ఎన్నుకుంటే దేశ భవిష్యత్ కూడా అద్భుతంగా వుంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఓటును వినియోగించుకునేందుకు కొందరు బద్దకిస్తున్నారు. అలాంటి వారిని పోలింగ్ బూత్ కు రప్పించేందుకు ఎలక్షన్ కమీషన్ ఎంతో ప్రయత్నిస్తోంది. ఓటర్లలో చైతన్యం పెంచే కార్యక్రమాలను చేపడుతోంది. ఇప్పుడు ఈసి బాటలోనే కొన్ని సామాజిక, ప్రైవేట్  సంస్థలు కూడా నడుస్తున్నాయి ... ప్రతి ఒక్కరికి ఓటు విలువ తెలిసే కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇలా ఓటర్ల చైతన్యం కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించింది వెస్ట్రన్ ఇండియా రెస్టారెంట్స్ అసోసియేషన్. 

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో మే 20న పోలింగ్ జరగనుంది. అయితే గ్రామీణ ఓటర్ల కంటే పట్టణ ఓటర్లే ఎక్కువగా పోలింగ్ కు దూరంగా వుంటారు. ఇలా ముంబైలో కూడా గతంలో జరిగిన పలు ఎన్నికల్లో చాలా తక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యింది. దీంతో ఈసారి ఎలాగైన ముంబై ఓటర్లను పోలింగ్ రోజున ఇళ్లనుండి బయటకు తీసుకువచ్చేందుకు పశ్చిమ ఇండియా హోటల్ అసోసియేషన్ చొరవ తీసుకుంది. 

Latest Videos

undefined

ఐదో దశలో అంటే మే 20న ఓటుహక్కును వినియోగించుకునేవారికి తమ రెస్టారెంట్స్ లో డిస్కౌంట్ వుంటుందని హోటల్స్ మరియు రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది. ముంబై  లోని పలు హోటల్స్ పోలింగ్ రోజున అంటే మే 20, ఆ తర్వాతి రోజు అంటే మే 21 న ఈ ఆఫర్ వుంటుందని ప్రకటించాయి. ఈ రెండురోజులు ఓటు వేసాక చేతికి పెట్టే సిరా చుక్కను చూపించడం ద్వారా  ఫుడ్ బిల్లులు 10-20 శాతం డిస్కౌంట్ వుంటుందని రెస్టారెంట్స్ మరియు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. 

ఇలా ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్య స్పూర్తిని కాపాడటమే కాదు మంచి ఫుడ్ ను తక్కువ ధరలకు ఆస్వాదించవచ్చని హోటల్స్ మరియు రెస్టారెంట్స్ అసోసియేషన్ అంటోంది. ప్రజలు ఓటు వేయడం ద్వారా ఈ అవకాశాన్ని పొందాలని సూచించారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈ అసోసియేషన్ పేర్కొంటోంది. 

 
 

click me!